S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారం వారం గోచారం (27.10.2019 నుంచి 2.11.2019 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఈ వారం ప్రారంభంలో భాగస్వామ్యాలపై దృష్టి. పరిచయాలు స్నేహానుబంధాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అధికారులతో సంబంధ బాంధవ్యాలుంటాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడిపే ప్రయత్నం చేస్తారు. నిర్ణయాదులను ఆచితూచి తీసుకోవాల్సి ఉంటుంది. శ్రమాధిక్యం. వారం మధ్యమంలో అనుకోని సమస్యలు. గౌరవ లోపాలు. ముఖ్య నిర్ణయాలను వాయిదా వేసుకోవడం మంచిది. అనారోగ్య భావనలుంటాయి. కుటుంబం ఆర్థికాంశాలు ప్రభావితం అవుతాయి. మాటల్లో కొంత జాగ్రత్త అవసరం. పోటీలు వ్యతిరేకతలు అత్యధికం. తొందరపాటుగా ప్రవర్తించకూడదు. వారాంతంలో ఉన్నత లక్ష్యాలపై దృష్టి ఉంటుంది. కానీ ఆశించిన వేగంతో వ్యవహారాల నిర్వహణ కష్టం. అసంతృప్తి. కార్యాలు ఆలస్యం అవుతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఈ వారం ప్రారంభంలో సంప్రదింపులుంటాయి. అధికారికమైన సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలుంటాయి. సోదరవర్గ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. విద్యాత్మక అంశాలు, కీర్తి ప్రతిష్ఠలపై దృష్టి. కొత్త వార్తలు అందుకునే అవకాశం. కొంత మనసు కలత పడవచ్చు. ఉన్నత వ్యవహారాల నిర్వహణలో ఉంటారు. వారం మధ్యమంలో ఆహార విహారాలు సంతోషాన్నిస్తాయి. సౌఖ్యంగా గడుపుతారు. సౌకర్యాలు పెంచుకుంటారు. శ్రమ ఉన్నా ఫలితాలు సంతృప్తినిస్తాయి. మాతృవర్గ సంబంధ బంధువులకు మేలు కలుగుతుంది. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులు తప్పకపోవచ్చు. అధికారిక వ్యవహారాలపై దృష్టి. వారాంతంలో మానసికమైన ఒత్తిడులు. సంతాన వ్యవహారాల్లో నిర్ణయ లోపాలు. ముఖ్య నిర్ణయాలు ఆలస్యం అవుతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఈ వారం ప్రారంభంలో లాభాలపై దృష్టి. అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. గుర్తింపు లభిస్తుంది. ఆలోచనలకు రూపకల్పన. సంతానవర్గ వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. అధికారుల ఆదరణ లభిస్తుంది. వారం మధ్యమంలో విశ్రాంతి లభిస్తుంది. దానధర్మాల వల్ల మేలు కలుగుతుంది. ప్రయాణాలు సంతోషాన్నిస్తాయి. ఆధ్యాత్మిక యాత్రలకు అనుకూలం. వైజ్ఞానిక ధోరణి పెరుగుతుంది. వ్యతిరేకతలపై విజయం. గుర్తింపు లభిస్తుంది. అన్ని పనులకూ అనుకూలం. శ్రమతో కార్యాలు. వారాంతంలో నిర్ణయాదులు ఇబ్బంది పెట్టవచ్చు. కార్యనిర్వహణ సమస్యలు. శ్రమాధిక్యం. వ్యవహార లోపాలుంటాయి. భాగస్వామితో సమస్యలుంటాయి. పరిచయాలు స్నేహానుబంధాల విషయంలో అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో వ్యతిరేకతలు అధికం. పోటీలు ఒత్తిడులు చికాకులు తప్పకపోవచ్చు. ఆరోగ్య విషయంలోనూ కొంత జాగ్రత్త అవసరం. విజయం సాధించినా కావల్సిన సంతృప్తి లభించదు. శ్రమాధిక్యం. విశ్రాంతి లోపం. వ్యర్థమైన ప్రయాణాలు. దుబారా ఖర్చులు. వారం మధ్యమంలో పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. కార్యానుకూలత. పెద్దలతో కలిసి తిరిగే అవకాశం. గురువులను సేవిస్తారు. ఆలోచనల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. కొత్త పనుల నిర్వహణలో అప్రమత్తంగా మెలగాలి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. వారాంతంలో అనుకోని సమస్యలుంటాయి. ఊహించని సంఘటనలు. అనారోగ్యం. ముఖ్య నిర్ణయాలను వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబంలో ఒత్తిడులు అధికం. ఆర్థిక వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో కుటుంబంలో కొన్ని ఒత్తిడులుంటాయి. మాటల్లో అధికారిక ధోరణి తగ్గించుకోవాలి. నిల్వధనంపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. ఊహించని సంఘటనలు. శారీరక ఒత్తిడులు అధికవౌతాయి. మనసు కల్లోలంగా ఉంటుంది. మానసిక, భౌతిక ప్రమాదాలకు అవకాశం. వారం మధ్యమంలో సంప్రదింపులకు అనుకూలం. మీడియా రంగం వారికి విశేష ఫలితాలు. దగ్గరి ప్రయాణాలు. పెద్దల సహకారం లభిస్తుంది. ఉన్నత వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. కీర్తి ప్రతిష్ఠలు విస్తరిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల రూపకల్పన, నిర్వహణలో పాల్గొంటారు. దైవధ్యానం, దానం వల్ల మరింత మేలు. వారాంతంలో సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి. ఆహార విహారాల్లో జాగ్రత్త అవసరం. శారీరక మానసిక ఒత్తిడులుంటాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఈ వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. పదోన్నతులకు అవకాశం. సామాజిక గౌరవం పెరుగుతుంది. వ్యాపారం, కాంటాక్ట్ రంగాలు విస్తరిస్తాయి. శ్రమ ఉన్నా ఫలితాలుంటాయి. కార్యనిర్వహణ దక్షత. సౌకర్యాలపై దృష్టి. ఆహార విహారాలకు అనుకూలత. పితృవర్గ సంబంధ బంధువుల వ్యవహారాలపై దృష్టి. వారం మధ్యమంలో లాభాలు సంతోషాన్ని సంతృప్తినిస్తాయి. అన్ని పనుల్లో ప్రయోజనాలు. పెద్దల ఆశీస్సులుంటాయి. వ్యతిరేకతలపై విజయం. పోటీలలో గుర్తింపు లభిస్తుంది. కొత్త పనుల నిర్వహణపై దృష్టి కేంద్రీకరిస్తారు. వారాంతంలో వ్యర్థమైన ఖర్చులు. అనవసర వ్యయం ఉంటుంది. దాన ధర్మాలవల్ల మేలు కలుగుతుంది. ఆధ్యాత్మిక వ్యవహారాలు సంతోషాన్నిస్తాయి. ప్రయాణాలలో ఇబ్బందులుంటాయి. పోటీలు ఒత్తిడులు అధికం.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఈ వారం ప్రారంభంలో ఆలోచనలకు అనుకూలం. సంతాన వర్గ వ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగాలి. ప్రణాళికాబద్ధమైన జీవిత విధానం ఒత్తిడి అధికం. లాభాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. సృజనాత్మక శక్తి ఉంటుంది. పెద్దలు, అధికారులతో కలయికలు. వారం మధ్యమంలో పోటీ రంగంలో గుర్తింపు ఉంటుంది. వ్యతిరేక ప్రభావాలను ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. రుణ బాధలు తీరుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కాంపిటీషన్స్‌లో విజయం. ఖర్చులు పెట్టుబడులుంటాయి. విందులు విహారాలకు అనుకూలం. విశ్రాంతి లభిస్తుంది. వారాంతంలో పరిచయాలు, స్నేహానుబంధాలు ఇబ్బంది పెట్టవచ్చు. పాతమిత్రుల వల్ల కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశం.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఈ వారం ప్రారంభంలో నిర్ణయాదుల్లో ఒత్తిడులుంటాయి. ఆత్మవిశ్వాసం ఉన్నా శ్రమాధిక్యం. కొంచెం అనారోగ్య భావన. భాగస్వామ్యాల్లో శుభ పరిణామాలు. పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. అధికారిక వ్యవహారాల్లో తలమునకలవుతారు. పితృవర్గ సంబంధీకులతో ఇబ్బందులు. వారం మధ్యమంలో కుటుంబంలో అనుకూలత. మాట విలువ పెరుగుతుంది. ఆలోచనలు ఫలిస్తాయి. నిల్వధనం పెరుగుతుంది. బంధువర్గ వ్యవహారాలు సంతోషాన్నిస్తాయి. కొన్ని అనుకోని ఇబ్బందులున్నా అధిగమిస్తారు. ఊహించని ప్రయోజనాలుంటాయి. వారాంతంలో సంప్రదింపుల్లో జాగ్రత్త. సేవకవర్గ సహకారం లభిస్తుంది. వార్తలు కలవరపెట్టే అవకాశం. ప్రయాణాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. ఉన్నత వ్యవహారాల్లో లోపాలుంటాయి.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఈ వారం ప్రారంభంలో ఉన్నత లక్ష్యాలపై దృష్టి. అన్ని పనుల్లోనూ అనుకూలత. కొంత అసంతృప్తి ఉంటుంది. సుదూర ప్రయాణ లక్ష్యాలు నెరవేరుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అధికారిక వ్యవహారాలకు అనుకూలం. పితృవర్గ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి. అధికారిక సహకారం లభిస్తుంది. వారం మధ్యమంలో వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. బాధ్యతలు విస్తరిస్తాయి. అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. కార్యనిర్వహణలో తలమునకలవుతారు. గౌరవం పెరుగుతుంది. సౌకర్యాలు సమకూర్చుకుంటారు. ఆహార విహారాలకు అనుకూలం. సంతోషంగా గడుపుతారు. విందులు వినోదాలుంటాయి. వారాంతంలో ఆశించిన ప్రయోజనాలు అందవు. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. లాభాలు ఇబ్బంది పెట్టే అవకాశం. కొత్త పనుల నిర్వహణ వాయిదా వేసుకోవాలి.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఈ వారం ప్రారంభంలో ఆహార విహారాలపై దృష్టి. గృహ వాహనాది ప్రయాణ సౌకర్యాలు శ్రమకు గురిచేసే అవకాశం. శ్రమతో కార్యాలు. మాతృవర్గ బంధువులతో సమస్యలున్నా అధిగమిస్తారు. శారీరక ఒత్తిడులుంటాయి. వృత్తి ఉద్యోగాదుల విషయంలో శుభ పరిణామాలు. పదోన్నతులుంటాయి. వారం మధ్యమంలో అభీష్టాలు నెరవేరుతాయి. సంతానవర్గ వ్యవహారాల్లో శుభ నిర్ణయాలుంటాయి. సంతోషంగా గడుపుతారు. ప్రణాళికలు ఫలిస్తాయి. కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం. క్రియేటివిటీతో పని చేస్తారు. స్పెక్యులేషన్స్ లాభిస్తాయి. లాభాలు సంతోషాన్ని, సంతృప్తినీ ఇస్తాయి. వారాంతంలో వ్యతిరేక ప్రభావాలు అధికవౌతాయి. పోటీల్లో నిలదొక్కుకోవడం కష్టం. శ్రమ అధికవౌతుంది. మొండితనం పెరిగే అవకాశం. రుణభారం ఇబ్బంది పెట్టవచ్చు.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఈ వారం ప్రారంభంలో ఖర్చులు పెట్టుబడులు ఇబ్బంది పెట్టే అవకాశం. విందులు, విహారాల కోసం కాలం ధనం వెచ్చిస్తారు. అధికారిక ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది. విశ్రాంతి కోసం ప్రయత్నం. పోటీలు ఒత్తిడులను అధిగమిస్తారు. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. వారం మధ్యమంలో ఆత్మవిశ్వాసంతో కార్యక్రమాలు నిర్వహిస్తారు. గౌరవం పెరుగుతుంది. అనేక బాధ్యతలుంటాయి. నిర్ణయాదులకు అనుకూలం. కార్యనిర్వహణలో సంతోషం, సంతృప్తి. భాగస్వామితో అనుకూలంగా ఉంటారు. అనేక ప్రయోజనాలుంటాయి. పరిచయాలు, స్నేహానుబంధాలు బాగా విస్తరించే అవకాశం. వారాంతంలో కుటుంబంలో ఒత్తిడులుంటాయి. మాట విలువ తగ్గుతుంది. నిల్వధనం కోల్పోయే అవకాశం.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ వారం ప్రారంభంలో అనుకోని సమస్యలుంటాయి. అధికారిక లోపాలకు అవకాశం. ఆరోగ్యం ఇబ్బంది పెట్టే సూచనలు. ముఖ్య కార్యక్రమాలను వాయిదా వేయడం మంచిది. అన్ని పనుల్లోనూ అప్రమత్తంగా మెలగాలి. కుటుంబ ఆర్థికాంశాల్లో కొంత అనుకూలత. మాటల్లో అధికారిక ధోరణి. వారం మధ్యమంలో సుదూర లక్ష్యాలు నెరవేరుతాయి. ఉన్నత పదవులు. కీర్తిప్రతిష్ఠలు పెంచుకునే అవకాశం. పరిశోధన, వైజ్ఞానిక రంగాల వారికి ఉన్నతావకాశాలు. విజ్ఞాన యాత్రలుంటాయి. ఆధ్యాత్మిక సాధన మెరుగుపడుతుంది. సంప్రదింపులుంటాయి. అందరి సహకారం లభిస్తుంది. సంతోషం, సంతృప్తి. వారాంతంలో వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులు అధికం. సామాజిక గౌరవం తగ్గవచ్చు. శ్రమ అత్యధికం. తొందరపాటు కూడదు.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744