S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆత్మ తృప్తి

పంచభూతాల పంతము కౌగిలింత
అవయవాల నల్లిన
చాతుర్యము ఒడిలో
ప్రాణాలను పుణికి పుచ్చుకున్న
రోబో మనిషి.
మేధోశక్తి కతికించిన యుక్తి
రిమోటు కంట్రోలు
కంటి కింపు - సొంపు సింగారాలు
మింటినంటే సుఖభోగాలు
గాలిలో బుడగలని డిలిట్ చేసినా,
ఆశల అప్‌లోడులు -
ఆరాటాల డౌన్‌లోడులు
వాగ్దానాల వాట్సప్‌లు
అట్టహాసం ఫేసుబుక్కుల్లో వైరల్.
శాస్త్ర సాంకేతికం గ్రహాంతరాల్లో
షికార్లు కొట్టినా,
జీవన్మరణ రహస్యాల కూపీ
కొలిక్కిరాని ఆర్భాటాలు.
పాత రోగాల చెవులు మెలేసి
కొత్త ప్రయోగ ఫలితాలెక్కించినా
మరణ మృదంగం వాయింపు శాశ్వతం
లోహ విహంగ వేగము
మనోవిహంగముతో పోటీ పడినా
జలాంతర్గాముల చక్రాలు
సముద్ర గర్భాన్ని ఛేదించినా
అణుబాంబులు ప్రపంచాన్ని
భయం గుప్పిట్లో బంధించినా
చావు పుట్టుకల గుట్టురట్టై
మొలిచేదాకా
మానవాతీత శక్తి ముడులు
విడిపోయేవరకు
ఆత్మ తృప్తిని ఆకళింపు చేసుకోక తప్పదు.
*

- ఐతా చంద్రయ్య 93912 05299