S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తిరునగరీయం

వెండి పళ్లెమందు తిండి తినునొకండు
మట్టి చిప్పలోన మరియొకండు
ఇరువురును భుజింతురరయ ఆ మెతుకులే
తిరునగరిది మాట తిరుగు లేదు

ఎంత స్వర్ణమున్న ఎన్ని సంపదలున్న
నావి అన్న సిరులు ఏవి లేవు,
వెళ్లిపోవునాడు వెంటరావేవియు
తిరునగరిది మాట తిరుగులేదు

మంచి మనసు ఉన్న మనుజుడే దేవుడు
పరులకుపకరించు నరుడు హరుడు,
నరుల సేవ ధరణి పరమాత్మ సేవరా!
తిరునగరిది మాట తిరుగులేదు

అహము పొరలు క్రమ్మ అంధత్వమేర్పడు
తాను అధికుడనని మనిషి పొంగు,
కనుల అహము క్రమ్మ మనిషికి పతనమే
తిరునగరిది మాట తిరుగులేదు

విద్య ఉన్న మనిషి విశ్వబంధుండగు
విద్య వలన పెరుగు వినయ గుణము
రెండు ఉన్నవాని కొండాడు జగమంత
తిరునగరిది మాట తిరుగులేదు.
*

-డా.తిరునగరి 93924 65475