S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇరుకు బతుకులు

ఆయన ఎవరో వచ్చాడు. క్షమించండి డిస్టర్బ్ చేశాను అన్నాడు. నేను అదేమీ లేదు, అన్నాను. ఆ మాట నేను ఊరికే అనలేదు. నిజంగానే అన్నాను. నా సమయం నా చేతిలో వుంటుంది. నేను చేస్తున్న పని ఆపి తర్వాత మళ్లీ ఎప్పుడైనా చేయవచ్చు. ఇంటికి వచ్చిన వారితో గౌరవంగా మాట్లాడడం కనీస ధర్మం. నేను మరెవరు ఇంటికి వెళ్లను. అదేదో గర్వంగా చెప్పడం లేదు. ఎందుకోగానీ అలవాటు లేదు. ఉంటున్న బిల్డింగ్‌లో ఇరవయి ఇళ్లు ఉన్నాయి. వాటిలో ఒక రెంటిలోకి తప్ప, నేను ఏ ఇంటిలోకి వెళ్లలేదు.
మనం ఇరుకు బతుకులు బతుకుతూ వుంటాము.
ఇరుకు తనం చిన్ననాడే మొదలవుతుంది. బడిలోనే బతుకు గురించి ఒక బాట వేసి చూపిస్తారు. బాగా చదువుకోవాలి. మంచి మార్కులు సంపాదించాలి. చేతనయితే గోల్డ్ మెడల్ గెలవాలి. మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి. ఇంతవరకు నేను కూడా బాగానే చేశాను. ఆ తరువాత మాత్రం నా దారి విచిత్రంగా మారిపోయింది. నేను ఉద్యోగం పోగొట్టుకున్నాను. గౌరవంగా చెప్పాలంటే వదులుకున్నాను. మధ్యతరగతి మందహాసం కనుక నాకు ఆ కొంచెమైనా వీలైంది. నిజానికి గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఉద్యోగం చేస్తాను అన్నాను. నాన్న నిజంగా గొప్ప మనిషి, ఏదో చేసి నాకు చదువు చెప్పించాడు. నేను చదువుకున్నాను. కానీ ఆ చదువును వాడుకోలేక పోయాను. నేను నాన్న లాగే గొప్ప మనిషిని కాదు. ఇది నేను ఏదో విషయం కొద్దిగా చెప్పడం లేదు. నన్ను నేను ఏ మాత్రం పక్షపాతం లేకుండా పరీక్షించుకుని చెబుతున్నాను. నాన్న అంత కష్టపడి నాకు చదువు చెప్పిస్తే, దాన్ని నేను గంగలో పోసినట్లే కదా. కనుక నాది తప్పు. అట్లాగని ఇష్టం లేని పని చేయడం కూడా నన్ను నేను మోసం చేసుకున్నట్టు అవుతుంది.
యూనివర్సిటీ వాళ్లు ఉద్యోగం ఇవ్వలేదు. ఇస్తే నాలాంటి మరి కొందరు పనికిరాని వాళ్లను తయారుచేయడం తప్ప నేను అక్కడ ఏమీ పడగొట్టి ఉండగలిగే వాడిని కాదు. వైస్ ఛాన్సలర్ అయిన అయ్యేవాడినేమో గానీ, దాని వలన ఎవరికీ ఎటువంటి ప్రయోజనం ఉండదు. చదువు అవసరం లేదని అందరికీ అర్థమై పోయింది. కొంతమందికి చదువు తప్ప మరొకటి చేతనయ్యేది కాదు. వాళ్లు చదువుకుంటే ఉద్యోగాలు దొరకడం లేదు. కనుక మన వాళ్లు కూడా చదువు మానేశారు.
ఇవేమీ అందుబాటులో లేని వాళ్లు కొంతమంది ఉన్నారు. వాళ్ల గురించి ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ వీధిలో రోడ్డు పక్కన ఒక ఇల్లు కడుతున్నారు. రణగొణ ధ్వని నాకు నిత్యం వినిపిస్తూనే ఉన్నది. ఆ గోల పొద్దున ఆరు గంటలకు మొదలవుతుంది. చీకటి పడిన తరువాత లైట్లు వేసి పని చేస్తుంటారు. ఈ అక్షరాలు రాస్తుంటే కూడా అదే పనిగా రణగొణ వినబడుతున్నది. ఆ మనుషులకు ఎడతెరిపి లేదు. వినోదం అంతకన్నా లేలదు. కడుపు నిండా తిండి దొరికితే చాలు. కష్టపడటానికి వాళ్లు సదా సిద్ధం. కనుకనే వాళ్లంతా తాగుడుకు బానిస అవుతారు అని నాకొక అనుమానం.
ఇంటికి ఎవరో వచ్చారు. ఎందుకు వస్తారో తెలియదు. మనం ఎప్పుడు వాళ్ల ఇంటికి వెళ్లలేదని గోల చేస్తారు. మనం వాళ్ల ఇంటికి ఎందుకు వెళ్లాలో తెలియదు. మన పని మనలను చేసుకోనివ్వరు. వాళ్లకు బహుశా ఏ పని ఉండదు.
పెళ్లికి వెళ్లాలి. విడాకులకు వెళ్లాలి. చావులకు వెళ్లాలి. తద్దినాలకి వెళ్లాలి. సంవత్సరం తిరిగేసరికి కనీసం ఒక నెలరోజులు అర్థం లేకుండా గడిపినట్లు లెక్క తేలుతుంది. ఇటువంటి వాతావరణం నుంచి తప్పించుకుని పోవాలి అనిపిస్తుంది. అదేమిటన్న మాట అని అందరూ తిడతారు. గాలిబ్ ఒక కవిత రాస్తాడు. పలుకరించే వాళ్లు ఎవరూ లేని చోట ఉండాలి అంటాడు. చచ్చినా వౌనమే మిగలాలి అంటాడు. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఎవ్వరూ పలుకరించిన చోటికి వెళితే మరి ఉక్కిరిబిక్కిరిగా ఉంటుంది. కనీసం తెలిసిన వాడు లేని చోటికి వెళ్లి బతకడం బాగుంటుంది అనిపిస్తుంది. బంధువులు చుట్టుపక్కల ఉన్న చోట్ల ఇళ్లు వెతుక్కోవడం ఒకప్పటి పద్ధతి. అది పని చేస్తున్న చోటికి దూరంగా ఉన్నా అంత సమస్య కాదు అనిపించింది. నేను ఉద్యోగం చేయడం లేదు. మా యజమానురాలు చేస్తున్నది. ఆమె నిత్యం రెండు మూడు గంటలు కార్లో గడుపుతుంది. కాలేజీ దగ్గరికి వెళదాము అంటే మాత్రం ఆమెకు ఇష్టం ఉండదు. అందరూ ఉన్నచోట ఉండాలి.
ఒక ఉత్తర భారతదేశం వచ్చి మా ప్రాంతంలో ఇల్లు తీసుకుని ఉంటాడు. పెళ్లి పెటాకులు ఉన్నట్టు లేదు. ఒక్కడే ఉంటాడు. హాయిగా ఆలోచిస్తూ తిరుగుతుంటాడు. సుఖంగా ఉన్నట్టు కనపడతాడు. అతను బహుశా నా ఊహల ప్రకారం సాంఘిక సంబంధాలను పెంచుకుని ఇక్కడికి వచ్చాడు అనిపిస్తుంది. ఉద్యోగం పేరున వచ్చిన వాడైతే వీలైనప్పుడు ఇంటికి వెళ్లిపోయి, కొంతకాలం తన వాళ్లతో గడిపి రావచ్చు. అతనికి ఎటువంటి ఇబ్బందులు ఏవి ఉన్నట్టు కనిపించదు. కుర్రవాడేమీ కాదు. మధ్యవయసు మనిషి. అతనిలో ఎక్కడా సంతృప్తి కనిపించదు. ఇక్కడ అతని సమయం అతనికి సొంతంగా నడుస్తున్నట్టు కనిపిస్తుంది. నేను కూడా ఇంచుమించు అటువంటి ఏర్పాటు చేసుకున్నాను. పిల్లలు మరి ఎక్కడ ఉన్నారు. యజమానురాలు పొద్దున్న ఉద్యోగానికి వెళితే రాత్రి ఎప్పుడో వస్తుంది. ఆ మధ్య కాలమంతా నేను ఒంటరిగా ఉంటాను. అది నాకు అనుకూలంగా ఉంటుంది. నాకు ఇష్టమైన రచనా వ్యాసంగం కావలసినంత చేసుకోగలుగుతాను. ఇంట్లో పరిస్థితి బాగా ఉంటే సరిపోతుంది అనుకుంటే కష్టం. బయట వాళ్ల గోళ్లను నేను ఆపలేను. అది నా చేతుల్లో లేదు. కనుక గాలికి చెప్పినట్టు, ఎవరూ లేని చోటికి వెళ్లాలి. గోడలు లేని ఇంట్లో ఉన్నది. తిన్నావా ఉన్నావా అని అడిగేవాళ్లు ఉండకూడదు. అప్పుడు మరియు ఉండడం ఎందుకు అన్నది అసలు ప్రశ్న.
మనిషి ఎందుకు పుడతాడు అని ప్రశ్న అడిగితే మరీ ఫిలసాఫికల్‌గా ఉంటుంది. బ్రతికినంత కాలం బ్రతుకు కొరకు ఎంతో కష్టపడాలి. ఆ కష్టం వల్ల సంతృప్తి కలిగితే అంతకంటే గొప్ప విషయం లేదు. కానీ ఈ ప్రపంచంలో సంతృప్తిగా బతికే వాళ్లు ఎక్కువ మంది ఉన్నట్టు నాకు కనిపించు. అందరూ ఏదో పోగొట్టుకున్నట్టు ముఖాలు మాడ్చుకుని తిరుగుతూ ఉంటారు. ఎలా ఉన్నారు అన్న ప్రశ్నకు, ఏదో ఉన్నాం అని జవాబు చెబుతారు. హాయిగా ఉన్నాను అని జవాబు చెప్పే వాళ్లు చాలా తక్కువగా కనిపిస్తారు.
ఈ ఉత్తర భారతీయుడు బహుశా హాయిగా ఉన్నాను అని చెప్పగలుగుతాడు. కనీసం అలా కనిపిస్తాడు. బాదరబందీలు ఏవీ లేని పరిస్థితిలో ఉన్నాడు కదా.
మనకు ఇల్లు వదిలి ఎక్కడికైనా వెళ్లడం అంటే వెళ్లి పేరు మీదనే. సరదాగా యాత్రలు చేయడం మనకు తెలియదు. పడమటి ప్రపంచంలో యూనివర్సిటీ ప్రొఫెసర్లకు, కొంతకాలం తరువాత, సబాతికల్ అని ఒక సెలవు ఇస్తారు. ఒకటి నుంచి రెండు సంవత్సరాలపాటు ఆ సెలవు కొనసాగుతుంది. ఆ సమయంలో వాళ్లు కాలేజీ కిరణ్ అవసరం లేదు. ఏ పని చేయనవసరం లేదు. ఎక్కడైనా తిరగవచ్చు. ఇష్టం వచ్చిన పని చేసుకోవచ్చు. మొత్తానికి రెండు సంవత్సరాలపాటు తనను తాను మార్చుకుని మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో ఉద్యోగానికి తిరిగి రావాలి. కంపెనీలలో కూడా మామూలు ఉద్యోగులకు మొదలు మేనేజ్‌మెంట్ వారి దాకా అందరికీ ఈ ఏడాదిలో కొంతకాలం తప్పకుండా సెలవులో వెళ్లాలి అని పద్ధతి ఉంటుంది. మన దగ్గర కూడా లీవ్ ట్రావెల్ కనె్సషన్ అని డబ్బులు కూడా ఇస్తారు. మన వాళ్లు తప్పుడు బిల్లు పెట్టి ఆ డబ్బులు తీసుకుంటారు. ఎక్కడికి వెళ్లడం మాత్రం వెళ్లరు. సంపాదించుకున్న సెలవులు అని అర్థం వచ్చే మాట ఒకటి ఉంది. పది రోజులు పని చేస్తే ఒక రోజు సెలవు సంపాదించుకున్న లెక్క, సంవత్సరానికి నెల రోజులూ ఈ రకమైన సెలవు ఉంటుంది. దాన్ని మీద వేసుకునే, కొంతకాలానికి అమ్ముకుని ఆ జీతం తీసుకునే సౌకర్యం కూడా ఉంటుంది. నాకు తెలిసి ఎవరు ఎంతో అవసరం అయితే తప్ప ఈ సెలవు తీసుకున్నారు. నేను ఉద్యోగం చేసినంత కాలం అవసరం ఉన్నా లేకున్నా సంవత్సరానికి నెల రోజులూ నా పనిలో ఉండేవాణ్ణి. ఒక పుస్తకం రాసుకునేవాడిని.
ఊరికే ఒక రైలు ఎక్కి ఏదో ఒక ఊరికి పోయి, కొంతకాలం అక్కడ తిరిగి, సరదాగా కాలక్షేపం చేసి తిరిగి వచ్చిన వాళ్లు ఎవరైనా ఉంటే నాకు ఒక ఉత్తరం రాయండి. వచ్చేసారి వాళ్ల టికెట్ కూడా నేను పెట్టి వాళ్లతో నేను తిరుగుతాను.
యాత్రలకు వెళ్లే వాళ్లు కొంతమంది ఉంటారు. నేను మాత్రం ఊరికే వెళ్లి గుజరాత్‌లోని సర్దార్ పటేల్ విగ్రహం చూసి వచ్చాను. అందరూ దేవుడి విగ్రహాలు చూస్తారు. నాకు సర్దార్ పటేల్ మీద భక్తి లేదు. కానీ అది ప్రపంచంలో అన్నింటికన్నా ఎతె్తైన విగ్రహం అన్నారు. దాన్ని చూచిన సంతృప్తి నేను మిగుల్చుకున్నాను.
గ్రేటా గార్బో అనే సినీ నటి, గొప్ప డిమాండు ఉన్న సమయంలో ఉన్నట్టుండి సినిమాలు మానేసిందట. ఏమిటి, అంటే నేను కొంతకాలం ఒంటరిగా ఉండదలచుకున్నాను అన్నదట. ఆ దెబ్బతో ఆమెకు డిమాండ్ మరింత పెరిగింది. మనం మామూలు మనుషులం. మనకు డిమాండ్ ఉండనే ఉండదు. అయినా ఒంటరిగా బతకడం మనకు కూడా అవసరమే. కానీ చాలామంది ఒంటరిగా ఉండడానికి భయపడతారు. ఒంటరితనంలో మనసులోని వెర్రితనం బయటపడుతుంది. ఎవరూ లేనప్పుడు అర్థం లేని పనులు చేయడం చాలామందికి అలవాటు ఉంటుంది. అద్దం ముందు నిలబడినప్పుడు అలాగే ఒంటరితనంలో కూడా మనసులోని వెకిలితనం బయటపడుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే మన మానసిక పరిస్థితి గురించి మనకే అర్థమవుతుంది. నేను పెద్దగా శరీర దారుఢ్యం ఉన్న మనిషిని కాదు. కనుక చిన్నప్పటి నుంచి పరుగులు ఉరుకులు నాకు జాతకం. చదవడం మాత్రం బాగా చేతనవుతుంది. కనుక మనసు బాగ లేకుంటే, మంచి పుస్తకం ఒకటి చేత పుచ్చుకుని కూర్చుంటాను. సీరియస్‌గా రాయవలసిన అవసరం ఉంటే కూడా, ఆ పని ప్రారంభించడానికి ముందు ఒక చక్కటి పుస్తకం చదువుతాను. మెదడుకు పట్టిన మకిలి వదులుతుంది. కొంచెం హుషారు కలుగుతుంది. అప్పుడు అసలు పనిలోకి దిగితే సరదాగా ఉంటుంది.
అందరూ నాలాగే చదవాలని నేను అనుకోవడం లేదు. కొంతమందికి చదవడం అంటే ఏమిటో కూడా తెలియదు. ఇంట్లో ఒక్క పుస్తకం కూడా లేని వాళ్లను నేను చాలామందిని చూశాను. నాకు చదువు లాగా, వాళ్లకు మరియు పద్ధతులు ఉండవచ్చు. వాటిలో టీవీ చూడటం మాత్రం ఒకటి కాకూడదని నాకు గట్టిగా నమ్మకం ఉంది.
మన చుట్టూ బిగుసుకున్న ఇరుకు ప్రపంచం అవసరం ఏముంది అని చూడటానికి మనం ప్రయత్నించాలి. అప్పుడు బతుకు కొంచెం రుచికరంగా కనపడుతుంది. ఇందులో వెరైటీ, వేసుకునే గుండెల్లో వెరైటీ, ఈ మధ్యన బాగా వీలవుతున్నాయి.
చిన్నతనంలో ఆటలు ఉంటాయి. ఆ తర్వాత చదువు ఉంటుంది. ఆ తర్వాత ఉద్యోగం ఉంటుంది. ఆ తరువాత ఏమిటి అన్నది అసలు ప్రశ్న. చదువు ఉద్యోగం కాలంలో కూడా, బతుకు సరదాగా గడిస్తే బాగుంటుంది. బండికి కట్టిన ఎద్దులాగా, వాటి కంటే అన్యాయంగా గానుగకు కట్టిన ఎద్దులాగా, బతుకు వల్ల మారిస్తే అందులో అర్థం లేదు. ఎవరి జీవితానికి వాళ్లు ఒక దారి వేసుకోవాలి. ఇది నేను ఏదో స్వామి వారి లాగా బోధన చేయడం లేదు. ఎందుకో ఇవ్వాళ ఇలా చెప్పాలనిపించింది. చెప్పాను. తర్వాత మీ ఇష్టం.

-కె.బి.గోపాలం