S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారం వారం గోచారం (15.12.2019 నుంచి 21.12.2019 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఈ వారం ప్రారంభంలో ఆహార విహారాలపై దృష్టి. గృహ వాహనాది సౌకర్యాలను మెరుగుపరచుకునే ప్రయత్నం. విందులు వినోదాలుంటాయి. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. విద్యారంగంలోని వారికి గుర్తింపు. వృత్తి ఉద్యోగాదుల్లో శుభ పరిణామాలు. అధికారిక వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి. వారం మధ్యమంలో ప్రణాళికాబద్ధమైన ఆలోచనలు. క్రియేటివిటీ పెరుగుతుంది. ఆలోచనలకు రూపకల్పన. కొత్త పనులపై దృష్టి. సంతానవర్గ వ్యవహారాలు చర్చలకు వస్తాయి. అనుకోని సమస్యలకు కూడా అవకాశం ఉంటుంది. అనారోగ్య లోపాలు లేకుండా చూసుకోవాలి. వారాంతంలో వ్యతిరేకతలు అధికం. పోటీ రంగంలో గుర్తింపు, విజయం. ఆకస్మికమైన మార్పులు కూడా ఉంటాయి. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. కార్యనిర్వహణ దక్షత. రోగ నిరోధక శక్తిని పెంచుకుంటారు.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో సంప్రదింపులకు అనుకూలం. దగ్గరి ప్రయాణాలుంటాయి. నూతనమైన వార్తలు వింటారు. కమ్యూనికేషన్స్ లాభిస్తాయి. ఇతరుల సహకారం లభిస్తుంది. సోదర వర్గంలోని వారితో అనుకూలత. ఉన్నత లక్ష్యాలను సాధించే ప్రయత్నం. ఆధ్యాత్మిక యాత్రల వల్ల మరింత మేలు కలుగుతుంది. వారం మధ్యమంలో సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. విద్యారంగంలోని వారికి అనుకూలత. భాగస్వాములతో కొంత జాగ్రత్తగా మెలగాల్సి వస్తుంది. ఆహార విహారాలపై ప్రత్యేక దృష్టి. పదోన్నతులకు అవకాశం ఉంటుంది. వారాంతంలో ఆలోచనలకు రూపకల్పన. ప్లానింగ్ ఫలిస్తుంది. క్రియేటివిటీ పెంచుకుంటారు. స్పెక్యులేషన్స్ లాభిస్తాయి. సంతాన సంబంధమైన మంచి నిర్ణయాలు ఉంటాయి.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఈ వారం ప్రారంభంలో కుటుంబంలో అనుకూలత. మాట విలువ పెంచుకుంటారు. బంధువర్గ వ్యవహారాల్లో పాల్గొంటారు. ఆర్థిక నిల్వలు సంతోషాన్నీ, సంతృప్తినీ ఇస్తాయి. కొన్ని అనుకోని ఇబ్బందులకు అవకాశం. అప్రమత్తంగా మెలగాలి. చిట్స్ మొదలైన వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వారం మధ్యమంలో ఇతరుల సహకారం లభిస్తుంది. ప్రభుత్వ వర్గ వ్యవహారాల్లో అనుకూలత. అధికారిక భాగస్వామ్యాలుంటాయి. దగ్గరి ప్రయాణాలు. ఉన్నత లక్ష్యాలను సాధించే ప్రయత్నం. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. మీడియా రంగంలోని వారికి అనుకూలత. శుభమైన వార్తలు వినే అవకాశం ఉంది. వారాంతంలో సౌకర్యాలు పెంచుకుంటారు. విందులు వినోదాలకు అవకాశం. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం. శ్రమ తప్పకపోవచ్చు.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఈ వారం ప్రారంభంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. అన్ని పనులనూ నిర్వహిస్తారు. బాధ్యతలు పెంచుకుంటారు. గుర్తింపు లభిస్తుంది. వ్యవహారాల వల్ల సంతోషం. సంతృప్తి. భాగస్వామ్యాల్లో శుభ పరిణామాలుంటాయి. అనేక కార్యక్రమాల నిర్వహణ. కొత్త ప్రణాళికలుంటాయి. విందులు వినోదాల వల్ల సంతోషం కలుగుతుంది. వారం మధ్యమంలో ఆర్థిక వ్యవహారాలు ప్రభావాన్ని చూపిస్తాయి. మాట తీరులో కొంత అధికారిక దోరణి. కుటుంబ, బంధువర్గ వ్యవహారాలు సంతోషాన్నిస్తాయి. ఆలోచనలకు రూపకల్పన, నిల్వధనం పెంచుకునే మార్గాలను అనే్వషిస్తారు. బ్యాంకు పనులు పూర్తవుతాయి. వారాంతంలో సంప్రదింపులుంటాయి. వ్యాపారాదులకు అనుకూలం. ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఈ వారం ప్రారంభంలో ఖర్చులు అధికవౌతాయి. వేరు వేరు రూపాల్లో పెట్టుబడులు తప్పకపోవచ్చు. విశ్రాంతి లభిస్తుంది. ప్రయాణాలకు కూడా అవకాశం. పరామర్శలుంటాయి. వినోదాలు విహారాలకు అవకాశం ఉంటుంది. వ్యతిరేక ప్రభావాలున్నా విజయం సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది. వారం మధ్యమంలో అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలుంటాయి. శ్రమతో అన్ని పనులను సాధిస్తారు. కొత్త పనులపై దృష్టి. సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. శ్రమ అధికం. విద్యారంగంలోని వారు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆహార విహారాల్లో అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది. వారాంతంలో ఆర్థిక వ్యవహారాల్లో శుభ పరిణామాలు. వ్యాపారాదులకు అనుకూలం. మాట విలువ పెరుగుతుంది. చమత్కార సంభాషణలుంటాయి.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో వేరు వేరు రూపాల్లో ప్రయోజనాలుంటాయి. లాభాలు సంతోషాన్నిస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఆలోచనలకు రూపకల్పన. కొత్త ప్రణాళికలుంటాయి. సంతానవర్గ వ్యవహారాలకు అనుకూలత. క్రియేటివిటీ పెంచుకుంటారు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. అభీష్టాలు నెరవేరుతాయి. వారం మధ్యమంలో పెట్టుబడులు అధికవౌతాయి. విశ్రాంతి వినోదాలపై దృష్టి పెరుగుతుంది. అధికారికమైన సహకారం లభిస్తుంది. విలాసాల కన్నా దానధర్మాలు మేలు. కాలం ధనం వ్యర్థం కాకుండా చూసుకోవాలి. ప్రయాణాలకు కూడా అవకాశం కలుగుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. వారాంతంలో అనేక బాధ్యతలుంటాయి. కార్యనిర్వహణ దక్షత. ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలి.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఈ వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాదుల్లో శుభ పరిణామాలు. సామాజిక గౌరవం పెరుగుతుంది. పదోన్నతులకు అవకాశం. పితృవర్గ వ్యవహారాలు చర్చలకు వస్తాయి. బాధ్యతలు అధికం. ఆహార విహారాలకు అనుకూలత. సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. శ్రమ ఉన్నా గుర్తింపు లభిస్తుంది. వారం మధ్యమంలో వేరు వేరు రూపాల్లో ప్రయోజనాలుంటాయి. లాభాలు సంతోషాన్నిస్తాయి. కొత్త పనులకు అనుకూలం. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. వ్యవహారాల్లో అనుకూలత. ప్రయోజన భావాలతో అన్ని పనులు చేస్తారు. శ్రమ రహిత లాభాలకు దూరంగా మెలగాలి. కొన్ని ఊహించని ఇబ్బందులకు అవకాశం ఉంటుంది. వారాంతంలో ఖర్చులు అధికం. వ్యాపారంలో పెట్టుబడులుంటాయి. వినోదాలు విహారాలు విలాసాల కోసం వెచ్చించాల్సి వస్తుంది.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఈ వారం ప్రారంభంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలకు అవకాశం. ఉన్నత లక్ష్యాలను సాధిస్తారు. వైజ్ఞానిక, సాంకేతిక, పరిశోధనా రంగాల వారికి అనుకూలత. కొత్త పనుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి. వ్యవహార దక్షత. సంప్రదింపులకు అనుకూలం. ఇతరుల సహకారం లభిస్తుంది. వారం మధ్యమంలో వృత్తిలో అనుకూలత. అధికారిక వ్యవహారాల్లో శుభ పరిణామాలు. పదోన్నతులుంటాయి. శారీరక ఒత్తిడులు తప్పకపోవచ్చు. కొంత అనారోగ్య భావన. సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి. శ్రమతో కార్యక్రమాలుంటాయి. గుర్తింపు లభిస్తుంది. వారాంతంలో ప్రయోజనాలపై ప్రత్యేక దృష్టి. లాభాలు సంతోషాన్నిస్తాయి. కొత్త పనులపై ప్రత్యేక దృష్టి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. శ్రమ రహిత ప్రయోజనాలపై దృష్టి సారించవద్దు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఈ వారం ప్రారంభంలో అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలుంటాయి. ముఖ్య కార్యక్రమాలను వాయిదా వేసుకోవడం మంచిది. కాలం ధనం వ్యర్థమయ్యే సూచనలు. వ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగాలి. కుటుంబ, ఆర్థిక, బంధువర్గ వ్యవహారాల్లో తెలియని చికాకులకు అవకాశం ఉంటుంది. వారం మధ్యమంలో అత్యున్నత కార్యక్రమాలను సమీక్షిస్తారు. కీర్తి ప్రతిష్ఠలను పెంచుకుంటారు. కొన్ని ఖర్చులు తప్పకపోవచ్చు. పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం. ప్రయాణాలకు అవకాశం. కాలం ధనం వ్యర్థం కాకుండా చూసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల వల్ల మేలు. దానధర్మాల వల్ల అనుకూలత. వారాంతంలో వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. అధికారిక వ్యవహారాలు సంతోషాన్నిస్తాయి. సామాజిక గౌరవం పెంచుకుంటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఈ వారం ప్రారంభంలో భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. పాతమిత్రుల కలయిక లేదా సమాచారం. ప్రయాణాలకు అవకాశం. నూతన కార్యక్రమాల నిర్వహణ. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. అన్ని పనులకూ అనుకూలం. సంతోషంగా గడుపుతారు. వారం మధ్యమంలో అనుకోని సమస్యలుంటాయి. అనారోగ్య భావనలు. ఆసుపత్రుల దర్శనం. లాభాలు కోల్పోయే అవకాశం. అధికారులతో జాగ్రత్త. కొత్త పనుల నిర్వహణకు, రూపకల్పనకు దూరంగా ఉండాలి. శ్రమాధిక్యం. పెద్దలతో జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. వారాంతంలో ఉన్నత వ్యవహారాలపై దృష్టి. కీర్తి ప్రతిష్ఠలు పెంచుకునే ప్రయత్నం. ఉన్నత లక్ష్యాలను సాధిస్తారు. సుదూర ప్రయాణాలకు అవకాశం. ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తారు.

కుంభం (ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)
ఈ వారం ప్రారంభంలో వ్యతిరేకతలు అధికం. పోటీలు ఒత్తిడులు, చికాకులకు అవకాశం. గుర్తింపు లభిస్తుంది. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. ముఖ్య కార్యక్రమాల నిర్వహణలో అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది. కాంపిటీషన్స్‌లో విజయం. పోటీ రంగంలో అనుకూలత. వారం మధ్యమంలో పరిచయాలు విస్తరిస్తాయి. స్నేహానుబంధాలకు అనుకూలం. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులు తప్పకపోవచ్చు. పదోన్నతులుంటాయి. బాధ్యతలు అధికం. భాగస్వామితో విభేదాలు లేకుండా చూసుకోవాలి. శ్రమతో కార్యక్రమాలు. సామాజిక గౌరవం పెరుగుతుంది. పదోన్నతులకు అవకాశం. వారాంతంలో అన్ని పనుల్లోనూ జాగ్రత్త. అనారోగ్య భావనలు. అనుకోని సమస్యలు. కాలం ధనం వ్యర్థం కావచ్చు. వ్యాపారాలలో నష్టాలకు సూచన. ముందు జాగ్రత్తలు అవసరం.
మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)
ఈ వారం ప్రారంభంలో ఆలోచనలకు రూపకల్పన. క్రియేటివిటీ పెరుగుతుంది. ఉన్నత లక్ష్యాలను సాధిస్తారు. సంతానవర్గ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి. స్పెక్యులేషన్స్ లాభిస్తాయి. ప్లానింగ్‌కు అనుకూలం. కార్యక్రమాల్లో శుభ పరిణామాలు. లాభాలు సంతోషాన్నిస్తాయి. అన్ని పనుల్లోనూ ప్రయోజనాలు తప్పక లభించే అవకాశం. వారం మధ్యమంలో వ్యతిరేకతలు పోటీలు అధికం. గుర్తింపు లభిస్తుంది. శ్రమతో కార్యక్రమాలు. శత్రు రోగ రుణాలను అధిగమించాల్సి ఉంటుంది. అన్ని పనుల్లోనూ జాగ్రత్త వహించాలి. ఖర్చులు పెట్టుబడులుంటాయి. సుదూర ప్రయాణాల నిర్ణయాలు వాయిదా పడే అవకాశం. మొండితనం తగ్గించుకోవాలి. వారాంతంలో పరిచయాలు విస్తరిస్తాయి. స్నేహానుబంధాలు పెంచుకునే ప్రయత్నం. పాతమిత్రుల కలయిక.

-డాక్టర్ సాగి కమలాకర శర్మ