S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారం వారం గోచారం (22.12.2019 నుంచి 28.12.2019 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఈ వారం ప్రారంభంలో భాగస్వామ్యాల్లో అనుకూలత. వ్యాపార వ్యవహారాల్లో శుభ పరిణామాలు. కాంట్రాక్టులు లాభిస్తాయి. జీవిత భాగస్వామితో జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. ప్రయాణాలకు అవకాశం. పరిచయాలు, స్నేహానుబంధాలు విస్తరించినా కొంత ఒత్తిడి తప్పకపోవచ్చు. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. వారం మధ్యమంలో అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. అన్ని పనుల్లోనూ జాగ్రత్త వహించాలి. కష్టనష్టాలుంటాయి. కాలం ధనం వ్యర్థం కావచ్చు. వ్యాపారాల్లో మరీ జాగ్రత్త. ముఖ్య కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలి. ముందు జాగ్రత్తలు అవసరం. వారాంతంలో ఆధ్యాత్మిక వ్యవహారాలకు అనుకూలం. సాంకేతిక, వైజ్ఞానిక రంగాల వారికి మరింత శ్రేయస్సు. యాత్రలకు అవకాశం. కొంత అసంతృప్తి కూడా ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)
ఈ వారం ప్రారంభంలో పోటీలు ఒత్తిడులు అధికవౌతాయి. వ్యతిరేకతలున్నా విజయం సాధిస్తారు. శ్రమ తప్పదు. గుర్తింపు లభిస్తుంది. శత్రువులపై విజయం. రుణాలను అధిగమిస్తారు. రోగ నిరోధక శక్తి పెంచుకుంటారు. కార్యనిర్వహణలో తలమునకలై పని చేయాల్సి వస్తుంది. వారం మధ్యమంలో పరిచయాలు, స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. వ్యాపార వ్యవహారాల్లో రాణింపు ఉంటుంది. కొత్త బంధాలు ఏర్పడవచ్చు. జీవిత భాగస్వామితో కొంత జాగ్రత్తగా మెలగాలి. చిరు గొడవలకు అవకాశం ఉంటుంది. నూతన కార్యక్రమాల నిర్వహణపై దృష్టి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. వారాంతంలో అనుకోని ఇబ్బందులు. ఊహాతీత సంఘటనలు. గౌరవ లోపాలు. పనుల్లో జాప్యం. ముఖ్య నిర్ణయాలు వాయిదా వేసుకోవాలి. చికాకులు అధికవౌతాయి.
మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఈ వారం ప్రారంభంలో సంతాన వర్గ వ్యవహారాలు చర్చలకు వస్తాయి. ఆలోచనల్లో ఆవేశం పాలు ఎక్కువ. తొందరపాటు కూడదు. స్పెక్యులేషన్స్ లాభిస్తాయి. సృజనాత్మకత ఉన్నా ఒత్తిడి కూడా ఉంటుంది. ప్లానింగ్ విషయంలో ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చూసుకోవాలి. రూపకల్పన చేస్తున్న అంశాల్లో సంతృప్తి ఉంటుంది. వారం మధ్యమంలో పోటీ రంగంలో విజయం సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాదుల్లో అనుకూలత. శ్రమాధిక్యం. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. రుణ, రోగాదులపై విజయం. కార్యనిర్వహణ దక్షత పెరుగుతుంది. బాధ్యతలను కష్టపడి పూర్తి చేసే అవకాశం. వారాంతంలో పరిచయాలు పెరుగుతాయి. స్నేహానుబంధాల విషయంలో అప్రమత్తంగా మెలగాలి. పెద్దలు, పండితులతో అనుబంధాలు విస్తరిస్తాయి.
కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)
ఈ వారం ప్రారంభంలో సౌకర్యాలు పెంచుకుంటారు. ఆహార విహారాలకు అనుకూలం. తొందరపాటు లేకుండా చూసుకోవాలి. గృహ వాహనాదుల విషయంలో కొంచెం ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. సౌఖ్యం ఉన్నప్పటికీ ప్రశాంత చిత్తం అవసరం. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. విద్యార్థులకు ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. వారం మధ్యమంలో అభీష్టాలు నెరవేరుతాయి. అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. కొత్త పనుల నిర్వహణపై దృష్టి కేంద్రీకరిస్తారు. సంతానంతో సంతోషం. క్రియేటివిటీ పెరుగుతుంది. వ్యాపారాదుల్లో కొత్త మార్పులుంటాయి. కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం. వారాంతంలో పోటీ రంగంలో గుర్తింపు. విజయం. చికాకులను అధిగమిస్తారు. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఈ వారం ప్రారంభంలో సంప్రదింపులకు అనుకూలం. దగ్గరి ప్రయాణాలుంటాయి. సోదర వర్గంతో జాగ్రత్త. సహకార లోపాలకు అవకాశం. తొందరపాటు కూడదు. వేరు వేరు వార్తలు చేరుతాయి. కొంత అసౌకర్యంగా ఉంటుంది. పనుల ఒత్తిడి కూడా ఎక్కువ. ఉన్నత లక్ష్యాలను సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు రూపకల్పన. వారం మధ్యమంలో సౌకర్యాలు పెంచుకుంటారు. ఆహార విహారాలకు అనుకూలం. గృహ వాహనాదుల విషయంలో శుభ పరిణామాలు. సౌఖ్యంగా కాలం గడుపుతారు. ప్రయాణాలుంటాయి. విద్యారంగం వారికి అనుకూలం. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. వారాంతంలో ఆలోచనల్లో అనుకూలత. మానసిక ఒత్తిడులుంటాయి. సంతానవర్గ విషయంలో శుభ పరిణామాలు. ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తారు.
కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)
ఈ వారం ప్రారంభంలో కుటుంబం, బంధుమిత్రుల విషయంలో అనుకూలత. ఆర్థిక నిర్ణయాలు ఫలిస్తాయి. నిల్వధనం పెంచుకుంటారు. మాటల్లో తొందరపాటు ఉంటుంది. ఎదుటి వారితో జాగ్రత్తగా మెలగాలి. అనుకోని సమస్యలు కొన్ని ఉంటాయి. వారం మధ్యమంలో కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. వేరు వేరు వార్తలు వింటారు. ప్రయాణాలు అధికం. వ్యాపారాల కోసం ప్రయత్నాలు అధికవౌతాయి. ఉన్నత లక్ష్యాలను సాధించే ప్రయత్నం. వార్తల వల్ల బాగా బిజీగా అవుతారు. వారాంతంలో సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. ఆహార విహారాల్లో కొంత జాగ్రత్త అవసరం. విద్యారంగంలోని వారికి సౌఖ్య లోపం. నూతన కార్యక్రమాల నిర్వహణపై దృష్టి. క్రియేటివిటీ పెరుగుతుంది.
తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)
ఈ వారం ప్రారంభంలో ఆత్మవిశ్వాసంతో కార్యక్రమాలను నిర్వహిస్తారు. కార్యనిర్వహణ దక్షత. అనేక బాధ్యతలను నిర్వర్తించే ప్రయత్నం. శ్రమతో కార్యక్రమాలుంటాయి. కొత్త పనులపై దృష్టి. భాగస్వామ్యాలలో అనుకూలత. తొందరపాటు కూడదు. జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. కోరికలు తగ్గించుకోవాలి. వారం మధ్యమంలో ఆర్థిక నిల్వలను పెంచుకుంటారు. బ్యాంకు వ్యవహారాలు పూర్తి అవుతాయి. మాట విలువ పెరుగుతుంది. చమత్కార ధోరణి. కార్యక్రమాల్లో సంతృప్తి ఉంటుంది. విజయ సాధన. కుటుంబంలో శుభ పరిణామాలు. బంధువర్గ వ్యవహారాలను నిర్వహిస్తారు. వారాంతంలో సంప్రదింపులుంటాయి. పెద్దలు, సేవకులు, అన్ని రకాల వ్యక్తులు సహకరిస్తారు. ఆధ్యాత్మిక ప్రయాణాల వల్ల మరింత మేలు కలుగుతుంది.
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఈ వారం ప్రారంభంలో ఖర్చులు అధికం. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త. కాలం ధనం వ్యర్థం కావచ్చు. తొందరపాటు కూడదు. విందులు వినోదాలపై దృష్టి ఉన్నా అప్రమత్తంగా మెలగాల్సి వస్తుంది. ప్రయాణాల్లో ఇబ్బందులుంటాయి. విశ్రాంతి లోపం సంభవం. పరామర్శలకు అవకాశం. ఆసుపత్రుల దర్శనం. వారం మధ్యమంలో ఆత్మవిశ్వాసంతో కార్యక్రమాల నిర్వహణ. అన్ని పనుల్లోనూ సంతోషం. బాధ్యతలు విస్తరిస్తాయి. వేరు వేరు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది. వ్యాపారాదుల్లో శుభ పరిణామాలుంటాయి. మంచి పనుల నిర్వహణపై దృష్టి ఉంటుంది. భాగస్వామితో సంతోషంగా కాలం గడిపే అవకాశం. వారాంతంలో కుటుంబంలో అనుకూలత. మాట్లాడే విషయంలో ఆచితూచి వ్యవహరించాలి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఈ వారం ప్రారంభంలో లాభాలు సంతోషాన్నిస్తాయి. శ్రమ రహిత ఆదాయంపై దృష్టి. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి ప్రవర్తించాలి. కొత్త పనుల నిర్వహణలో శ్రమ తప్పదు. వేరు వేరు రూపాల్లో ప్రయోజనాలుంటాయి. శ్రమ ఉన్నా సంతోషం అధికవౌతుంది. వారం మధ్యమంలో ఖర్చులు పెట్టుబడులుంటాయి. వ్యాపారం కోసం అధికంగా వెచ్చిస్తారు. విజ్ఞాన, విహార యాత్రలకు అవకాశం అధికం. ప్రయాణాల్లో శుభ పరిణామాలు. విశ్రాంతి లభిస్తుంది. సౌఖ్యం అధికవౌతుంది. పెట్టుబడుల వల్ల అధికమైన ప్రయోజనాలుంటాయి. దాన ధర్మాల వల్ల మరింత మేలు. వారాంతంలో నిర్ణయాదులు లాభిస్తాయి. గౌరవం పెంచుకుంటారు. కొంత వైరాగ్యం, బద్ధకం తగ్గించుకోవాల్సి వస్తుంది. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)
ఈ వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాదుల్లో శుభ పరిణామాలు. అధికారిక వ్యవహారాలకు అనుకూలం. సామాజిక గౌరవం పెంచుకుంటారు. వ్యవహారాల్లో అనుకూలత. కొత్త పనుల నిర్వహణపై దృష్టి. పదోన్నతులుంటాయి. అధికారులతో కొంత జాగ్రత్తగా మెలగాలి. తొందరపాటు లేకుండా చూసుకోవాలి. వారం మధ్యమంలో లాభాలు సంతోషాన్నిస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కొత్త పనులపై దృష్టి. అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి. శ్రమ రహిత ఆదాయంపై దృష్టి ఉంటుంది. వ్యాపారాల్లో శుభ పరిణామాలు. పెట్టుబడికి తగిన లాభం వస్తుంది. సంతాన వర్గంతో సంతోషం. సంతృప్తి. విజయ సాధన. వారాంతంలో కాలం ధనం వ్యర్థం కాకుండా జాగ్రత్త పడాలి. ప్రయాణాలకు అవకాశం. పరామర్శలుంటాయి. దాన ధర్మాల వల్ల అత్యంత మేలు కలుగుతుంది.
కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)
ఈ వారం ప్రారంభంలో ఉన్నత లక్ష్యాలను సాధించే ప్రయత్నం. సుదూర ప్రయాణాల విషయంలో కొంత ఇబ్బంది ఏర్పడవచ్చు. తొందరపాటు నిర్ణయాలు కూడదు. ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తారు. కీర్తి ప్రతిష్ఠలపై దృష్టి ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక యాత్రల వల్ల మేలు. ధార్మిక వ్యవహారాల్లో పాల్గొనడం చాలా మంచిది. వారం మధ్యమంలో సామాజిక గౌరవం పెంచుకుంటారు. పదోన్నతులకు అవకాశం. సౌకర్యాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాదుల్లో శుభ పరిణామాలుంటాయి. వ్యాపారాల్లో అధికమైన గౌరవం కలుగుతుంది. అధికారుల ఆదరణ అధికం. అన్ని పనుల్లోనూ అనుకూలత. సౌకర్యాలు పెంచుకుంటారు. వారాంతంలో అనేక రూపాల్లో లాభాలుంటాయి. కార్యనిర్వహణలో అధిక ప్రయోజనాలను కోరుకుంటారు.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)
ఈ వారం ప్రారంభంలో అన్ని పనుల్లోనూ జాగ్రత్త. అనుకోని సమస్యలుంటాయి. అనారోగ్యానికి అవకాశం. అనుకోని సంఘటనలుంటాయి. ముఖ్య కార్యక్రమాలను వాయిదా వేసుకోవడం మంచిది. చిన్నచిన్న ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. సమస్యలను అధిగమించే ప్రయత్నం చేయాలి. దైవధ్యానం, దానం చాలా శ్రేష్ఠం. వారం మధ్యమంలో ఉన్నత వ్యవహారాలుంటాయి. వేరు వేరు రూపాల్లో కీర్తి ప్రతిష్ఠలు పెంచుకునే అవకాశం. కార్యనిర్వహణ దక్షత. సుదూర ప్రయాణావకాశాలు. వ్యాపారాదుల్లో అత్యంత శుభ పరిణామాలు. లాభాలు అధికం. సంప్రదింపులుంటాయి. సహకారం లభిస్తుంది. సంతోషంగా ఉంటారు. వారాంతంలో వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. అన్ని పనుల్లోనూ శ్రమ ఉంటుంది. అధికారిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం.

-డాక్టర్ సాగి కమలాకర శర్మ