S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారం వారం గోచారం (5.1.2020 నుంచి 11.1.2020 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఈ వారం ప్రారంభంలో అన్ని పనుల్లోనూ ఆత్మవిశ్వాసం ఉంటుంది. బాధ్యతలు ఎక్కువ. శ్రమ ఉన్నా కార్యక్రమాల నిర్వహణలో సంతృప్తి. పరిచయాలు, అనుబంధాలు విస్తరిస్తాయి. కొన్ని నిర్ణయాలు ఇబ్బంది పెట్టవచ్చు. అనుకోని ఇబ్బందులకు కూడా అవకాశం ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. వారం మధ్యమంలో కుటుంబంలో అనుకూలత. మాట్లాడే ధోరణిలో ఆచితూచి వ్యవహరించాలి. బంధువర్గ వ్యవహారాలపై దృష్టి. బ్యాంకుకు సంబంధించిన పనులు పూర్తవుతాయి. నిల్వధనంపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల్లో శుభ పరిణామాలు. సామాజికమైన గుర్తింపు గౌరవాలు లభిస్తాయి. వారాంతంలో కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. ప్రయాణాలకు అవకాశం. ముఖ్యమైన వార్తలు వింటారు. కొన్ని వార్తల వల్ల మనస్తాపం కూడా కలుగవచ్చు.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో ఖర్చులు పెట్టుబడులు అధికం. వేరు వేరు రూపాల్లో కాలం ధనం పోగొట్టుకోవడం కన్నా ముందుగా దానధర్మాలు చేయడం వల్ల మేలు. దైవ ధర్మ కార్యక్రమాల వల్ల మేలు. విశ్రాంతి లభిస్తుంది. భాగస్వామ్యాల్లో ఇబ్బందులుంటాయి. తొందరపాటు కూడదు. వారం మధ్యమంలో నిర్ణయాదులకు అనుకూలత. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. ఉన్నత వ్యవహారాలపై దృష్టి. బాధ్యతలను నిర్వహిస్తారు. లక్ష్యాలను సాధించే ప్రయత్నం. గుర్తింపు లభిస్తుంది. కీర్తి ప్రతిష్ఠలు విస్తరిస్తాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. వారాంతంలో కుటుంబ వ్యవహారాలను చర్చిస్తారు. మాటల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక వ్యవహారాలు సమస్యలకు గురి చేయవచ్చు. బంధువర్గంతో కొన్ని సమస్యలకు అవకాశం.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఈ వారం ప్రారంభంలో అన్ని పనుల్లోనూ ప్రయోజన దృష్టి ఉంటుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. లాభాలు సంతోషాన్నిస్తాయి. వ్యతిరేకతలను అధిగమిస్తారు. గుర్తింపు లభిస్తుంది. కార్యనిర్వహణలో శ్రమ ఉంటుంది. కొత్త పనుల నిర్వహణపై దృష్టి ఉంటుంది. సంతోషంగా గడుపుతారు. పెట్టుబడుల్లో సంతృప్తి లభిస్తుంది. వారం మధ్యమంలో ఖర్చులు అధికం. వేరు వేరు రూపాల్లో పెట్టుబడులుంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. విందులు వినోదాల్లోనూ చికాకులకు అవకాశం. విశ్రాంతి కోసం అధికంగా ప్రయత్నిస్తారు. పరామర్శలకు అవకాశం. ఆసుపత్రులు దర్శించకుండా ముందు జాగ్రత్తలు వహించాలి. వారాంతంలో నిర్ణయాదుల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఏ పనిలోనూ తొందరపాటు కూడదు. ఆత్మవిశ్వాసం కోల్పోయే అవకాశం.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఈ వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. అధికారిక వ్యవహారాలకు అనుకూలం. సామాజిక గౌరవం పెంచుకుంటారు. ఆలోచనల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. నిర్ణయాదుల విషయంలో జాగ్రత్త. ప్రణాళికలు తప్పవచ్చు. సంతాన వ్యవహారాల్లో చికాకులు. శ్రమతో గుర్తింపు లభిస్తుంది. వారం మధ్యమంలో అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి. వ్యాపార వ్యవహారాల్లో లాభాలకు అవకాశం. భాగస్వామ్యాల్లో శుభ పరిణామాలు. సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. కొత్త పెట్టుబడులుంటాయి. కాంట్రాక్టు వ్యవహారాలు లాభిస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. సంతోషంగా గడుపుతారు. నూతన కార్యక్రమాలపై దృష్టి. వారాంతంలో కాలం ధనం వ్యర్థమయ్యే సూచనలు. పెట్టుబడుల్లో జాగ్రత్త.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
ఈ వారం ప్రారంభంలో కీర్తి ప్రతిష్ఠలు పెంచుకుంటారు. గుర్తింపు, గౌరవాదులు లభిస్తాయి. సాంకేతిక, వైజ్ఞానిక రంగంలోని వారికి పరిశోధనలు ఫలిస్తాయి. ఉన్నత విద్య, ఉద్యోగాదులపై దృష్టి ఉంటుంది. సుదూర ప్రయాణాలపై ఆసక్తి. సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి. ఆహార విహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. వారం మధ్యమంలో వృత్తి ఉద్యోగాదుల్లో శుభ పరిణామాలు. అధికారిక కార్యక్రమాల్లో శ్రమ తప్పకపోవచ్చు. వ్యతిరేకతలు కూడా పెరగవచ్చు. పోటీలు, ఒత్తిడులకు దూరంగా మెలగాల్సి ఉంటుంది. సామాజిక గౌరవం పెరుగుతుంది. పితృవర్గ అనుబంధ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. గుర్తింపు. వారాంతంలో లాభాలపై అధికంగా దృష్టి ఉంటుంది. అనవసర ఊహలు ఇబ్బంది పెట్టవచ్చు.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)
ఈ వారం ప్రారంభంలో అనుకోని ఇబ్బందులుంటాయి. అనారోగ్య భావనలు. అన్ని పనుల్లోనూ జాగ్రత్త. తొందరపాటు కూడదు. శ్రమాధిక్యం. సంప్రదింపుల్లోనూ అప్రమత్తంగానే మెలగాలి. సోదర వర్గంతో సమస్యలుంటాయి. ముఖ్య నిర్ణయాలను వాయిదా వేసుకోవడం మంచిది. ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి. వారం మధ్యమంలో అన్ని కార్యక్రమాలకు అనుకూలం. పరిశోధనలు ఫలిస్తాయి. ఉన్నత విద్య, ఉద్యోగాదుల లక్ష్యాలు నెరవేరుతాయి. సుదూర ప్రయాణ భావనలు ఫలిస్తాయి. ఆలోచనలకు రూపకల్పన. సంతాన వర్గంతో సంతోషంగా గడుపుతారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. వారాంతంలో వృత్తిలో బాధ్యతలు అధికవౌతాయి. అనేక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది. సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి.
తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)
ఈ వారం ప్రారంభంలో భాగస్వామ్యాలకు అనుకూలం. అనుబంధాలు విస్తరిస్తాయి. పాత స్నేహితుల కలయిక. కుటుంబ వ్యవహారాల్లో కొంత జాగ్రత్త. మాటల్లో తొందరపాటు కూడదు. పరిచయాలు పెంచుకుంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బాధ్యతలు విస్తరిస్తాయి. వేరు వేరు కార్యక్రమాల్లో పాల్గొంటారు. విందులు వినోదాలుంటాయి. వారం మధ్యమంలో అనుకోని సమస్యలుంటాయి. ముఖ్య నిర్ణయాలను వాయిదా వేసుకోవాలి. అనారోగ్య భావనలు. అన్ని పనుల్లోనూ జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. శ్రమాధిక్యం. సౌకర్య లోపాలకు అవకాశం. శ్రమలేని ధన సంపాదనపై దృష్టి ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు. గుర్తింపు. అప్రమత్తంగా మెలగాలి. వారాంతంలో ఉన్నత లక్ష్యాలను సాధించే ప్రయత్నం. గౌరవాదులు అధికవౌతాయి.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఈ వారం ప్రారంభంలో వ్యతిరేకతలు అధికం. కాంపిటీషన్స్‌లో విజయం సాధిస్తారు. కోపం బాగా వస్తుంది. తొందరపాటు కూడా అధికం. శత్రు, రుణ, రోగాదులు మానసిక ఒత్తిడులను పెంచుతాయి. గుర్తింపు ఉన్నా శ్రమాధిక్యం. రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం. పోటీ రంగంలో గుర్తింపు. శారీరక ఒత్తిడులుంటాయి. వారం మధ్యమంలో భాగస్వామితో సంప్రదింపులు, విందులు వినోదాలు విహారాలకు అవకాశం. దగ్గరి ప్రయాణాలుంటాయి. వ్యాపార భాగస్వామ్యాలు ఫలిస్తాయి. కాంటాక్టులు లాభిస్తాయి. అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. పరిచయాలు, స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. వారాంతంలో అనుకోని ఇబ్బందులు. కాలం ధనం శ్రమ వ్యర్థం కావచ్చు. దాన ధర్మాల వల్ల మేలు కలుగుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఈ వారం ప్రారంభంలో ఆలోచనలకు రూపకల్పన. క్రియేటివిటీ పెంచుకుంటారు. స్పెక్యులేషన్స్ లాభిస్తాయి. ప్లానింగ్ ఫలిస్తుంది. తొందరపాటుగా పెట్టుబడులుంటాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. వ్యర్థమైన ప్రయాణాలుండే అవకాశం. సంతానంతో సంతోషంగా గడుపుతారు. అన్ని పనుల్లోనూ అనుకూలత. వారం మధ్యమంలో వ్యతిరేక ప్రభావాలు అధికం. ప్రతి పనినీ ఎదురీది చేయాల్సి వస్తుంది. శ్రమాధిక్యం. విజయం సాధిస్తారు. మాట విలువ పెరుగుతుంది. అప్పుల విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలి. గుర్తింపు కోసం ప్రయత్నం. పోటీ రంగంలో అనుకూలత. కాంపిటీషన్స్ వైపు దృష్టి సారిస్తారు. వారాంతంలో పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరించినా అప్రమత్తంగా మెలగాలి. అనవసర వ్యక్తులతో లావాదేవీలు కూడదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)
ఈ వారం ప్రారంభంలో సౌకర్యాలు పెంచుకుంటారు. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం. ఆహార విహారాల్లో శుభ పరిణామాలు. వేరు వేరు రూపాల్లో ప్రయోజనాలపై దృష్టి. విద్యారంగంలోని వారికి శుభ ఫలితాలు. అన్ని పనుల్లోనూ అనుకూలత. గృహ వాహనాదుల విషయంలో చర్చలుంటాయి. వారం మధ్యమంలో ఆరోచనలకు రూపకల్పన. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. నిర్ణయాదులు సంతోషాన్ని ఇస్తాయి. ఆత్మవిశ్వాసం ముందడుగు వేస్తారు. పనులు అతి వేగంగా పూర్తవుతుంటాయి. సంతోషంగా ఉంటారు. సంతాన వ్యవహారాలు ఫలిస్తాయి. వారాంతంలో పోటీ రంగంలో జాగ్రత్తగా మెలగాలి. వ్యర్థమైన పనులు చేయాల్సి వస్తుంది. ఆశ తగ్గించుకోవాలి. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. వ్యతిరేకతలపై విజయం సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది.
కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఈ వారం ప్రారంభంలో సంప్రదింపులకు అనుకూలం. దగ్గరి ప్రయాణాలుంటాయి. ఇతరుల సహకారం లభిస్తుంది. వృత్తిపరమైన వత్తిడులు అధికవౌతాయి. సోదర వర్గంతో అనుకూలత. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. మీడియా రంగంలోని వారికి అనుకూలత. ముఖ్యమైన వార్తలు వినే అవకాశం. వారం మధ్యమంలో ఆహార విహారాలపై దృష్టి. విందులు వినోదాలుంటాయి. ప్రయాణాల్లో సంతోషం. పెట్టుబడుల్లో సంతృప్తి. విశ్రాంతి లభిస్తుంది. సౌకర్యాలు పెంచుకుంటారు. గృహ వాహనాదులపై దృష్టి కేంద్రీకరిస్తారు. సౌఖ్యంగా కాలం గడుపుతుంటారు. మాతృవర్గ వ్యవహారాల్లో శుభ పరిణామాలుంటాయి. వారాంతంలో ఆలోచనలకు రూపకల్పన. సృజనాత్మకంగా వ్యవహరిస్తారు. సంతాన వ్యవహారాల్లో కొత్త నిర్ణయాలుంటాయి. ప్రణాళికలకు అనుకూలం.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ వారం ప్రారంభంలో కుటుంబ వ్యవహారాల్లో శుభ పరిణామాలు. ఆర్థిక నిర్ణయాదులు ప్రాధాన్యత వహిస్తాయి. బ్యాంకు పనులు పూర్తవుతాయి. నిల్వధనం పెంచుకుంటారు. మాట విలువ పెరుగుతుంది. బంధువర్గ వ్యవహారాలు చర్చకు వస్తాయి. లక్ష్యాల సాధనలో అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది. వారం మధ్యమంలో సంప్రదింపులు సంతోషాన్నిస్తాయి. దగ్గరి ప్రయాణాలుంటాయి. మంచి వార్తలు వింటారు. స్ర్తివర్గ సహకారం లభిస్తుంది. పెద్దల ఆశీస్సులుంటాయి. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. ఇతరుల సహకారం లభిస్తుంది. వేరు వేరు రూపాల్లో ప్రయోజనాలుంటాయి. వారాంతంలో సౌకర్యాలపై దృష్టి. సౌఖ్యంగా కాలం గడిపే ప్రయత్నం. గృహ వాహనాల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆహార విహారాల్లో ఇబ్బందులుంటాయి.

-డాక్టర్ సాగి కమలాకర శర్మ