S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ట్వింకిల్ ట్వింకిల్ వండర్ స్టార్!! -5

ముద్దొచ్చే మోము, చురుకైన కళ్లు, వినయం ఉట్టిపడే నడక. అందరినీ ఆశ్చర్యపరిచే మేధస్సు. ఆ కుర్రాడ్ని చూస్తే చూపురులిట్టే ఆకర్షితవౌతారు. ఇక స్కూల్ టీచర్స్ విషయం చెప్పనక్కర్లేదు. అఖిల్‌ని అందరూ లైక్ చేస్తారు.
సుధా మేడమ్ టేప్ ఆన్ చేసింది. సన్నగా మ్యూజిక్ మొదలయ్యింది.
‘డ్యాన్స్ విత్ మ్యూజిక్’ అనేసరికి పిల్లల్లో తిరిగి ఉత్సాహం ఉరకలు వేసింది. సంగీతానికి అనుగుణంగా తలల్ని ఊపసాగారు.
ఒక్కసారిగా జరగాల్సింది జరగక పోవటంలోనే థ్రిల్ ఉంటుంది!
అందుకేనేమో అందరూ వూహించినట్లుగా మూవ్ కాలేదు అఖిల్. బొమ్మలా కదలకుండా ఉన్నాడు.
వాడినలాగే వదిలేస్తే బాగుండేది.
కానీ.. జరగలేదలా!
సుధా మేడమ్ అలలా అఖిల్‌ని చుట్టేసి ‘కమాన్ బాయ్! స్టార్ట్. డాన్స్ విత్ మీ’ అంటూ వాడి రెండు చేతుల్ని పట్టుకుని తనతోపాటు డాన్స్ చేయించబోయింది.
అచేతనంగా మేడమ్‌తోపాటు మూవ్ అవబోయాడు.
కానీ, అంతలోనే జరిగిపోయిందా అపురూప ఘటన.
ఆ సరదా ఘడియల్ని అద్భుత క్షణాలుగా మలిచేస్తూ.
అఖిల్ ముఖం వివర్ణమయ్యింది. ముక్కుపుటలదరసాగాయి. కళ్లల్లోంచి వింత కాంతి ప్రసరిస్తోంది. శరీరంలోని అణువణువూ రెట్టింపు చైతన్యాన్ని సంతరించుకుంటున్న భ్రాంతి.
క్షణక్షణానికి వాడిలో కల్గుతున్న అనూహ్యమైన మార్పులకి అదిరిపడింది మేడమ్. షాక్ తిన్నవానిలా చప్పున వాడ్ని వదిలేసి అప్రయత్నంగా రెండు మూడడుగులు వెనక్కి వేసింది. ఆమె నాడీ వేగం పెరిగింది.
ఆ చిన్నారి మెదడులోకి సంకేతాలేవో ఇంజక్టవుతుంటే భారంగా తలపట్టుకున్నాడు. చెవుల్లో శబ్ద తరంగాల హోరు.
కళ్ళు మూసి వేదనగా కణతల్ని తన చిట్టి చేతుల్తో నొక్కుకుంటూ అరిచాడు ‘వొద్దొద్దని’.
అంతే!
అక్కడేదో విస్ఫోటనం జరిగినట్లు భయంకపితులయ్యారంతా. ఆ హఠాత్ సంఘటనకి హతాశయులై ఆందోళనగా చూస్తుండిపోయారు.
స్ప్లిట్ సెకెండ్ అనంతరం-
అతడి వదనంలో ప్రశాంతత. తేజోవంతమైన పవిత్రత. ఒక తపస్విలా.. మహర్షిలా.. గోచరిస్తున్నాడిప్పుడు.
కంటి పొరల ముందు అస్పష్టపు దృశ్యాలేవో లీలగా కదలాడుతుంటే-
నెమ్మదిగా నెమ్మదిగా నెమ్మదిగా..
అప్పటికే పూర్తిగా పెదాలు విప్పాడు!
అప్పటికే పూర్తిగా ట్రాన్స్‌లోకి వెళ్లిపోయాడా కుర్రాడు.
కొన్ని సంవత్సరాల క్రితం ఆ ప్రాంతంలో అదే మామిడిచెట్టు క్రింద జరిగిన యథార్థ సంఘటనని తాను స్వయంగా చూసినట్లు చెప్పుకుపోతున్నాడా అబ్బాయి.
విస్తుపోయి వింటున్నారంతా!
1990 సంవత్సరం-
పదిహేనేండ్ల ప్రాయంలోనే భరతనాట్యంలోని మెలకువలన్నీ నేర్చుకుందో అమ్మాయి. పేరు పూజిత. నృత్య ప్రదర్శన నిమిత్తమై రిహార్సల్స్ కొరకు అభ్యసం జరుపుతోందక్కడ.
అయితే ఆమె నర్తించే ప్రతిసారీ కొన్ని సెకన్లపాటు గాలిలో తేలుతూ స్టెప్స్ వేయడం అందర్నీ విస్మయపరిచింది. అక్కడున్న వారెవరికీ మింగుడు పడలేదీ విషయం.
భౌతిక శాస్త్రానికి విరుద్ధంగా భూమ్యాకర్షణ శక్తని కాదని, ఎలాంటి ఆధారం లేకుండా ఒక మనిషి తనకు తానే స్వేచ్ఛగా గాలిలో ఎగరడం అత్యద్భుతం. మానవ మాత్రులెవరూ ఊహించలేనిదీ ప్రక్రియ. దైవాంశ సంభూతులకు సైతం ఇప్పటివరకూ సాధ్యంకాలేదిది.
పూజిత నృత్య సమయంలో గాలిలో తేలుతోందనే విషయాన్ని నిర్థారించడానికి ఫిజిక్స్ ప్రొఫెసర్ రామానందమూర్తి ప్రత్యేకంగా ఆహ్వానించబడ్డాడు. స్వయంగా తిలకించాడామె నృత్యాన్ని.
అనంతరం పూజితని ఇంటర్వ్యూ చేశాడు.
‘‘అలా గాలిలో ఎగిరే సమయంలో నీలో అంతర్గతంగా భౌతిక, మానసిక మార్పులేమైనా జరుగుతున్నాయా?’’ అంటూ ప్రశ్నించాడు.
అందుకామె-
‘‘మానిసకంగా ఎలాంటి మార్పులు కలగడంలేదు. కానీ ఆ సమయంలో ఎవరోవ దేవత నన్ను పైకెత్తి ఆడిస్తున్నట్లుగా అనుభూతి కల్గుతోంది’’ అని బదులిచ్చింది.
అయితే ఆ అమ్మాయి నృత్యం చేస్తూన్న ప్రతిసారీ గాలిలో ఎగిరే ఆ కొన్ని సెకండ్ల సమయంలోనే నిజంగానే ఆమె ముఖంల మార్పు వచ్చేసింది. వింత కాంతి దేదీప్యమానమై వెలిగేది.
ప్రొ.రామానందమూర్తి పైవిషయాన్ని ధృవపరిచాడు.
కొన్ని సెకన్లపాటు భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరకేంగా గాలిలోనే వుండి ఆ అమ్మాయి చేసే అపురూప నృతత్యం పలువుర్ని విభ్రాంతికి గురిచేయడంతోపాటుగా, ఫిజిక్స్ సిద్ధాంతాలకే అతి పెద్ద ఛాలెంజింగ్‌గా మారింది!
అఖిల్ చెప్పింది రెప్పార్పకుండా విన్నారంతా.
కళ్ళలో కదలాడిన అక్షరాలే పేపర్‌పై అచ్చై అచ్చెరువుకి గురిచేసినట్టు.. మనసున మెదిలిన భావాలే స్క్రీన్‌పై ప్రాణం పోసుకొని చిత్రాలుగా ఎదుట నిలిచినట్టు.. అమితమైన ఆశ్చర్యనికి లోనయ్యారు.
చెప్పడం పూర్తయ్యాక ఆయాసంతో ఆగిపోయాడా కుర్రాడు. శరీరమంతా ఎవరో పట్టుకుని కుదిపినట్లు ఊగిపోయింది.
సంకేతాలు మెదడుకి అందడం ఆగిపోయాయి. చెవుల్లో హోరు తగ్గింది. ముఖంలోని తేజస్సు మటుమాయమయ్యింది. అంతర్త అలజడి లేదు.
క్షణంలో సాధారణ బాలుడిగా మారిపోయాడతను.
నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. చూపులు నిర్మలంగా వున్నాయి.
ఫ్రెండ్స్‌తోపాటు మేడమ్స్ తన చుట్టూ చేరి, అదోలా చూస్తూంటే ప్రశ్నార్థకంగా ముఖం పెట్టాడు. ఎందుకలా తన వంక చూస్తున్నారో అర్థం కాలేదు వాడికి.
ఇందాక జరిగిందేంటో తాను చెప్పిందేంటో అఖిల్‌గా తెలిస్తేగా?
ఆ కుర్రాడి చెంతకు ఒక్క ఉదుటున వచ్చి చేరింది హెడ్.
‘‘ఏమైంది నిట్టూ’’ అని అడిగింది.
సరదాగా పిల్లలకి పిక్‌నిక్ ప్రోగ్రామ్స్ ఏర్పాటుచేస్తే, హఠాత్తుగా వీడిలా ప్రవర్తించడం హెడ్ ఆఫ్ ది ఇన్‌స్టిట్యూషన్‌గా ఆమెను ఆందోళనకి గురిచేసింది.
ఆమె ప్రశ్నకు వాడి దగ్గర నుండి సమాధానం రాలేదు.
‘నినే్న అఖిల్ ఏం జరిగిందంటే బదులివ్వవేం’’ అంటూ సీరియస్‌గా రెట్టించి అడిగింది.
‘‘నాకా ఏం జరగలేదు మేడమ్’’ కాస్త జంకుతూ అమాయకంగా బదులిచ్చాడు వాడు.
అవాక్కయ్యిందామె.
మిగతావాళ్ళు ఆశ్చర్యచకితులై ఆ కుర్రాడ్ని మార్చి మార్చి చూస్తున్నారు.
‘‘డాన్స్ చేయమంటే చేయలేదు. ఆ తర్వాత ఏం జరిగిందీ గుర్తులేదా’’ మళ్లీ తనే అడిగింది.
‘‘తెలీదు మేడమ్. సుధా మిస్ వచ్చి డాన్స్ చేయించడనికి నా చేతులు పట్టుకున్నారు. తర్వాత మీరు వచ్చి ఏం జరిగిందని అడుగుతున్నారు’’ అంటూ సమాధానమిచ్చాడు.
ఈసారి ఆశ్చర్యపోవడం ఆ కుర్రాడి వంతయ్యింది.
ఆలోచనల్లో పడింది హెడ్.
ఇంతక్రితం జరిగిందేమీ గుర్తున్నట్టు లేదు. ఆ అబ్బాయికి స్పృహ లేకుండానే జరిగినట్లుందా సంఘటన.
ఆ విషయం స్పష్టంగా అర్థమైందామెకు. అందుకే కుర్రాడ్ని మరింకేం అడగలేదు.
ఆ సంఘటనతో అందరి మూడ్ అవుట్ కావడం గమనించింది. పిక్నిక్ ప్రోగ్రామ్‌ని అర్థాంతరంగా ఆపివేస్తున్నట్లు వెంటనేప్రకటించింది. తలలూపారంతా.
నిజానికి అందరిలోనూ ఒక రకమైన భయం చోటుచేసుకుంది.
అసంతృప్తిగా కదిలారు.
పిల్లలైతే అఖిల్ ప్రక్కన కూచోవడానికే జడుసుకున్నారు. అందుకే హెడ్ వాడ్ని స్టాప్ దగ్గర కూర్చోబెట్టింది. అఖిల్ మాత్రం ఏమీ జరగనట్లు కామ్‌గా ఉండిపోయాడు.
అన్నీ సర్దాక అరగంటలో స్కూల్ బస్ భారంగా కదిలింది.
బస్ ప్రయాణిస్తుంటే సుధారాణి ఆలోచనల్లో పడింది.
‘‘అఖిల్ చెప్పిన నృత్య కళాకారిణి పూజిత న్యూస్ నిజంగా జరిగిందే! యస్. ఆ విషయం ఎప్పుడో పేపర్లో చదివినట్టు లీలగా గుర్తు. అప్పడింకా వీడు పుట్టి ఉండడు’’.
మరి! ఇదెలా సాధ్యం?
ఆ న్యూస్ ఎక్కడైనా చదివి బట్టీ పట్టి వీడిప్పుడు అప్పచెప్పలేదు కదా! అలా చేయాల్సిన అవసరం వీడికేముంది? ఆట పట్టించడానికో ఆశ్చర్యపర్చడానికో చేసి ఉండడు.
తన ప్రమేయం లేకుండానే జరిగిపోయిందంటున్నాడు. అలాగయితే వీడిలో ఏదో మహత్తు ఉండి ఉండాలి.
ఇలా రకరకాల సందేహాలు ఆమెలో.
మరింత ఆలోచనల్ని కంటిన్యూ చేయలేక భారంగా తల విదిల్చింది.
***
అతని పేరు పాండవీయం.
పేరే కాదు. అతను కూడా విభిన్నమైన వ్యక్తి, సమర్థుడు. తన మనసులో ఒక ఆలోచన రూపుదిద్దుకుంటుండగానే దాన్ని ఆచరణ సాధ్యం చేయగల మేధావి.
అందుకనే, ఒకప్పుడు నెంబర్‌వన్‌గా వెలుగొంది, నేడు కష్టమర్లే దాని పేరు మరచిపోయిన పరిస్థితికి చేరుకున్న.. మనీ మనీ కో ఆపరేటివ్ బ్యాంక్‌కి కొత్త మేనేజర్‌గా బదిలీ చేయబడ్డాడు.
ఆ బ్యాంక్ పునర్ వైభవాన్ని ప్రతిష్ఠించే బాధ్యతని పాండవీయం భుజస్కంధాలపై మోపబడ్డపుడు-
‘‘ఇది సాధ్యమయ్యేపనేనా?’’ అనుకున్నాడతను.
ఇంతటి ఇంటలిజెంట్ అలా అనుకోవడంలో తప్పులేదు.
బట్..
అతడు సైతం ఊహించని రీతిలో..తన ప్రమేయం లేకుండా మనీ మనీ బ్యాంక్ మళ్లీ ఒక విశిష్ట స్థానాన్ని ఆఖ్రమించుకోబోతోందని ఆ క్షణంలో పాండవీయానకి తెలియదు.
బ్యాంక్ మేనేజర్‌గా ఛార్జ్ తీసుకున్నాడు.
దోపిడీ ఘటన జరిగాక బ్యాంకులన్నీ కట్టుదిట్టం చేశారు. అలాగే ఈ బ్యాంకుకి కూడా భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.. మనుపెన్నడూ లేని విధంగా సెక్యూరిటీ నియమించబడింది.
ఈ ఏర్పాటు అనవసరమన్పించింది పాండవీయానికి. అదే విషయాన్ని పై ఆఫీసర్స్ దృష్టికి తీసుకుపోయాడు. వాళ్ళు పరిశీలిస్తామని చెప్పారు.
జాయిన్ అయిన గంటే అసిస్టెంట్ మేనేజర్‌కి చెప్పి హడావుడిగా బయటపడ్డాడు పాండవీయం.
ఎప్పుడైతే పాండవీయం కొత్త మేనేజర్‌గా రాబోతున్నాడని, మనీ మనీ బ్యాంక్‌కి మెసేజ్ వచ్చిందో..
అదిగో అప్పుడే బ్యాంక్‌ని దోపిడీ చేసిన నేరస్థులు అలర్టయ్యారు.
తక్షణం అతని కదలికలపై ప్రత్యర్థుల నిఘా ఏర్పాటయ్యింది.
అలా జరుగుతుందని పాండవీయానికేం తెలుసు!
***
పిక్‌నిక్‌లో జిరగిన సంఘటన అక్కడికే సమసిపోతే బావుండేది.
ఆ సంఘటనని అంతా మరిచిపోయి అసలేమీ జరగనట్టు ఎశరి మట్టుకు వాల్ళు ఊర్కుండి తిరిగి వెళ్లిపోతే ఈ కథ ఇన్ని మలుపులు తిరిగి ఉండేది కాదు.
కానీ జరిగిందలా!
స్కూల్ బస్ నేరుగా అఖిల్ ఇంటికి వెళ్లింది.
మధ్యంతరంగా స్కూల్ వాళ్ళు ఇంటికి రావడంతో ఆశ్చర్యపోయింది నివేదిత. ప్రోగ్రామ్ ప్రకారం సాయంత్రం ఆరూ - ఏడూ ప్రాంతంలో రావాల్సింది.
అందుకే అడిగింది.
‘‘పిక్‌నిక్ నుండి వచ్చేసరికి సాయంత్రం అవుతుందన్నారు. మరేంటీ మధ్యాహ్నమే తిరిగి వచ్చారు?’’
అఖిల్‌ని వెంటేసుకుని లోపలికి వచ్చిన హెడ్ మిస్‌ని, సుధా మేడమ్‌ని ప్రశ్నార్థకంగా చూసింది నివేదిత.
మళ్లీ వెంటనే ‘‘సారీ ముందు మీరు కూర్చోండి. నిలబడే మాట్లాడుతున్నారు’’ అంది వాళ్ళకెదురుగా కూర్చుంటూ.
సోఫాలో కూర్చున్నారిద్దరూ.
అఖిల్ పరుగున వెళ్లి తల్లి ఒడిలో గువ్వలా ఒదిగాడు.
‘‘మీకో విషయం చెప్పి వెళదామని వచ్చాం’’ కాస్త సంశయంగా అంది సుధారాణి.
అపుడు గమనించింది నివేదిత ఇద్దరి మొహాలు ఆందోళనాభరితమై వుండటాన్ని. అందుకే చప్పున అడిగింది.
‘‘అసలేం జరిగింది’’ అని.
‘‘నథింగ్ అంతగా కంగారు పడాల్సిందేం లేదు’’ అంటూ అఖిల్ వైపు చూస్తూ ‘‘నిట్టూ నువ్వు లోపలకు వెళ్లి రెస్ట్ తీసుకో’’ అంది హెడ్‌మిస్. తలాడిస్తూ వాడక్కడినుండి బెడ్‌రూమ్‌లోకి వెళ్లిపోయాడు.
వాళ్లిద్దరి హడావుడికి ‘‘ఎవరికీ ఏం కాలేదుగా?’’ అంటూ ఆతృతగా అడిగింది నివేదిత.
ఆమె కొడుకు నిక్షేపంగా ఉండడంతో హాయిగా ఊపిరి పీల్చుకుంది. కానీ పిక్‌నిక్‌లో కుర్రాడికెవరికైనా ఏమైనా ప్రమాదం జరగలేదుల కదా అనే శంక మొదలయ్యిందామెలో. అయినా ఆ విషయం తనకెందుకు చెప్పడం అనుకుంది.
‘‘ఏమీ కాలేదు బట్.. ఓ విషయం అడుగుతాను. అది కూడా మీరు ఫీలవను అంటేనే..’’ అంది హెడ్.
‘‘అదేం లేదు. నిర్భయంగా అడగండి..’’ అందామె.
‘‘మీ అబ్బాయి అఖిల్ ఆరోగ్యం బాగానే వుందా?’’
‘‘ఊ..’’ అంటూ తలూపింది.
ఒక్క క్షణం ఆగి.
‘‘ఐ మీన్.. శారీరకంగా లేదా మానసికంగా ఏనీ ప్రోబ్లమ్స్?’’ నివేదిత ఫీలింగ్స్ అబ్జర్వ్ చేస్తూ ప్రశ్నించింది.
‘‘లేదే? వాడు పుట్టినప్పటినుండి ఇప్పటివరకు అసలు తలనొప్పి ఎరుగడు. అడపా దడపా జలుబు, జ్వరం మినహా మరే వ్యాధీ ఎటాక్ చేయలేదు’’.
‘‘ఐసీ!’’
‘‘అసలెందుకివన్నీ అడుగుతున్నారు?’’
ఇద్దరూ వౌనం వహించారు.
‘‘నా దగ్గర మీరేదో దాచే ప్రయత్నం చేస్తున్నారు. అసలేం జరిగింది? పిక్‌నిక్‌లో మావాడికేం కాలేదుగా?’’
తనకి తెలియకుండానే అపుడు మొదలయ్యిందామెలో భయం. ఏమీ జరిగి ఉండకూడదని వెంటనే మనసులో దేవుడికి మొక్కుకుంది.
‘‘మీరు అనవసరంగా వర్రీ అవకండి. మీ వాడికేమీ జరుగలేదు. హీ ఈజ్ ఆల్‌రైట్. అయితే పిక్‌నిక్ జరిగిన ఒక సంఘటన మాత్రం వినండి’’ అంటూ సుధారాణి వివరించిందా ఘటనని.
మధ్యలోనే ఏడ్పు ప్రారంభించింది నివేదిత.
‘‘చూడండి. అక్కడ జరిగింది మీకు చెప్పి మిమ్మల్ని బాధపెట్టడానికి మేమిక్కడికి రాలేదు. ఈ సంఘటన మరో ప్రమాదానికి దారితీయకూడదని ముందుగానే జాగ్రత్తపడమని చెప్పడానికివచ్చాం’’ అంది హెడ్.
‘‘పైగా ఈ విషయం ఎవరికీ చెప్పకండి. అనవసర ప్రచారం జరుగుతుంది బాబుమీద. మేం కూడా ఈ క్షణానే్న దీన్చి మరచిపోతాం’’ చెప్పింది సుధారాణి.
అలా ఆమెకి ధైర్యం చెప్పి వాళ్ళు వెళ్లిపోయారు.
-.ళనఆతాను చథివిన చదువు అదొక మానసిక బలహీనతగా నిర్థారిస్తుంటే, తాను పెరిగిన గ్రామీణ వాతావరణం అఖిల్‌ని ఏదైనా దుష్టశక్తి ఆవహించిందేమోనని అనుమానిస్తోంది.
ఎటూ తేల్చుకోలేని మానసిక సంఘర్షణలో పడిందామె.
కానీ ఒక్కటి మాత్రం నిజం. నా చిట్టి తండ్రికి ఏదో జరుగుతోంది. వాడికే తెలియకుండా అక్కడే ఏదో జరిగి వుంటుంది. పిక్‌నిక్‌కి పంపాల్సింది కదా. మొన్న బెలూన్ సాహసమంటూ అలా ప్రమాదం తప్పిపోయింది. క్షేమంగా బ్రతికి బయటపడ్డాడనుకుంటే ఈ రోజు ఇలా జరిగింది.
రేపేం జరుగుతుందో?
అలా జరుగక్కూడదు.
నా బాబు సమస్యల వలయంలో చిక్కుకోకుండా ఆపాలి.
కానీ ఎలా?
అప్పుడు తట్టిందామెకో ఆలోచన.
అదే ఆమె తీసుకున్న తప్పుడు నిర్ణయం!
మరోసారి ఇలా జరిగితే చూద్దామనుకొని ఈ సమస్యని అంతటితో వదిలేస్తే బాగుండేది. సీరియస్‌గా తీసుకుందామె.
తన ఆలోచన మరో అధ్యాయానికి మలుపు తిప్పబోతోందని కనీసం ఊహించనైనా లేదామె.
ఊహించి వుంటే..!?
***
ఆయన పేరు షణ్ముగం!
నగరంలో పలుకుబడి కల్గిన వ్యక్తుల్లో ఒకడు. ఆర్థికంగా ఆరా తీస్తే టాప్ టెన్ సిటిజన్స్‌లోకి వస్తాడు.
వయసు నలభై అయిదు. కానీ వంశపారంపర్యంగా వచ్చిన బట్టతల, అక్కడక్కడ నెరుస్తున్న గడ్డం. అతన్ని మరింత వయసు పైబడ్డ వ్యక్తిలా కన్పించేలా చేస్తాయి.
అతను చేపట్టని వ్యాపారం లేదు. చేయని పనిలేదు. రాజకీయంగా కూడా చాలా ఇన్‌ఫ్లుయెన్స్ వుంది. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, అందరితోనూ స్నేహ సంబంధాలున్నాయి. మంచి విలువ కూడా వుంది.
ఆమధ్య జరిగిన ఎలక్షన్స్‌లో తాను కోరుకున్న నియోజకవర్గం నండి యం.పిగా పోటీ చేయమని అన్ని పార్టీలనుండి విడివిడిగా ఆఫర్స్ వచ్చాయి.
ఏదో ఒక వర్గానికో, పార్టీకో, వ్యవస్థకో కట్టుబడి ఉండడం తనకి ఇష్టం లేదు. అందుకే చిరునవ్వుతో వారి అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించాడు.
ఒక్కగానొక్క కొడుకు అమెరికాలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. తనకి దూరంగా ఉండి కొడుకు చదువుకోవడం ఇష్టం లేదతనికి. కానీ కొడుకు పట్టుబట్టడంతో గ్రీన్‌సిగ్నల్ ఇవ్వక తప్పింది కాదు.
భార్య చనిపోయి పదేళ్ళయ్యింది. కన్న కొడుకు మీద మమకారంతో మళ్లీ వివాహం చేసుకోలేదు.
ఉన్నత కుటంబీకులైన కొందరు స్ర్తిలతో షణ్ముగానికి రహస్యంగా లింక్స్ వున్నాయని జనం చాటుగా చెవులు కొరుక్కుంటున్నారు.

-ఎనుగంటి వేణుగోపాల్ 9440236055