S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రత్నధారణ

మేషలగ్నం - మేషలగ్నం వారికి పచ్చ ఎప్పుడూ ధరింపరాదు. ఆశ్రేష, జ్యేష్ఠా, రేవతీ నక్షత్రం జన్మ నక్షత్రం అయినప్పటికీ జన్మలగ్నం మేషం అయిన యెడల పచ్చ ధరింపరాదు. మరి పుష్యరాగం, పగడం, వజ్రం సాధారణ స్థాయి ఫలితాలు ఇస్తాయి. మరి పగడం చాలావరకు మంచి ఫలితాలు అందించదు. మేష లగ్నంలో జననం అయి మృగశిర, ధనిష్ఠా, చిత్తా నక్షత్రములు జన్మ నక్షత్రములు అయిన యెడల పగడం ధరించిన యెడల సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. లగ్నాధిపతి కుజుడు, ఈ నక్షత్రాలకు అధిపతి కుజుడు అయిన కారణంగా సర్వసాధారణంగా ఇబ్బందులు రావు. మరి పుష్కరాగం విషయంలో కూడా గురువు భాగ్య వ్యయాధిపత్యం వచ్చినది కదా! అందువలన సాధారణ స్థాయి గ్రహం కదా! అందువలన పుష్యరాగం ధారణ పెద్దగా విశేష ఫలితాలు చూపదు. మరి - శుక్రుడికి రెండు ఆధిపత్యాలు మంచివి కావు కదా! అందువలన వజ్రధారణ ఎప్పుడూ శ్రేయస్కరం కాదు. మరి, ముత్యం, కెంపు, నీలం ధారణ సర్వదా శ్రేష్ఠమే. మరి గోమేధికం, వైఢూర్యం ధారణ చేయుట ద్వారా మంచి చెడుల నిర్ణయం చేయాలి అంటే రాహు కేతు స్థితి లగ్నాత్ అష్టమ, షష్ఠ, వ్యయ స్థానములలో వుంటే చేయరాదు. మిగిలిన స్థానములలో వున్న యెడల ధరింపవచ్చు. మేష లగ్నంలో పుట్టినప్పటికీ కృత్తిక 2,3,4 పాదములు, రోహిణి, స్వాతీ, మృగశిర 1,2, చిత్త 3,4, విశాఖ 1,2,3 పాదముల వారు వజ్రం ధరించవలసిన స్థితి వస్తే చాలా విశే్లషణ చేయండి. మరి శుక్రుడు ఏ స్థానంలో వున్ననూ శుక్రుడికి ఆధిపత్యాలు మంచివి కావు కదా. అందువలన అసలు ఆధిపత్య రీత్యానే మంచి గ్రహం కాని గ్రహం యొక్క జాతి రాయి ధరించడం ఎప్పుడూ శ్రేయస్కరం కాదు.
ఇక మరొక విషయం లగ్నాత్ 6,8,12 స్థానాధిపతులకు సంబంధించిన జాతి రాళ్లు, అలాగే 6,8,12 స్థానాలలో వున్న జాతి రాళ్లు ధరించడం ఎప్పుడూ శ్రేయస్కరం కాదు. మరి జన్మ నక్షత్రం ఆధారంగా చేసుకొని జాతిరాయి నిర్ధారణ చేయునప్పుడు లగ్నాత్ ఆధిపత్యాలు ప్రధానంగా స్టడీ చేయవలసినదే. జన్మ నక్షత్రాల ఆధిపత్యాల వివరము ప్రధానమా? అంటే ప్రధానమే. కానీ లగ్నాత్ గ్రహాలు వుండే స్థానమునకే ప్రధానము అనేది నిర్ధారించాలి. ఇక దశలు, అంతర్దశలు నడిచే విషయంలో చాలా ఎక్కువగా పరిశీలించాలి. కారణం దశానాథుడు. ఆయనకు సంబంధించిన మిత్ర గ్రహములు, శత్రు గ్రహములు, వాటి వివరములు మరియు దశానాథుడి ఆధిపత్యములు వంటివి అన్నీ పరిశీలించాలి.
* ఒక జాతి రాయి ధరించాలి అంటే నక్షత్రరీత్యా, లగ్నాత్ ఆధిపత్యం, లగ్నాత్ గ్రహముల స్థితి, దశానాథుడు, అంతర్దశానాథుడులతో వుండే అనుబంధం వంటివి చూసి నిర్ధారించాలి. ఇదే రీతిగా మిగిలిన లగ్నముల విషయంలో కూడా.
--

కప్పగంతు సుబ్బరామ శర్మ (సుబ్బరామ సోమయాజులు)
కామకోటినగర్, శంకరమఠం వీధి, నృసింహ కృప బిల్డింగ్, విజయవాడ - 520 012.

కప్పగంతు సుబ్బరామశర్మ -9848520336