S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారం వారం గోచారం (12.1.2020 నుంచి 18.1.2020 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఈ వారం ప్రారంభంలో ఆహార విహారాలు, సౌకర్యాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. క్రమంగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. సంతాన సంబంధమైన ముఖ్య ఆలోచనలుంటాయి. క్రియేటివిటీ పెరుగుతుంది. స్పెక్యులేషన్స్ లాభిస్తాయి. ఆలోచనలకు రూపకల్పన. నూతన కార్యక్రమాలపై దృష్టి. ఉన్నత విద్యావకాశాలు. వారం మధ్యమంలో వ్యతిరేక ప్రభావాలు అధికం. పోటీ రంగంలో విజయం. కాంపిటీషన్స్‌లో అనుకూలత. కార్యనిర్వహణలో సంతృప్తి. వ్యవహారాలు లాభాన్నిస్తాయి. శ్రమ తప్పకపోవచ్చు. రుణాదుల విషయంలో అప్రమత్తంగా మెలగాలి. వ్యతిరేక ప్రభావాలను అధిగమిస్తారు. మొండితనం వద్దు. వారాంతంలో భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు విస్తరిస్తాయి. స్నేహానుబంధాల్లో శుభ పరిణామాలు.
వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో అనుకోని సమస్యలుంటాయి. అనారోగ్య భావనలుంటాయి. కుటుంబ, ఆర్థికాంశాల్లో జాగ్రత్త వహించాలి. వ్యాపార వ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగాలి. అనుకోని నష్టాలకు అవకాశం వుంది. సంతానవర్గ వ్యవహారాల్లో ఇబ్బందులకు ఆస్కారం. దానధర్మాల వల్ల మేలు. ధార్మిక, దైవ యాత్రల వల్ల లోపాలను అధిగమిస్తారు. నిరాశ అధికవౌతుంది. కాంటాక్టు వ్యవహారాల్లో లాభాలుంటాయి. నిర్ణయాదుల వల్ల ప్రయోజనాలు. వ్యతిరేకతలపై విజయం. కొత్త పనులపై దృష్టి. పెద్దల ఆశీస్సులు లభిస్తుంటాయి. ఉన్నత లక్ష్యాలను సాధించే ప్రయత్నం. ఆలోచనల్లో ఒత్తిడులున్నా కీర్తిప్రతిష్ఠలకు అవకాశం ఉంటుంది. శ్రమ తప్పకపోవచ్చు. సౌకర్య లోపాలకు అవకాశం. సంప్రదింపుల్లో అననుకూలత. ఆలోచనలకు రూపకల్పన. సంతానంతో సంతోషం.
మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఈ వారం ప్రారంభంలో భాగస్వామ్యాల్లో జాగ్రత్త. అనుకోని సమస్యలుంటాయి. ఊహించని ఇబ్బందులు. పార్ట్‌నర్‌షిప్స్‌లో అప్రమత్తంగా మెలగాలి. వ్యాపార వ్యవహారాలకు అనుకూలం. సౌకర్యాలు కూడా శ్రమతో పొందుతారు. పరిచయాలు విస్తరిస్తాయి. నిర్ణయాదులు లాభిస్తాయి. కొంత నిరాశ ధోరణి తప్పకపోవచ్చు. భాగస్వామితో దైవ యాత్రల వల్ల మేలు కలుగుతుంది. వృత్తి ఉద్యోగాదుల్లో శుభ పరిణామాలు. ఆలోచనలకు రూపకల్పన. శ్రమ ఉన్నా గుర్తింపు, గౌరవాదులు పెరుగుతాయి. అధికారిక వ్యవహారాల్లో జాగ్రత్త. సంప్రదింపుల వల్ల సమస్యలు. సహకార లోపాలు. కమ్యూనికేషన్స్‌లో గ్యాప్ ఏర్పడుతుంది. కుటుంబంలో అనుకూలత. శ్రమతో సౌకర్యాలు సమకూర్చుకుంటారు. మాట విలువ పెరుగుతుంది. వ్యతిరేకతలు ఎక్కువ.
కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఈ వారం ప్రారంభంలో వ్యతిరేక ప్రభావాలుంటాయి. సామాజిక భాగస్వామ్య వ్యవహారాల్లో జాగ్రత్త. అవసరం. పోటీలధికవౌతాయి. వ్యాపారాదుల్లో విజయం. గుర్తింపు, గౌరవాదులు. ఎగుమతి దిగుమతి రంగాల్లో శుభ పరిణామాలు. సంప్రదింపుల్లో ఇబ్బందులు. ఖర్చులు పెట్టుబడులు అధికవౌతాయి. పోటీల్లో జాగ్రత్త వహించాలి. నష్టపోయే అవకాశం. రుణాలు ఇబ్బంది పెట్టే సూచనలు. అనుకోని సమస్యలు ఉంటాయి. కాంట్రాక్టు వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి. భాగస్వామ్యాల్లో జాగ్రత్త. పరిచయాల్లో ఇబ్బందులు. సామాజిక అనుబంధాల్లో జాగ్రత్త అవసరం. నిర్ణయాదుల్లో అనుకూలత. సహకారం లభిస్తుంది. వ్యాపార వ్యవహారాల్లో శుభ పరిణామాలు. ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి. సంతాన వ్యవహారాల్లో జాగ్రత్త.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
ఈ వారం ప్రారంభంలో ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి. సంతానంతో జాగ్రత్త. నిర్ణయాదుల్లో ఆలస్యముంటుంది. క్రియేటివిటీ తగ్గుతుంది. వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు. స్పెక్యులేషన్స్ లాభిస్తాయి. కుటుంబంలో అనుకూలత. నిరాశా ధోరణి ఉంటుంది. ప్రణాళికలు లోపిస్తాయి. నిర్ణయాదులలో జాగ్రత్త అవసరం. భాగస్వామ్యాల్లో శుభ పరిణామాలు. సంప్రదింపుల్లో అనుకూలత. వృత్తి ఉద్యోగాదులు లాభిస్తాయి. కాంట్రాక్టు వ్యవహారాలు లాభిస్తాయి. వ్యతిరేకతలపై విజయం. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. పోటీ రంగంలో విజయం. గుర్తింపు లభిస్తుంది. రుణాలను అధిగమిస్తారు. ఖర్చులు పెట్టుబడులకు అనుకూలం. విశ్రాంతి లభిస్తుంది. మాట విలువ పెరుగుతుంది. బ్యాంకు వ్యవహారాలు పూర్తి చేస్తారు. సౌకర్య లోపాలు.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో సౌకర్య లోపాలు అధికం. ఆహార విహారాల్లో ఇబ్బందులు. శ్రమతో కార్యాలు. విద్యార్థులకు గడ్డుకాలం. ఎక్కువ కృషి చేయాల్సి ఉంటుంది. వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు. నిర్ణయాదులు లాభిస్తాయి. శ్రమ ఉన్నా సామాజిక గౌరవం పెంచుకుంటారు. గృహ వాహనాదుల విషయంలో చికాకులుంటాయి. ముందు జాగ్రత్తలు అవసరం. ప్రయాణాదుల్లో జాగ్రత్త వహించాలి. వ్యతిరేకతలున్నా విజయం సాధిస్తారు. పోటీ రంగంలో గుర్తింపు లభిస్తుంది. వ్యతిరేకతలపై విజయం ఉన్నా మానసిక వత్తిడి ఉంటుంది. ఆలోచనలు ఇబ్బంది పెట్టే అవకాశం. సంతాన వర్గంతో ఇబ్బందులుంటాయి. అధికారిక విషయాల్లో ఒత్తిడులు. వ్యర్థమైన ఖర్చులుంటాయి. నిర్ణయాదులు లాభిస్తాయి. ప్రయోజనాపేక్ష నెరవేరుతుంది.
తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)
ఈ వారం ప్రారంభంలో సంప్రదింపుల్లో ఇబ్బందులు. సేవక వర్గ సహకారం లభిస్తుంది. ప్రయాణాదుల్లో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక యాత్రల వల్ల మేలు కలుగుతుంది. వ్యాపారాల్లో సంప్రదింపులుంటాయి. వ్యాపార, మేధావి వర్గ సహకారం లభిస్తుంది. ఉన్నత వ్యవహారాలను పూర్తి చేస్తారు. కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. సోదర వర్గంతో కొంత జాగ్రత్తగా మెలగాలి. కమ్యూనికేషన్లలో లోపాలుంటాయి. ఆలోచనలకు రూపకల్పన. చక్కని క్రియేటివిటీ. నూతనమైన కార్యక్రమాలు. ప్లానింగ్‌కు అనుకూలం. సంతానంతో సంతృప్తి. కొత్త పనులపై దృష్టి. కాంట్రాక్టు వ్యవహారాల్లో అనుకూలత. సౌకర్య లోపాలుంటాయి. ఆహార విహారాల్లో సమస్యలు. శ్రమతో కార్యక్రమాలు. విద్యారంగంలోని వారికి సమస్యలలుంటాయి. ఖర్చులు పెట్టుబడులున్నా విశ్రాంతి, సౌఖ్యం లభిస్తాయి.
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఈ వారం ప్రారంభంలో కుటుంబంలో ఒత్తిడులుంటాయి. మాటల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వౌనంగా ఉండటం శ్రేష్ఠం. ఆర్థిక వ్యవహారాల్లో కొంత స్తబ్దత ఏర్పడుతుంది. వ్యాపారాదుల్లో క్రమంగా ఉన్నతి. కొంత చమత్కార ధోరణి కూడా పెంచుకుంటారు. లాభాలు సంతోషాన్నిస్తాయి. నిరాశ తగ్గించుకోవాలి. ప్రయత్నపూర్వకంగా ప్రశాంతంగా గడపాలి. బ్యాంకు వ్యవహారాల్లో కొంత ఇబ్బంది. క్రమంగా సౌకర్యాలు పెంచుకుంటారు. ఆహార విహారాలకు అనుకూలం. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఖర్చుల వల్ల సంతృప్తి. అధికారికమైన సంప్రదింపులుంటాయి. ప్రయాణాల్లో కొంత జాగ్రత్త. పెద్దల సహకారం లభిస్తుంది. వేరు వేరు రూపాల్లో ప్రయోజనాలుంటాయి. సుదూర ప్రాంతాల ప్రయాణాలపై దృష్టి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఈ వారం ప్రారంభంలో నిర్ణయాదులు ఇబ్బంది పెడతాయి. బద్ధకం తగ్గించుకోవాలి. ఆలోచనల్లో కాలం గడుస్తుంది. కొంత చమత్కార ధోరణి. భాగస్వామ్యాల్లో అనుకూలత. వృత్తి ఉద్యోగాదుల్లో కొంత ఉన్నతి, గుర్తింపు. నిరాశను తగ్గించుకోవాలి. దైవ ధ్యానం, దానంవల్ల మేలు కలుగుతుంది. స్ర్తి వర్గంతో, సోదరీమణులతో సంప్రదింపులు అధికవౌతాయి. వ్యతిరేకతలపై విజయం. వేరు వేరు రూపాల్లో లాభాలు. దగ్గరి ప్రయాణాలుంటాయి. సహకారం లభిస్తుంది. ప్రయాణాలుంటాయి. కుటుంబ, ఆర్థికాంశాల్లో అప్రమత్తంగా మెలగాలి. మాటల్లో అధికారిక ధోరణి తగ్గాల్సి ఉంటుంది. ఆర్థిక సమస్యలు అధికవౌతాయి. వృత్తి ఉద్యోగాదుల్లో శుభ పరిణామాలు. పదోన్నతులుంటాయి. ఊహించని ప్రయోజనాలకు అవకాశం. సామాజికమైన గుర్తింపు లభిస్తుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఈ వారం ప్రారంభంలో ఖర్చులు పెట్టుబడులు అధికం. కాలం ధనం వ్యర్థం కావచ్చు. విశ్రాంతి లోపం ఉంటుంది. ప్రయాణాదుల్లో ఇబ్బందులు. పరామర్శలకు అవకాశం. ఆసుపత్రుల దర్శనం. వ్యాపారాల్లో పెట్టుబడులకు మంచి అవకాశం. అన్ని పనుల్లోనూ ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబంలో శుభ పరిణామాలు. మాటల్లో చమత్కారం. కాంట్రాక్టు వ్యవహారాల్లో అనుకూలత. ఆర్థిక నిల్వలు పెరుగుతాయి. బ్యాంకు వ్యవహారాల్లో స్పష్టత. నిర్ణయాలు లాభిస్తాయి. నిర్ణయాదుల్లో ఒత్తిడులు. శ్రమాధిక్యం. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. అనుకోని ఇబ్బందులు. ఆరోగ్య లోపాలకు అవకాశం. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఉన్నత లక్ష్యాలను సాధిస్తారు. ప్రయాణాలకు అవకాశం. లాభాలున్నా కొంత జాగ్రత్త అవసరం.

కుంభం (ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఈ వారం ప్రారంభంలో అన్ని పనుల్లోనూ ప్రయోజనాలు అధికం. కొంత బద్ధకం తగ్గించుకోవాలి. పెద్దల ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఆధ్యాత్మిక యాత్రల వల్ల మరింత ప్రయోజనాలుంటాయి. కార్యనిర్వహణ దక్షత. ఊహించని లాభాలుంటాయి. దైవధ్యానం, దానం వల్ల ఇంకా అనుకూలత. నిర్ణయాదుల్లో శుభ పరిణామాలు. అన్ని పనుల్లోనూ అనుకూలత. లక్ష్యాలను సాధిస్తారు. సౌఖ్యంగా, సౌకర్యవంతంగా కాలం గడుపుతారు. కాంట్రాక్టు వ్యవహారాలు లాభిస్తాయి. క్రీడాకారులకు అత్యంత అనుకూల సమయం. అధికారిక వ్యవహారాల కోసం కొంత కాలం ధనం వ్యర్థం చేయాల్సి రావచ్చు. విశ్రాంతి లోపం ఏర్పడుతుంది. భాగస్వామి కోసం వెచ్చించాలి. ప్రయాణాదుల్లో ఒత్తిడులుంటాయి. కొంత ఆరోగ్య లోపం ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమాధిక్యం. అధికారిక వ్యవహారాల్లో బాధ్యతలు అధికం. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. సామాజిక వ్యవహారాల్లో శ్రమాధిక్యం. వ్యాపారాదుల్లో శుభ పరిణామాలుంటాయి. భాగస్వామ్యాల్లో అనుకూలత. పితృవర్గ కార్యకలాపాలలో శ్రద్ధ ఉంటుంది. ఖర్చులు పెట్టుబడులు అధికవౌతాయి. విశ్రాంతిగా కాలం గడుపుతారు. ప్రయాణాలుంటాయి. విందులు వినోదాలు సంతోషాన్ని, సంతృప్తినీ ఇస్తాయి. పెద్దల ఆశీస్సులుంటాయి. లాభాల వైపు ప్రయాణం. అధికారిక ప్రయోజనాలు లభ్యం. కొత్త పనులపై దృష్టి కలుగుతుంది. నిర్ణయాదులు లాభిస్తాయి. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. సంతానవర్గ వ్యవహారాల్లో సంతోషం, సంతృప్తి. పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి.

-డాక్టర్ సాగి కమలాకర శర్మ