S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రీ ఎంట్రీ!

తెలుగు, తమిళ చిత్రాల్లో అమలాపాల్ చేసిన చిత్రాలు తక్కువే. అయినా ఆమెకు నటనపై వున్న ఆశ చావలేదు. అనుకున్న ఇమేజ్ రాలేదు. లాభం లేదనుకుందో ఏమో.. ఆ మధ్య దర్శకుడు విజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకొని నటనకు స్వస్తి పలికింది. ‘మైనా’లో ఒక ప్రేమికురాలిగా అమలాపాల్ నటన మరువలేనిది. ఆ చిత్రం తర్వాత స్టార్‌గా ఎదిగింది. అయినా కెరీర్‌ని నిలుపుకోలేకపోయింది. మలయాళీ కుట్టి అయిన ఈ సుందరి టాలీవుడ్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నా, ఫలితం లేకపోయింది. అయితే కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటోందిట. పెళ్లి తర్వాత ఆచి తూచి అడుగులు వేయాలనుకుంటోంది. అందులో భాగంగానే అంగీకరిస్తున్న చిత్రాలతో ఆమె రీ ఎంట్రీ సూపర్‌గా ఉంటుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. తెలుగు, తమిళమే కాదు, మలయాళం, కన్నడంలో కూడా కాలు పెట్టిన ఈ అమ్మడు ఇచ్చే రీ ఎంట్రీ ఆమెకు ఎలాంటి కెరీర్‌ను ఇస్తుందో చూడాల్సిందే మరి!

-సమీర్