S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వధూవరుల జాతక పరిశీలన

జన్మలగ్నము - చంద్ర లగ్నముల లగాయితు 2,4,7,8,12 రాశుల యందు కుజుడు ఉన్న యెడల దానిని కుజదోషంగా పరిగణించాలి. ఈ కుజదోషం ఇరువురికీ ఉన్ననూ లేదా ఇరువురికీ దోషం లేకున్ననూ వివాహం చేయవచ్చును. ఈ దోషం ఒకరికి వుండి మరొకరికి లేని యెడల వైవాహిక జీవితం కలహప్రదంగా ఉంటుంది. కుజుడు కలహప్రదుడు. శని ఆయుర్దాయ కారకుడు కావున పైన చెప్పిన విధానంలోనే శనిదోషం కూడా చూడవలెను అని పరాశర మతం. ‘సచేచ్ఛ భయం వేక్షితః’ అని ఉన్న కారణంగా కుజునికి శుభ గ్రహముల కలయిక (లేదా) శుభ గ్రహ వీక్షణ ఉన్నచో దోషం ఉండదు. కేవలం ఆడవారి జాతకంలో దోషం ఉంటే మగవారికి ఇబ్బంది. కేవలం మగవారి జాతకంలో ఉంటే ఆడవారికి ఇబ్బంది.
ద్వితీయే భౌదురోషన్తు యుగ్మ కన్యక యోర్చిరా ద్వాదశే లొన దోషన్తు వృషతులక యోర్విదా చతుర్దే భౌమధోషన్తు మేష వృశ్చికయోర్పిదా సప్తమే భౌనుదోషన్తు సత్రకర్మల యోర్విదా అష్టమే భౌమదోషన్తు ధనుర్మీనర్నయం వినా కుంభేసిం హేవ రోషస్స్యాత్ ప్రత్యక్షం దేవ కేరశే
ద్వితీయ స్థితి కుజ దోషం మిథున కన్యకలకు లేదు. ద్వాదశ స్థితి కుజదోషం వృషభ తులలకు లేదు. చతుర్థ స్థితి కుజదోషం మేష వృశ్చికములకు లేదు. సప్తమ స్థితి కుజదోషం మకర కర్కాటకములకు లేదు. అష్టమ స్థితి కుజదోషం ధనస్సు, మీనములకు లేదు. కుంభము, సింహముల యందు జననమయినచో కుజదోషం ఉండదు. మేష, వృశ్చిక, మకర లగ్నముల విషయంలోను మృగశిర, ధనిష్ఠ, చిత్త నక్షత్రముల విషయంలోను కుజదోషం ఉండదు. నిత్యం సుబ్రహ్మణ్య ఆరాధన కుజగ్రహ స్తోత్ర పారాయణ చేయువారు కుజగ్రహ దోషం తగ్గించుకో గలుగుతారు.
చంద్ర మంగళ (కుజ) సంయోగం/ గురు మంగళ సంయోగం కుజదోషం ఇవ్వడు. లగ్నం శరీరం, చంద్రుడు మనస్సు, శుక్రుడు భోగకారకుడు కావున ఈ మూడింటి నుండి కుజుడుగా చూడాలి. ఒకవేళ వివాహ సమయానికి కుజ దశ వెళ్లిపోతే కుజదోషం ప్రభావం ఉండదు. కుజుడు నీచలో ఉంటే ప్రభావం తక్కువే. కుజుడు దోషంగా ఉంటే పెళ్లి కాకుండా చేయడు. పెళ్లైన తర్వాత ఇబ్బంది పెడతాడు. కలహాకారుడు కుజుడు. కళేత్రకారుడు శుక్రుడు ఒకే నక్షత్ర పాదం (అయిదు డిగ్రీల) లోపు కలిస్తే మహాదోషం. కేవలం పాయింట్ల పట్టిక ఆధారం కూడదు. పాయింట్ల పట్టిక మరియు కేవలం నక్షత్రం ఆధారంగా సంబంధాలకు ప్రాథమిక విచారణ చేయుట తప్పు. జాతక విషయంగా వెళితే మొత్తం అన్ని వివరాలు తెలుసుకొని ముందుకు వెళ్లాలి.
*

కప్పగంతు సుబ్బరామ శర్మ (సుబ్బరామ సోమయాజులు)
కామకోటినగర్, శంకరమఠం వీధి, నృసింహ కృప బిల్డింగ్, విజయవాడ - 520 012.

కప్పగంతు సుబ్బరామశర్మ -9848520336