S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హరితహారంతో ఆకుపచ్చని తెలంగాణ

పెద్దపల్లి రూరల్, జూలై 21: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారంతో పచ్చని తెలంగాణ సాధించుకుందామని రాష్ట్ర రవాణ శాఖ కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. మండలంలోని పెద్దకల్వల గ్రామ సమీపంలో గల ఎస్సారెస్పీ క్యాంపులో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో కలసి గురువారం ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ సుల్తానియా మాట్లాడుతూ అడువులు అంతరించి పోవడం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయని, ఇందు కోసం విరివిగా చెట్ల పెంపకం ఒక్కటే సరైన మార్గం అని పేర్కొన్నారు. కాలుష్యం నివారణ కోసం రోడ్ల వెంట, జన సమూహం ఉన్న చోట, పరిశ్రమలు ఉన్న పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటాలని ఆయన సూచించారు. మొక్కలు నాటడంతోనే సరిపోదని, వాటి సంరక్షణ బాధ్యత కూడా చేపట్టాలన్నారు. హరితహారానికి ప్రపంచ గుర్తింపు లభించందని, విజయంవం కోసం అందరు కృషి చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో పాటు జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ పాండురంగ నాయక్, కరీంనగర్ డిప్యూటీ కమిషనర్ ఎంజి వినోద్, పెద్దపల్లి ఎంవిఐలు కె.వేణు, డి.లింగామూర్తి, రంజీత్‌రెడ్డి, శోభన్‌బాబు, కిషన్‌రావు సిబ్బంది పాల్గొన్నారు.