S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విద్యార్థిని మృతిపై పెల్లుబికిన నిరసనలు

గోరంట్ల, జూలై 21 : పట్టణంలోని శాంతినికేతన్ ప్రైవేటు పాఠశాలలో నర్సరీ విద్యార్థిని తన్మయి సాయి బండ విరిగిపడి మృతి చెందిన ఘటనపై ప్రజా, విద్యార్థి సంఘాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశాయి. ఇందులో భాగంగా గురువారం స్థానిక ఎస్‌విఆర్ కళాశాల నుంచి బస్టాండ్ సర్కిల్ వరకూ ప్రధాన రహదారి మీదుగా ర్యాలీ చేసి కదిరి-హిందూపురం రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే ధర్మవరం డిఎస్పీ వేణుగోపాల్ రంగంలోకి దిగి ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ప్రైవేటు పాఠశాలల పట్ల విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఘటనపై డిఇఓకు వెంటనే సమాచారం అందించినా ఇప్పటి వరకు చూసేందుకు రాలేదంటూ ఆందోళనకారులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, పాఠశాల యాజమాన్యాన్ని అరెస్టు చేయాలి, పాఠశాల అనుమతులు రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో పలు విద్యార్థి సంఘాల నాయకులు సురేంద్రయాదవ్, రాంప్రసాద్ నాయక్, లక్ష్మినారాయణ, గోపాల్‌నాయక్, రవినాయక్, సిఐటియు కార్యదర్శి రమేష్, సుధాకర్, మహిళా మండలి అధ్యక్షురాలు రమాదేవిలతోపాటు పలు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రామగిరి సిఐ యుగంధర్, ఎస్సైలు రాజశేఖర్‌రెడ్డి, రాఘవరెడ్డి, వెంకటేశ్వర్లు శాంతిభద్రతలను పర్యవేక్షించారు.
పాఠశాల సీజ్ : డిఇఓ
విద్యార్థిని మృతికి కారణమైన శాంతినికేతన్ ప్రైవేటు పాఠశాలను సీజ్ చేశామని జిల్లా విద్యాధికారి అంజయ్య తెలిపారు. గురువారం పాఠశాలను సందర్శించి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలు పాటించని ప్రైవేటు పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయనతోపాటు డిప్యూటీ డిఇఓ సుబ్బారావు, ఎంఇఓ కలీముల్లా ఉన్నారు. కాగా శాంతినికేతన్ ఘటనతో ఉలిక్కి పడ్డ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మరమ్మతులు ప్రారంభించాయి.