S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడమే ధ్యేయం

గాలివీడు, జూలై 21:రాయలసీమ జిల్లాలోని ఉపాధ్యాయుల ప్రధాన సమస్యలను పరిష్కరించడమే ప్రధాన ధ్యేయంగా భావిస్తున్నామని మాజీ ఎమ్మెల్సీ పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి పోచంరెడ్డి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి పరిస్థితులలోనైనా ఉపాధ్యాయ ఏకీకృత రూల్స్‌ను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 578 ఎంఇఓ పోస్టులు, 48 డిప్యూటీ డీఇఓ పోస్టులు, 294 డైట్ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ పోస్టులను భర్తీ చేయాల్సిందిగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 16 సంవత్సరాలుగా ఉపాధ్యాయుల సమస్యల పట్ల చేసిన ఉద్యమ ఫలితంగా ఉపాధ్యాయ సర్వీసు రూల్స్ రాబోతున్నాయన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేయు స్కూల్ అసిస్టెంట్లను జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ స్టేట్ పీఆర్‌సీ అమలు చేయాల్సి ఉందన్నారు. అనంతరం మండలంలోని పలు పాఠశాలలను ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యాయ నేత పప్పిరెడ్డి చిన్నరెడ్డన్న, ప్రధానోపాధ్యాయులు మహబూబ్‌బాషా, ఉపాధ్యాయులు రామక్రిష్ణారెడ్డి, రమణారెడ్డి, నారాయుడునాయక్, సైరాభాను తదితరులు పాల్గొన్నారు.