S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జీవకోటికి ప్రాణాధారం మొక్కలు

రాయచోటి, జూలై 21:ప్రపంచం జీవకోటికి మొక్కలే ప్రాణాధారం అని రాయచోటి నియోజకవర్గం ఇన్‌చార్జి రమేష్ కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం మాసాపేటలోని పాలటెక్నిక్ కళాశాలలో టిడిపి మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి సుజాత, జిల్లా టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి జగన్ మోహన్‌రాజు, జిల్లా కార్యదర్శి ముస్తాక్‌ల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమానికి నియోజకవర్గం ఇన్‌చార్జి రమేష్‌కుమార్‌రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొనడం చాలా సంతోషకరమన్నారు. విద్యార్థులు ఇంటికి వెళ్లిన తర్వాత ప్రతి ఒక్కరు మొక్కను నాటాలని సూచించారు. పాలటెక్నిక్ కళాశాలకు త్వరలో నీటి సౌకర్యం, ప్రహరీ, బస్సు షెల్టర్‌ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కళాశాలలో వేసిన మొక్కలను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్క విద్యార్థి తీసుకోవాలని ఆయన సూచించారు. ఈకార్యక్రమాన్ని ఇంత భారీ ఏత్తున ఏర్పాటు చేసిన జిల్లా టిడిపి మహిళా ప్రధాన కార్యదర్శి సుజాత, కార్యనిర్వాహక కార్యదర్శి జగన్ మోహన్‌రాజు, జిల్లాకార్యదర్శి ముస్తాక్‌లను ఆయన అభినందించారు. అనంతరం టిడిపి కార్యనిర్వాహక జిల్లా కార్యదర్శి జగన్‌మోహన్‌రాజు మాట్లాడుతూ నియోజకవర్గం ఇన్‌చార్జి రమేష్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గ కృషికి రమేష్‌రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. నియోజకవర్గం వ్యాప్తంగా లక్షల సంఖ్యలో మొక్కలు నాటేందుకు రమేష్‌రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. అనంతరం మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి సుజాత మాట్లాడుతూ మొక్కలు ప్రతి ఒక్కరికి మేలు చేస్తాయని ఆమె తెలిపారు. చెట్లు లేనిదే జీవరాశి లేదని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందన్నారు. రాయచోటి పట్టణాన్ని పచ్చదనంతో నింపేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆమె అన్నారు. నియోజకవర్గం ఇన్‌చార్జి రమేష్‌రెడ్డి స్వార్థం లేకుండా నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఆమె అన్నారు. అనంతరం జిల్లా టిడిపి కార్యదర్శి ముస్తాక్‌హుస్సేన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. మొక్కలు కార్బన్‌డయాక్సైడ్‌ను పిల్చుకుని మానవునికి అవసరమైన ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయని ఆయన తెలిపారు. మానవునికి ప్రాణధారమైన ఆక్సిజన్‌ను చెట్లు విడుదల చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ఆయన చెప్పారు. అనంతరం నియోజక వర్గ ఇన్‌చార్జి రమేష్ రెడ్డి అధ్యక్షతలన పాలటెక్నిక్ కళాశాలలో సుమారు 1000 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. నియోజక వర్గ ఇన్‌చార్జి రమేష్ రెడ్డి, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి జగన్ మోహన్ రాజు, జిల్లా టిడిపి కార్యదర్శి ముస్తాక్, జిల్లా టిడిపి మహిళా ప్రధాన కార్యదర్శి సుజాత, మార్కెట్ కమిటీ చైర్మన్‌ఖాదర్ బాషా, జిల్లా ఉపాధ్యక్షురాలు నసిబున్సిసా, మాజీ వక్ఫ్‌బోర్డు సభ్యుడు డాక్టర్ దాదాసాహెబ్, వృక్ష రక్షణ సమితి అధ్యక్షులు తులసీశ్వరరెడ్డి, పాలటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి, పట్టణ అధ్యక్షులు సాదిక్, రూరల్ అధ్యక్షులు మురికినాటి సుబ్బారెడ్డి, పట్టణ అధ్యక్షురాలు లక్ష్మీ, మాజీ కౌన్సిలర్ సుగవాసి పాలకొండ్రాయుడు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్యామ్‌కుమార్, పట్టణ ఉపాధ్యక్షులు కారంశెట్టిగిరి, శ్రీ వీరభద్రస్వామి ఉత్సవ కమిటీ సభ్సుయలు గురవయ్య, గంగాధర్, అతావుల్లా, కొప్పల గంగిరెడ్డి, భారీ సంఖ్యలో విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.