S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మహిళా సంఘాలకు చేపల పెంపకం బాధ్యత

విజయనగరం, జూలై 21: జిల్లాలో చేపల పెంపకానికి అనువైన వాతావరణం, అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ ఎంఎం నాయక్ తెలిపారు. గ్రామ పంచాయతీల తీర్మానంతో ఆయా గ్రామాల పరిధిలోని చెరువులను మహిళా సంఘాలకు అప్పగించి అక్కడ చేపల పెంపకానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. గురువారం తన ఛాంబర్‌లో మత్స్యశాఖ, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని 417 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న 1593 చెరువులను గుర్తించి గ్రామ పంచాయతీల తీర్మానంతో మహిళా సంఘాలకు కేటాయించామని కలెక్టర్‌కు అధికారులు తెలిపారు. మొత్తం రెండువేల చెరువులలో మహిళా సంఘాల పర్యవేక్షణలో చేపల పెంపకానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. చేపల పెంపకం ద్వారా మహిళా సంఘాలకు ఆదాయ వనరులు పెరుగుతాయని చెప్పారు. చేపల పెంపకంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునేలా మహిళా సంఘాలకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లావ్యాప్తంగా 300 క్యాప్టివ్ ఫిష్ నర్సరీలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నర్సరీల ఏర్పాటుకు అవసరమైన బోర్లు, విద్యుత్, సోలార్ పంప్ సెట్ల ఏర్పాటుకు అనుమతులు ఇస్తామని చెప్పారు.
పాల దిగుబడి పెంచాలి : జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధికి అవకాశాలు మెండుగా ఉన్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని పాడి రైతులను ప్రోత్సహించడం ద్వారా పాల దిగుబడిని పెంచాలని కలెక్టర్ నాయక్ సూచించారు. పశుసంవర్థక శాఖ అధికారులతో కలెక్టర్ గురువారం సమావేశం నిర్వహించారు. సీజన్‌లో పాడిరైతులకు అవసరమైన పశుగ్రాసాన్ని పెంచేందుకు పదివేల ఎకరాలు సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు 5447 ఎకరాలు గుర్తించామని అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. మిగతా భూమిని వెంటనే గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. 147 హైడ్రో పోలిక్స్ పశుగ్రాస యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. పశుపోషణ, పాలదిగుబడి పెంచే విషయంలో రైతులకు అవసరమైన శిక్షణ, ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. సమీక్ష సమావేశంలో పశు సంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సింహాచలం, మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి సత్యనారాయణ రాజు, డిఆర్‌డిఎ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ సుధాకర్ పాల్గొన్నారు.