అమెరికాలో చిత్రాంగద
Published Saturday, 23 July 2016అంజలి ప్రధాన పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ డ్రావిడన్స్ పతాకంపై అశోక్ దర్శకత్వంలో గంగపట్నం శ్రీ్ధర్, రెహమాన్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘చిత్రాంగద’. ప్రస్తుతం ఈ చిత్రం అమెరికాలో పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ, ‘ఇప్పటివరకు ఎవరూ టచ్‌చేయని హారిజాంటల్ థ్రిల్లర్ కామెడీ జానర్లో రూపొందుతున్న చిత్రమిది. సినిమా ఆద్యంతం ఉత్కంఠగా ఆసకిత్తకరంగా వుంటుంది. చిత్రంలో వుండే ట్విస్ట్‌లు ఆడియన్స్‌ని షాక్‌కి గురిచేస్తాయి. ఇప్పటివరకు కథానాయిక అంజలి తన కెరీర్లో చేయనటువంటి ఓ విభిన్నమైన పాత్రను ‘చిత్రాంగద’లో పోషిస్తుంది. అంజలి పాడిన పాట చిత్రానికి హైలైట్‌గా వుంటుంది. తెలుగుతోపాటు తమిళంలోకూడా అంజలియే ఈ పాట పాడింది. టైటిల్ పాత్రలో ఆమె అభినయం చిత్రానికి హైలైట్‌గా వుంటుంది. కొన్ని అదృశ్య శక్తుల కారణంగా ఆమె జీవితం ఏవిధంగా చిక్కుల్లో పడింది? తనకు ఎదురైన సవాళ్లను అధిగమించే క్రమంలో చిత్రాంగదకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అన్నదే మా చిత్ర ఇతివృత్తం. కథానుగుణంగా అమెరికాలోని పలు అందమైన లొకేషన్స్‌లో కీలక ఘట్టాల్ని చిత్రీకరించాం. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ పనులు అమెరికాలో జరుగుతున్నాయి. గ్రాఫిక్స్‌కి అత్యంత ప్రాధాన్యత కలిగిన చిత్రం కావడంతో... ప్రతిదీ పర్ఫెక్ట్గా రావాలని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అందువల్లే మూవీ ఆలస్యం అవుతోంది. అతి త్వరలో ఆడియోను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.