S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బోరుబావిలో పడిన బాలుడు మృతి

గ్వాలియర్, జూలై 23: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సమీప గ్రామంలో 150 అడుగుల లోతైన బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు చనిపోయాడని పోలీసులు శనివారం తెలిపారు. శుక్రవారం తన నాయనమ్మ, అక్కతో కలిసి ఇంటికి తీసుకువస్తుండగా అభయ్ పచోరి అనే మూడేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు పొలంలోని బోరుబావిలో పడిపోయాడు. దాదాపు 22 గంటల పాటు శ్రమించిన అనంతరం శనివారం ఉదయం ఆ బాలుడిని బోరుబావిలోంచి బైటికి తీశారు. పోలీసులు, స్థానికుల సాయంతో ఎన్‌డిఆర్‌ఎఫ్, బిఎస్‌ఎఫ్ సిబ్బంది సిసి కెమెరాల సాయంతో నిరంతరం పర్యవేక్షిస్తూ సహాయక చర్యలు చేపట్టారు. బోరుబావికి సమాంతరంగా ఒక గొయ్యిని కూడా తవ్వారు. బాలుడి పక్కనే ఒక పాము ఉన్నట్లు సిసి కెమెరాల్లో కనిపించింది. బాలుడ్ని బైటికి తీసిన వెంటనే హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అతను అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. బాలుడి శరీరంపై పాముకాటు కానీ లేదా ఏ జంతువు దాడి చేసిన గాయాలు కానీ లేవని ప్రాథమిక పరీక్షలో వెల్లడయిందని, బోరుబావిలో పడిన తర్వాత ఊపిరాడక బాలుడు చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారని గ్వాలియర్ కలెక్టర్ డాక్టర్ సంజయ్ గోయల్ చెప్పారు.