S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

యూపీ బస్సు కదిలింది!

న్యూఢిల్లీ, జూలై 23: దేశంలో అతిపెద్ద రాష్టమ్రైన ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ శనివారం శ్రీకారం చుట్టింది. ‘27సాల్ యూపీ బేహాల్’ (27ఏళ్లలో ఉత్తర ప్రదేశ్ అస్తవ్యస్తం) అన్న నినాదంతో మూడు రోజుల బస్సు యాత్ర మొదలుపెట్టింది. పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి షీలా దీక్షిత్, ఇతర నేతలు ఎక్కిన ఈ బస్సును కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం నుంచి ప్రారంభించారు. దాదాపు 600 కిలోమీటర్ల మేర జరిగే ఈ యాత్రలో భాగంగా రాష్ట్ర ప్రజలకు చేరువై ఈ 27 ఏళ్లలో జరిగిన పరిణామాల్ని వివరించడమే కాంగ్రెస్ లక్ష్యం. గమ్యస్థానమైన కాన్పూర్ చేరుకునే లోగా అనేకచోట్ల ఈ బస్సు ఆగుతుంది. గులాం నబీ అజాద్ సహా కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆయా ప్రాంతాల ప్రజల్ని కలుసుకుని రాష్ట్ర పరిస్థితిని వివరిస్తారు. అనేక బహిరంగ సభల్లో మాట్లాడటంతో పాటు పార్టీ కార్యకర్తల్ని కూడా కలుసుకుని వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తారు. రోజుకు నాలుగు జిల్లాల్లో జరిగే ఈ బస్సు యాత్ర తొలి రోజు మొరాదాబాద్ జిల్లాలో జరుగుతుంది. అనంతరం షాజహాన్‌పూర్ తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలు పర్యటిస్తారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని యాత్ర ప్రారంభం సందర్భంగా కాంగ్రెస్ నేత ఆజాద్ అన్నారు.
చిత్రాలు.. 27సాల్ యూపీ బేహాల్’ నినాదంతో మూడు రోజుల బస్సు యాత్రను జెండా ఊపి ప్రారంభిస్తున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.
ఈ బస్సు యాత్రలో యూపీ ముఖ్యమంత్రి అభ్యర్థి షీలా దీక్షిత్‌తో పాటు పలువురు స్థానిక నేతలు పాల్గొంటున్నారు.