S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నేడు నీట్-2

హైదరాబాద్, జులై 23: దేశవ్యాప్తంగా ఆదివారం ‘నీట్-2’ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోనూ అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు 9.30లోగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. 10 గంటల పరీక్షకు నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదని చెబుతున్నారు. విద్యార్థులు ఆడ్మిట్ కార్డు, ఫొటోలు తప్పని సరిగా తేవాలన్నారు. పర్సులు, మొబైల్స్ వంటి వాటిని అనుమతించరు. పెన్నులు కూడా అనుమతించబోమని, పెన్నులను పరీక్షా హాలులోనే విద్యార్థులకు పంపిణీ చేస్తామని అధికారులు చెప్పారు. పరీక్ష నిర్వహణను వీడియో చిత్రీకరించనున్నారు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్‌లో, ఆంధ్రలో విశాఖపట్నం, విజయవాడలోని పలు కేంద్రాల్లో పరీక్షకు ఏర్పాట్లు చేశారు. కాగా హైదరాబాద్‌లో ఎక్కువగా 29 కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇందులో 23 వేల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.