S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విపక్షం ఖాళీ కావాలి

విశాఖపట్నం, జూలై 23: మనం శాశ్వతంగా అధికారంలో ఉండాలంటే విపక్ష పార్టీలు ఖాళీ కావాల్సిందేనని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖ వేదికగా శనివారం జరిగిన పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ పార్టీలోకి వచ్చి చేరుతున్న వారి విషయంలో సీనియర్లు, ఇతర నేతలు ఘర్షణ పూరిత పోకడలను ప్రదర్శించకూడదని హితవు చెప్పారు. నేతలు, కార్యకర్తలు సర్దుకు పోయే తత్వాన్ని అలవరచుకోవాలని హితవు పలికారు. విపక్షాలు తప్పులు ఎంచకుండా ఉండాలంటే మన పార్టీ బలం 85 శాతం పెరగాలని, అప్పుడే అధికారం శాశ్వతంగా మనదగ్గరే ఉంటుందని చంద్రబాబు కార్యకర్తలకు ఉపదేశించారు. 2004లో తన వైఖరి కారణంగానే అధికారానికి దూరమయ్యామని, అప్పుడే కాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే పదేళ్లు ప్రతిపక్షంలో కూచునే దుస్థితి తలెత్తేది కాదని అన్నారు. పదేళ్ల నిర్విరామ కృషి, కార్యకర్తల అండదండలతో అధికారం చేపట్టామని, ఇది శాశ్వతంగా ఉండేందుకు ఏం చేయాలో అంతా చేస్తానని అన్నారు. అందుకు పార్టీ కేడర్ సహకారం కూడా అవసరమన్న విషయాన్ని గుర్తించాలన్నారు. అధికారంలో ఉన్నా, విపక్షంలో కూర్చున్నా ప్రజలకు చేరువగా ఉంటూ, పార్టీ కేడర్‌ను నిలుపుకోవడంవల్లే మరోసారి అందలం ఎక్కగలిగామన్నారు. కష్టాలొస్తే కుంగిపోలేదని, సుఖాలకు లొంగిపోలేదని, ఆ మొండి ధైర్యమే తిరిగి అధికారం అందిపుచ్చుకునేలా చేసిందన్నారు. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, తాను 208 రోజులపాటు 2,811 రోజులపాటు రాష్ట్రం మొత్తం కాలినడకన పర్యటించానని, ప్రజల సమస్యలు తెలుసుకున్నానని ఆయన గుర్తు చేశారు. అధికారం లేనప్పుడు పార్టీ నుంచి కొంతమంది నాయకులు మధ్యలో పోయి, మళ్లీ వచ్చారని, కార్యకర్తలు మాత్రం ఎక్కడికీ పోలేదన్నారు.మరో మూడు దశాబ్దాలపాటు తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.
టెక్నాలజీ నా ప్రాణం
సమాజంలో సాంకేతికంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా మనం మారాలని, ఆ మార్పులతో అద్భుతాలు సృష్టించవచ్చని చంద్రబాబు చెప్పారు. నాలుగోతరం సాంకేతిక విప్లవాన్ని మన పార్టీ అందిపుచ్చుకుందని, మిగిలిన రాజకీయ పార్టీలకు, తెలుగుదేశం పార్టీకి వ్యత్యాసం అదేనని చెప్పారు. టెక్నాలజీని ప్రాణ స్నేహితునిగా భావించే తాను పార్టీనిర్వహణలో సాంకేతికతకు అంతే ప్రాధాన్యత ఇస్తానన్నారు. తన వేగాన్ని అందిపుచ్చుకుని కార్యకర్తలు ముందుకు సాగాలని, అప్పుడు ఇరవైయేళ్లలో సాధించాల్సిన ప్రగతిని ఐదేళ్లలో సాధించి చూపిస్తానన్నారు.
పార్టీపరంగా, ప్రభుత్వపరంగా అన్ని పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని చంద్రబాబు కార్యకర్తలకు అభయమిచ్చారు. పదవులు పొందేందుకు మీరు అర్హులా, కాదా అన్న అంశం మీ పనితీరు మేరకే ఉంటుందన్నారు. కార్యకర్తలను లక్షాధికారులను చేసే ప్రణాళికకు పార్టీ రూపకల్పన చేస్తోందన్నారు.

చిత్రం.. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు