S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ధైర్యంగా ఉండండి

విశాఖపట్నం, జూలై 23: వాయుసేనకు చెందిన ఎఎన్-32విమానం అదృశ్య ఘటనకు సంబంధించి విమానం ఆచూకీ శనివారం రాత్రికి కూడా లభించకపోవడంతో విశాఖలోని ఎన్‌ఎడికి చెందిన 8 మంది ఉద్యోగుల కుటుంబాలు నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయాయి. బాధిత కుటుంబాల ఇళ్ల వద్ద తుపాను ముందు ప్రశాంతతవంటి వాతావరణం నెలకొంది. జగదాంబ జంక్షన్‌లో నివసించే రావాడ వర ప్రసాద్, బాజీ జంక్షన్‌కు చెందిన పాటి నాగేంద్ర, వేపగుంటకు చెందిన గంట్ల శ్రీనివాస్, అప్పన్నపాలెంకు చెందిన బి.సాంబమూర్తి, యుపికి చెందిన భూపేంద్ర సింగ్, బరంపురానికి చెందిన సేనాపతి, మాహారాణ, బుచ్చిరాజుపాలెంకు చెందిన చిన్నారావు ఇళ్లకు పరామర్శకు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. విశాఖలోని ఎన్‌ఎడికి చెందిన ఉద్యోగుల కుటుంబాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం పరామర్శించారు. సిఎం బుచ్చిరాజుపాలెంలోని నమ్మి చిన్నారావు, పాటి నాగేంద్ర కుటుంబాలను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. గల్లంతైన వారి ఆచూకీని గుర్తించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని వివరించారు. ధైర్యంగా ఉండాలని చెప్పారు. మిగిలిన 6 మంది ఉద్యోగుల కుటుంబాలను సాయంత్రం విమానాశ్రయంలో ఆయన కలిశారు. మరిప్రాలెంలో బాధిత కుటుంబాలను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా పరామర్శించారు.

చిత్రం.. బాధిత కుటుంబాలను పరామర్శించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు