S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఒక తుపాకీ అరవై ప్రాణాలు!

ఇదెక్కడి నరమేధం?
ప్రపంచాన్ని శాసించగల అగ్రరాజ్యం
తన బిడ్డల్ని నియంత్రించలేదా?
చంపుకుంటే చంపుకోండని
తుపాకీలకు ఆమోదముద్రలు వేస్తుందా?
ఒక మానవ రాక్షసుడు
ట్రిగ్గర్ నొక్కి అరవై ప్రాణాల్ని
క్షణకాలంలో హరించడమా!
తన నడిబొడ్డులో
నివాసముంటున్న
హంతకుల్ని గుర్తించే టెక్నాలజీ లేదా?
తుపాకీల లైసెన్సులను
నియంత్రించే సత్తా లేదా?
అరవై ప్రాణాలు! కోట్లాది ప్రశ్నలు??

-గుడిమెట్ల గోపాలకృష్ణ 89774 74958