S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నిరుద్యోగులకు శుభవార్త

హైదరాబాద్, జూలై 23: మరో 593 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు చేపట్టే పోస్టులకు అనుమతినిస్తూ ఆర్థిక శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 409 గ్రూప్ 2 పోస్టులను మంజూరు చేశారు. దీంతో మొత్తం 1002 గ్రూప్2 పోస్టులు మంజూరు అయ్యాయి. వ్యవసాయ శాఖ, సహకార శాఖ, రిజిస్టార్ ఆఫ్ కో ఆపరేటివ్‌లోని మొత్తం 62 పోస్టులు ఉన్నాయి. జిఎడిలో సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 90, ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 28, లా డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 10 ఉన్నాయి. పరిశ్రమలు, హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్ అసిస్టెంట్ డివిజనల్ ఆఫీసర్ 20 పోస్టులు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పోస్టులు 3, రెవెన్యూ శాఖలో అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ పోస్టులు 46, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ తహసిల్దార్ 259 పోస్టులు, ఎక్సైజ్ ప్రోహిబీషన్‌లో ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు 64, దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ వన్ పవస్టులు 11 మొత్తం 593 పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేస్తుంది. రాష్టప్రతి ఉత్తర్వుల మేరకు నియామకాల్లో జోన్‌ల విధానం, జిల్లా వంటివి వర్తిస్తాయి.