S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రాజధానికి కొత్త రూపు

హైదరాబాద్, జూలై 23: రాజధాని నగరంలో ఇంటి నెంబర్ల సమస్య తీరిపోతుంది. ఎప్పుడో నిర్ణయించిన ఇంటి నెంబర్లతో అడ్రస్ పట్టుకోవడంలో ఇంతకాలం ఉన్న సమస్యను పరిష్కరించడానికి స్వచ్ఛంద సంస్థ ‘ఆస్కి’ ముందుకొచ్చింది. ఆస్కి కార్యాలయంలో హైదరాబాద్ సమస్యలపై మున్సిపల్ వ్యవహారాల మంత్రి కె తారక రామారావు సమావేశం నిర్వహించారు. ఆస్కి ప్రతినిధులు, నగర మేయర్‌తో పాటు మున్సిపల్ అధికారులు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లో ఇంటి నెంబర్ల్లను కొత్త విధానంలో ఏర్పాటు చేసే ప్రక్రియను జిహెచ్‌ఎంసి, ఆస్కి సంయుక్తంగా చేపడుతుంది. హైదరాబాద్‌లో పరిస్థితులు మెరుగుపరిచి పౌరులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు గతంలో ఆస్కి ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. గతంలో సూచించన పరిష్కారాలను ఆచరణలో పెట్టేలా కార్యాచరణ రూపొందించనున్నట్టు, దీనిలో ఆస్కి భాగస్వామ్యం కావాలని కెటిఆర్ కోరారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న బస్‌స్టాప్‌లను ఆధునీకరిస్తారు. ప్రయాణికులు ప్రశాంతంగా కూర్చునేలా మారుస్తారు. ఇంటి నెంబర్లు వరుసగా ఉండేట్టు కొత్త నెంబర్లు అమర్చుతారు. ప్రయోగాత్మకంగా ఒక ప్రాంతం నుంచి దీన్ని ప్రారంభిస్తారు. నగరంలో పెద్ద సంఖ్యలో పార్కులున్నా వాటి నిర్వహణ సరిగా లేదు. పార్కుల నిర్వహణలో ఆస్కి భాగస్వామ్యమవుతుంది. నూతన బస్ స్టేషన్లను ఏర్పాటు చేయడం, వాటికి అనుబంధంగా టాయిలెట్లు, సీటింగ్ సదుపాయాలు, బస్ స్టేషన్లు ఏవిధంగా ఉండాలనే డిజైన్ల రూపకల్పన వంటి వాటిలో ఆస్కి భాగస్వామిగా ఉంటుంది. బస్ స్టాపుల అభివృద్ధి, కొత్త ఇంటి నంబర్లు, పార్కుల నిర్వహణ, స్వచ్ఛ హైదరాబాద్ ఈ నాలుగు అంశాల్లో జిహెచ్‌ఎంసితో కలిసి పని చేసేందుకు ఆస్కి ముందుకు వచ్చింది. ఆరునెలల్లో ప్రజలకు కనీస వసతులు కల్పించాలని కెటిఆర్ అధికారులకు, ఆస్కికి సూచించారు. ఆరునెలల్లో మార్పు స్పష్టంగా కనిపించాలన్నారు. పార్కులను అధికారులు, నగరంలోని ప్రజాప్రతినిధులకు దత్తత ఇస్తామని, వాటి నిర్వహణపై వారు ప్రత్యేకంగా దృష్టిసారించాలని కెటిఆర్ సూచించారు. ఆస్కి చేపట్టే కార్యక్రమాలకు జిహెచ్‌ఎంసి ద్వారా ఆర్థిక, పాలనాపరమైన మద్దతు పూర్తిస్థాయిలో అందిస్తామని చెప్పారు. మూడు నెలల్లో 150 డివిజన్లలోనూ ఆస్కి ప్రభావం కనిపించాలన్నారు. మెహదీపట్నంలో బస్ స్టేషన్ ఏర్పాటు చేస్తూ అక్కడ పైలట్ ప్రాతిపదికన స్కైవాక్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. బస్ స్టాపుల్లో క్యూ లైన్లు ఉండేలా నూతన బస్ స్టాప్‌ల నమూనా ఉండాలన్నారు. జిహెచ్‌ఎంసి తరఫున మూడు బృందాలను ఏర్పాటుచేసి అర్బన్ ఇన్‌ఫ్రా అభివృద్ధి, జంక్షన్ల అభివృద్ధి, రోడ్డు మధ్యలో డివైడర్ల ఏర్పాటు, ల్యాండ్ స్కేపింగ్‌ల ఏర్పాటు వంటి అంశాల్లో పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు కోరుకుంటున్న కనీస వసతుల మీద ఉద్యమ స్ఫూర్తితో పని చేయాలన్నారు. నగరంలో తాను విస్తృతంగా పర్యటిస్తానని చెప్పారు. న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కనీస వసతుల నిర్వహణ బాగా చేస్తోందని వివరించారు. అక్కడి వసతులు, పని తీరు పరిశీలించేందుకు జిహెచ్‌ఎంసి అధికారులు ఈనెల 26న ఒక రోజు ఢిల్లీ పర్యటన చేయనున్నట్టు కెటిఆర్ తెలిపారు.

చిత్రం.. జిహెచ్‌ఎంసి సమస్యలపై శనివారం నిర్వహించిన నగర పర్యటనలో
స్థానికుల నుంచి సమస్యలు తెలుసుకుంటున్న మున్సిపల్ మంత్రి కెటిఆర్