ఆధార్ కార్డూ ఇక తప్పనిసరి
Published Sunday, 24 July 2016హైదరాబాద్, జూలై 23: హైదరాబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్, రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. వాహనదారులు కొన్ని నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సి, వాహన ధ్రువ పత్రాలతోపాటు ఆధార్ కార్డు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని కోరారు. వాహన తనిఖీ సమయంలో ఆధార్ కార్డు చూపకపోతే వాహనం సీజ్ చేస్తామని ట్రాఫిక్ డిసిపి రంగనాథ్ హెచ్చరించారు. వాహనాలను సీజ్ చేయడంతో పాటు కేసులు కూడా నమోదు చేస్తామని డిసిపి అన్నారు. ఆదివారం నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.