S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇక పాఠ్యాంశాల్లో రోడ్డు భద్రత

హైదరాబాద్, జూలై 23: హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు రోడ్డ్భుద్రతపై అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడవ క్లాసు నుంచి పదవ క్లాస్ వరకు పాఠ్యాంశాలలో తప్పనిసరిగా రోడ్డ్భుద్రతపై పాఠాన్ని చేర్చనున్నారు. ఈ నెల 1వ తేదీన నాగార్జునసర్కిల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రమ్య అనే బాలిక మరణించడం, కుటుంబ సభ్యులను కూడా కోల్పోవడం అందరినీ కలచివేసింది. ఈ సంఘటనపై రాష్ట్ర పోలీసు, విద్యా శాఖలు తీవ్రంగా స్పందించాయి. రోడ్డు ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ పోలీసు శాఖ ఉన్నతాధికారులు విద్యాశాఖాధికారులను కలుసుకున్నారు. దీనికి సంబంధించి విధి విధానాలపై చర్చించారు. అనంతరం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ట్రాఫిక్ పోలీసు, రోడ్డు రవాణా శాఖ, పాఠశాల హెడ్‌మాస్టర్లు, ప్రిన్సిపాళ్లు, పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులను సభ్యులుగా నియమించనున్నారు. ఈ కమిటీ సకాలంలో నివేదిక ఇచ్చే విధంగా అవసరమైన ప్రణాళిక ఖరారు చేయాలని రాష్ట్రప్రభుత్వం హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఎం మహేందర్ రెడ్డిని కోరింది. సిలబస్‌లో ట్రాఫిక్ మేనేజిమెంట్, రోడ్డు సేఫ్టీ అంశాలు ఉంటాయి. ట్రాఫిక్ సిగ్నల్స్, పాదచారి బాట, జీబ్రా క్రాసింగ్స్, ట్రాఫిక్ సిగ్నలింగ్, వాహనాలను ఎక్కేటప్పుడు క్యూ పద్ధతిని పాటించడం తదితర అంశాలు సిలబస్‌లో చేర్చనున్నారు. డ్రైవింగ్ లైసెన్సు, హెల్మెట్ ఉపయోగం, సీట్‌బెల్ట్, లైసెన్సును పొందే విధానం తదితర అంశాలపై విద్యార్థులకు ప్రాక్టికల్‌గా కూడా అవగాహన కల్పిస్తారు. హైస్కూలు స్థాయిలో పై తరగతుల్లో మంచిగా రోడ్ సేఫ్టీ విధానాలను అమలు చేయడం, ప్రమాదకరమైన ధోరణులు అంటే ర్యాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, ఎక్కడపడితే అక్కడ వాహనాలను ఆపడం, నిలుపుచేయడం, ఆపి ఉంచడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం అనే అంశాలను కూడా పాఠ్యాంశాలలో చేర్చనున్నారు. దీంతో పాటు పారిశుద్ధ్యం, పరిశుభ్రత అనే అంశాలను కూడా పాఠ్యాంశాల్లో చేర్చాలని మున్సిపాలిటీ శాఖ, గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ విద్యా శాఖను కోరాయి. ఈ ఏడాదికి ప్రత్యేక బుక్‌లెట్‌ను ప్రచురించి విద్యార్థులకు ఇస్తారు. వచ్చే ఏడాది నుంచి తప్పనిసరిగా పాఠ్యాంశాలలో చేర్చే విషయమై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.