S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పోర్టు భూముల సమీకరణకు గ్రీన్‌సిగ్నల్!

మచిలీపట్నం, జూలై 23: బందరు ఓడరేవు నిర్మాణం, కోస్టల్ కారిడార్ ఏర్పాటు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందుకు అవసరమైన భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించాలని ఇటీవల నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి ఆర్ కరికాల వలవన్ జీవో నెం.185ను జారీ చేశారు. మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (మడ) ద్వారా భూసమీకరణ చేపట్టనున్నారు. జీవో నెం.185 ద్వారా భూసమీకరణకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం ప్రకటించింది. మచిలీపట్నం పురపాలక సంఘంలోని 42 వార్డులతో పాటు బందరు మండలంలోని 27 రెవెన్యూ గ్రామాలు, పెడన మండలంలోని కాకకర్లమూడిని కలుపుకుని 426.16 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో గతంలో ‘మడ’ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ‘మడ’ ద్వారా భూసమీకరణకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. రాజధాని అమరావతి భూముల రైతులకు ఇచ్చిన ప్యాకేజీని ఇక్కడ కూడా ఇవ్వనున్నారు. భూముల రిజిస్ట్రేషన్లపై గతంలో విధించిన నిషేధాన్ని ఈ సందర్భంగా ప్రభుత్వం ఎత్తివేసింది.
మెట్ట ప్రాంతంలోని ఎకరం పట్టా భూమికి వెయ్యి చదరపు గజాలు రెసిడెన్షియల్ స్థలం, 250 చదరపు గజాలు కమర్షియల్ స్థలాన్ని ఇవ్వనున్నారు. మాగాణి భూములకు సంబంధించి వెయ్యి చదరపు గజాల రెసిడెన్షియల్ స్థలం, 450 చదరపు గజాలు కమర్షియల్ స్థలాన్ని ఇవ్వనున్నారు. మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులు, 1954 జూన్ 18కి ముందు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూముల (మెట్ట)కు వెయ్యి చదరపు గజాలు రెసిడెన్షియల్, 200 చదరపు గజాలు కమర్షియల్ స్థలం, మాగాణి భూములకు సంబంధించి వెయ్యి చదరపు గజాలు రెసిడెన్షియల్, 450 చదరపు గజాలు కమర్షియల్ స్థలాన్ని ఇవ్వనున్నారు. 1954 జూన్ 18 తర్వాత ఇచ్చిన అసైన్డ్ భూములకు సంబంధించి మెట్ట భూమి అయితే 800 చదరపు గజాలు రెసిడెన్షియల్, 100 చదరపు గజాలు కమర్షియల్ స్థలం, మాగాణి భూమి అయితే 800 చదరపు గజాలు రెసిడెన్షియల్, 200 చదరపు గజాలు కమర్షియల్ స్థలం ఇవ్వనున్నారు. క్రయ, విక్రయాలు జరిగిన అసైన్డ్ భూములు, అభ్యంతరం లేని ప్రభుత్వం ఇచ్చిన భూములకు మెట్ట అయితే 500 చదరపు గజాలు రెసిడెన్షియల్, 50 చదరపు గజాలు కమర్షియల్ స్థలం, మాగాణి భూములకు 500 గజాలు రెసిడెన్షియల్, 100 చదరపు గజాలు కమర్షియల్, ప్రభుత్వం గతంలో ఇచ్చిన అభ్యంతరకర మెట్ట, మాగాణి భూములకు 250 చదరపు గజాల నివేశన స్థలాన్ని మాత్రమే ఇవ్వనున్నారు. దీంతోపాటు పంట నష్టపరిహారం కింద ఏడాదికి మెట్ట అయితే రూ.30వేలు, మాగాణికి రూ.50వేలు కౌలు ఇవ్వనున్నారు. ఈ కౌలును 10 శాతం పెంపుతో పదేళ్ల పాటు ఇవ్వనున్నారు. రైతు కూలీలకు నెలకు రూ.2500లు పెన్షన్ ఇవ్వనున్నట్లు విధివిధానాల్లో వివరించారు.