S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దవాఖానాల్లో సంస్కరణలు

హైదరాబాద్, జూలై 23 : తెలంగాణ రాష్ట్రంలో దవాఖానాల్లో సంస్కరణలు తీసుకువస్తున్నామని వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర ఔషధ సేవలు, వౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టిఎస్‌ఎంఎస్‌ఐడిసి) పనితీరును శనివారం ఆయన సమీక్షించారు. ప్రభుత్వ దవాఖానాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. అంతర్జాతీయ స్థాయి కలిగిన సంస్థలకు మాత్రమే పారిశుద్ధ్య పనులను అప్పగించాలని భావిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో ఒక్కో బెడ్ నిర్వహణకు ప్రస్తుతం ఇస్తన్న ఆరువేల రూపాయలను ఏడువేల రూపాయలకు పెంచాలని భావిస్తున్నామన్నారు. వైద్యపరికరాలు, మందులు, పరీక్షలకు సంబంధించిన పరికరాలు తక్షణమే సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దవాఖానాల్లో మంచాలు నాణ్యతతో ఉండేలా చూస్తామని, బెడ్‌షీట్స్‌ను రోజూ ఒక రంగులో ఉండేలా వారానికి ఏడు రంగుల్లో సరఫరా చేయాలని భావిస్తున్నామని మంత్రి తెలిపారు. దీని వల్ల రోగులకు శుభ్రమైన బెడ్‌శీట్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఎంఎస్‌ఐడిసి యాప్‌ను ఈ సందర్భంగా మంత్రి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు వైద్య శాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారి, కాళోజీ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్-్ఛన్సలర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్, హెల్త్ డైరెక్టర్ డాక్టర్ లలితాకుమారి, వైద్య విధాన పరిషత్ డైరెక్టర్ డాక్టర్ వీణాకుమారి, టిఎస్‌ఎంఐడిసి మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.