S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హరితహారంలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలి

హైదరాబాద్, జూలై 23: హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన లక్ష్యాలను అధిగమించేందుకు ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి. మహేందర్‌రెడ్డి తెలిపారు. జిల్లా పరిషత్ పరిషత్ సమావేశం మందిరంలో శనివారం హరితహారం కార్యక్రమంపై జిల్లాలోని శాసన సభ్యులు, జిల్లా అధికారులు, ప్రత్యేక అధికారులతో మంత్రి సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల వర్షాలు కురుస్తున్నందున హరితహారం కార్యక్రమాన్ని ఉద్ధృతం చేసి లక్ష్యాలను అధిగమించాని అన్నారు. జడ్పీ చైర్ పర్సన్ పి. సునితామహేందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో వికారాబాద్, తాండూరు, పరిగి ప్రాంతాల్లో ఎక్కువ మొక్కలను నాటడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ ఎం. రఘునందన్‌రావు మాట్లాడుతూ డ్వామా ద్వారా 41లక్షల మొక్కలు నాటాల్సిన లక్ష్యం కాగా వాతావరణం అనుకూలించకోవడం వల్ల లక్ష్యాలను అధిగమించలేకపోయారని, లక్ష్యాలను అధిగమించేత వరకు హరితహారాన్ని కొనసాగించాలన్నారు. ఈ సమావేశంలో మల్కాజిగిరి ఎంపి మల్లారెడ్డి, శాసన మండలి సభ్యులు నరేందర్‌రెడ్డి, శాసన సభ్యులు సంజీవరావు, సుధీర్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కాలె యాదయ్య, అరికెపూడి గాంధీ, వివేకానంద, జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి, వికారాబాద్ సబ్ కలెక్టర్ శృతిఓజా, రూరల్ ఎస్పీ నవీన్‌కుమార్, సైబరాబాద్ జాయింట్ కమిషనర్ శశిధర్, జిల్లా అధికారులు, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.