S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నాణ్యతతో పనులు చేపట్టండి

ఖమ్మం, జూలై 23: నాణ్యతతో పనులు చేపట్టి ప్రజలకు ఉపయోగపడేలా చూడాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం కూసుమంచి మండలంలోని గట్టుసింగారం గ్రామ శివారు బుర్హెన్‌పురంతండాలో 68లక్షల వ్యయంతో చేపట్టిన బిటి రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న కార్యక్రమాలను ప్రజల దరిచేర్చేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ మువ్వా విజయబాబు, ఎంపిడివో విద్యాలత, టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

8 లక్షల మంది అక్షరాస్యుల సాధనే లక్ష్యం
* రాష్ట్ర వయోజన విద్య డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి

కామేపల్లి, జూలై 23: సాక్షారభారత్ ఆధ్వర్యంలో రానున్న ఆగస్టు 2017లోగా ఎనిమిది లక్షల నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు లక్ష్యంగా చేసుకున్నట్లు రాష్ట్ర వయోజన విద్య డైరెక్టర్ జె సత్యనారాయణరెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని ఊట్కూరు గ్రామంలో ఆదర్శ లోక్‌శిక్షా కేంద్రాన్ని ఆయన అకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా శిక్షణా కేంద్రంలో రికార్డులు, గ్రామాల్లో చేపడుతున్న అక్షరాస్యత యొక్క కార్యక్రమాలు, శిక్షణా కేంద్రం నిర్వహణ తదితర రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2010నుండి ప్రారంభమైన సాక్షారభారత్ పథకం ద్వారా 40లక్షల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. 2017లోగా 68లక్షల మంది అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు లక్ష్యంగా ఎంచుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎనిమిది వేలు సాక్షారభారత్ కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీటిలో 62కేంద్రాలను ఆదర్శవంతమైన కేంద్రాలుగా ఎంపిక చేసి వివిధ పరికరాలు, పుస్తకాలు సరఫరా చేసినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యతలో వెనుకబడిపోయిన వారిని గుర్తించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దాల్సిందిగా విసిఓలను ఆదేశించారు. ప్రతి విసిఓ ఇంటింటా తిరుగుతూ నిరక్షరాస్యులుగా గుర్తించి వారికి ఎన్‌ఐఓఎస్ పరీక్షల ద్వారా అక్షరాస్యులుగా తీర్చిదిద్దాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. లక్ష్యాలను పూర్తి చేసేంత వరకు నిబద్ధతతో పని చేయాలని, పనిలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అన్నారు. అనంతరం స్థానిక ప్రాథమిక పాఠశాలలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. పాఠశాల మోడల్ సాక్షరభారత్ కేంద్రాల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప సంచాలకులు ఎన్‌సిహెచ్ వరదాచార్యులు, స్టేట్ రిసోర్స్ పర్సన్ బండి సాయన్న, జిల్లా వయోజన విద్యాధికారి ధన్‌రాజ్, అనిల్‌కుమార్, రాజేంద్రప్రసాద్‌తో పాటు స్థానిక ఎంపిడిఓ జివి రమణ, జడ్పీటిసి మల్లిబాబుయాదవ్, విసిఓలు ఖాజా, జగన్నాధం, సరోజిని, మహిళా సంఘ అధ్యక్షురాలు ఏపూరి లతాదేవి, సర్పంచ్ రామోజీనాయక్, ఖాజా తదితరులు పాల్గొన్నారు.

23 కెజిపి 4: పోడుసాగుదారులతో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర నాయకుడు నున్నా నాగేశ్వరరావు
పోడు సాగుదారులపై దాడులు చేస్తే సహించేది లేదు
* పోడు సాగుదారులకు అండగా ఉంటాం
* సిపిఎం రాష్ట్ర నేత నున్నా
కొత్తగూడెం రూరల్, జూలై 23: పోడు సాగుదారులపై అటవీ శాఖ అధికారులు దాడులు చేస్తే సహించేది లేదని సిపిఎం రాష్ట్ర నాయకుడు నున్నా నాగేశ్వరరావు అన్నారు. శనివారం మండల పరిధిలోని రేగళ్ల గ్రామ పంచాయతీ బావోజీతండా పోడు సాగుదారును ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమాయక గిరిజన, గిరిజనేతర పోడు సాగుదారులపై అటవీ శాఖ అధికారుల దాడులు దారుణమన్నారు. అటవీ శాఖ సిబ్బంది మహిళలపై దాడి చేయడం సరైంది కాదన్నారు. అమాయక గిరిజనుల నుండి వ్యవసాయ భూములు లాక్కొని కార్పొరేట్ సంస్థలకు ధారదత్తం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం మంచిది కాదన్నారు. దాడులు చేసి, భయబ్రాంతులకు గురి చేసి పోడు భూముల నుండి గిరిజనులు వేరు చేయలేరని, పోడు సాగుదారులకు సిపిఎం అండగా ఉంటుందన్నారు. నిర్బంధాలకు గురిచేస్తూ, రైతుల్ని జైళ్లకు పంపినంత మాత్రాన పోడు ఉద్యమం ఆగదని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోడు సాగుదారులపట్ల అవలంబిస్తున్న ధోరణి మార్చుకోవాలని, లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు.

23 కెఎంపి-21: పరుగు పరీక్ష నిర్వహిస్తున్న దృశ్యం

ఎస్పీ పర్యవేక్షణలో పోలీస్ రిక్రూట్‌మెంట్
ఖమ్మం(క్రైం), జూలై 23: తెలంగాణ రాష్టస్థ్రాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహిస్తున్న వివిధ భాగాల్లో పోలీస్ కానిస్టేబుళ్ళ శరీర దారుఢ్య పరీక్షలు ఖమ్మం పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఎస్పీ షానవాజ్‌ఖాసీం స్వీయ పర్యవేక్షణలో తొమ్మిదవ రోజు శనివారం 1200 మంది అభ్యర్థుల్లో 911 మంది హాజరయ్యారు. పురుష అభ్యర్థులకు 800మీటర్ల పరుగు పరీక్ష, 100 మీటర్ల పరుగు, షాట్‌పుట్, హైజంప్, లాంగ్‌జంప్ ఈవెంట్లను పూర్తి చేశారు. మహిళా అభ్యర్థులకు మాత్రం యథావిధిగా బయోమెట్రిక్, అభ్యర్థుల అధార్‌కార్డు, సర్ట్ఫికెట్ల వెరిఫికేషన్ చేసిన అనంతరం ఎత్తులో అర్హత సాధించిన వారిని వందమీటర్ల పరుగు, లాంగ్‌జంప్, షాట్‌పుట్ ఈవెంట్లను నిర్వహించారు. ఈ ఇవెంట్లలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ అశోక్‌కుమార్, డిఎస్పీలు రాంరెడ్డి, నరేందర్‌రావు, వీరేశ్వరరావు, సాయిశ్రీ, సురేష్‌కుమార్, ఏఆర్‌డిఎస్పీలు సంజీవ్, మాణిక్యరాజ్, ఫిజికల్ డైరెక్టర్లు, పిఇటిలు, వైద్యులు పాల్గొన్నారు.

తగ్గిన ఎరువుల ధరలు
* డిఎపి, ఎంఓపిలపై ప్రభుత్వం చొరవ

ఖమ్మం(మామిళ్ళగూడెం), జూలై 23: ఎట్టకేలకు ఎరువుల ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం డిఎపి, ఎంఓపి ఎరువులపై ధరలు తగ్గించడంతో రైతులపై కొంత మేర భారం తగ్గనున్నది. రైతులు పొలాల్లో ఉపయోగించే ప్రధాన ఎరువులైన డిఎపి, ఎంఓపిలపై ధరలు తగ్గడంతో రైతులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. డిఎపిపై ఒక కట్టకు 70 నుంచి 90 రూపాయల వరకు ధరలు తగ్గాయి. ఎరువులపై తగ్గిన ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.

కంపెనీ పేరు ఎరువుపేరు పాత ధర కొత్త ధర

ప్రతి మొక్కను సంరక్షించాలి
చింతకాని, జూలై 23: నాటిన ప్రతి మొక్కను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఓక్కరు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ సూచించారు. శనివారం మండల పరిధిలోని కొదుమూరు, వందనం గ్రామాలలో జరిగిన హరితహరం కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అధితిగా హాజరయ్యారు. ఆయా గ్రామాలలో హరితహర కార్యక్రమంలో నాటిన మొక్కలును పరిశీలించారు.
కొదుమూరులో మసీదు, వందనంలో చెరువు కట్టపై మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్కను సంరక్షించి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలన్నారు. హరిత తెలంగాణ సాధనలో బాగస్వాములు కావాలని తెలిపారు. హరితహర కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలును అభినందించారు. పచ్చ్ధనం ప్రగతికి సోపానమని తెలిపారు. అనంతరం మండలంలో జరిగిన హరితహర కార్యక్రమ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాటిన మొక్కలు పరిశీలించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యుటి కమిషనర్, సర్పంచలు ఆవుల నాగేశ్వరావు, రాచబంటి శైలజ, యంపిపి దాసరి సామ్రాజ్యం, తహశీల్దార్ శ్రీనివాసరావు, ఎంపిడివో నవాబ్ పాషా, ఎవో అనిల్‌కుమార్, ఎస్సై ప్రసాద్, వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు.

మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడండి
ఖమ్మం(ఖిల్లా), జూలై 23: మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడి బావితరాలకు కాలుష్యరహిత సమాజాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ పాపాలాల్‌లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో భాగంగా నగరంలో శనివారం వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటారు. 22వ డివిజన్‌లో చైతన్యనగర్, 16వ డివిజన్ సెయింట్ మేరీస్ పాఠశాల, 35వ డివిజన్ మామిళ్ళగూడెం తదితర ప్రాంతాల్లో స్థానిక ప్రజలు, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం పచ్చగా ఉండి కాలుష్య రహిత సమాజం అందించేందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బత్తుల మురళీప్రసాద్, కమిషనర్ బొనగిరి శ్రీనివాస్, ఎంఇ, డిఇలు, సిబ్బంది ఆయా పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులు కార్పొరేటర్లు పాల్గొన్నారు.
హరితహారం ద్వారానే పచ్చదనం
ఖానాపురం హవేలి : ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో పచ్చని వాతావరణం ఏర్పడుతుందని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. శనివారం రఘునాథపాలెం మండలంలోని కోయచలక గ్రామంలో హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బృహత్తరమైన పథకాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం ద్వారా భవిష్యత్తులో చెట్లుగా పెరిగి పెద్దగా ఏర్పడతాయన్నారు. దాని ద్వారా భవిష్యత్తులో వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశం ఉంటుందన్నారు. తొలుత ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో హరితహారంపై ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపిడివో చంద్రశేఖర్, ఏవో అరుణ, ఉపాధి హామీ ఏపివో అమ్మాజాన్, ఇవోపిఆర్‌డి నజ్మా, కార్యదర్శి పవన్ తదితరులు పాల్గొన్నారు.
మొక్కలను సంరక్షించండి
ఖానాపురం హవేలి, జూలై 23: నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ దివ్య అన్నారు. శనివారం ఖమ్మం అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెట్లు తగ్గిపోవటం వాతావరణంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. రైతులు తమ పంట పొలాలపై కూడా వేసుకునేందుకు మొక్కలు అందిస్తున్నామన్నారు. పండ్ల మొక్కలను ఆశించే రైతులకు కూడా ఆ మొక్కలను పంపిణీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తమకు సమీపంలో ఉన్న మొక్కలను తీసుకొని నాటుకోవాలని సూచించారు. ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో అధికారుల భాగస్వామ్యం చేసిందని, అందుకు అనుగుణంగా అధికారులంతా పనిచేసి పచ్చని వాతావరణాన్ని నెలకొల్పేందుకు కృషి చేయాలన్నారు. నాటిన మొక్కలను సంరక్షించాలని ఈ విషయంలో ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వెంకారెడ్డి, డిటి శ్రీనివాస్, ఆర్‌ఐలు వహీద్, రామకృష్ణ, విఆర్వోలు గరికే ఉపేందర్, బాలయ్య, అప్పారావు, కార్యాలయ సిబ్బంది ప్రసాద్, నరేష్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

ఆత్మా చైర్మన్‌గా మెంటెం

ఖమ్మం(మామిళ్ళగూడెం), జూలై 23: ఆత్మ జిల్లా చైర్మన్‌గా మెంటెం రామారావుకు ఎన్నికయ్యారు. శనివారం కార్యాలయంలో చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ సాంకేతిక వ్యవసాయ విధానాన్ని రైతుల దరిచేర్చేందుకు మరింత కృషి చేస్తానన్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన తనకు రైతాంగ సమస్యలు తెలుసని, ఆ దిశగా వారి సమస్యలను పరిష్కరించి రైతులకు నూతన పద్దతులపై సూచనలు చేస్తానన్నారు. ఇదిలావుండగా ఆత్మకమిటీ చైర్మన్‌గా ఎన్నికైన మెంటెం రామారావును ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఆత్మ కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన రామారావును జడ్పీటిసి ఈరునాయక్, ఎంపిపి శాంత, టిఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు మద్దినేని వెంకటరమణ, నాయకులు నున్నా శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేసి అభినందించారు.
ఘనంగా చంద్రశేఖర్ ఆజాద్ 110వ జయంతి

ఖమ్మం(జమ్మిబండ), జూలై 23: చంద్రశేఖర్ ఆజాద్ 110వ జయంతి ఉత్సవాలను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబివిపి) ఆధ్వర్యంలో శనివారం నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సంఘం కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ చంద్రశేఖర్ ఆజాద్ 25ఏళ్ళ ప్రాయంలోనే దేశ స్వతంత్రం కోసం బలిదానం అయిన గొప్ప దేశ భక్తుడని కొనియాడారు. భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్ అనుచరుడుగా పోరాటాలు నిర్వహించారని అన్నారు. బ్రిటీషు పోలీసు తూటాలకు చనిపోవడం ఇష్టంలేక ఆజాద్ తనకు తానే కాల్చుకున్న భరతమాత ముద్దుబిడ్ట అని స్మరించారు. ఆజాద్ ఆశయాలను, స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని నేటి యువత దేశంకోసం పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోపి, అశోక్, పృద్వీ, సృజన, కీర్తి, వంశీ, జనార్థన్, సాయి, రాజేష్, గణేష్ పాల్గొన్నారు.
రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి
ఏన్కూరు, జూలై 23: అదికారులు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా స్థానిక కస్తూరిబా పాఠశాలలో శనివారం మొక్కలు నాటారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. మొదట అన్ని శాఖల అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. సమావేశానికి హాజరు కాని గృహ నిర్మాణ శాఖ, విద్యుత్ శాఖ, ఐకెపి, ఆరోగ్య శాఖలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు గ్రూపు రాజకీయాలు చేయకుండా ప్రజలకు అంకితమై పనిచేయాలన్నారు. గైర్హాజరైన అధికారులపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. హరితహారం ప్రకియ విజయవంతానికి కృషి చేయాలని కోరారు.