S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రభుత్వ అవసరాలకు అటవీ భూమి

నూజివీడు, జూలై 23: నూతన రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ప్రభుత్వ అవసరాలకు నూజివీడు ప్రాంతంలో అటవీ భూములు సమృద్దిగా ఉన్నాయని జిల్లా అటవీ అధికారి పిజె బెనర్జీ తెలిపారు. నూజివీడుతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలలో 5,900 హెక్టార్ల అటవీ భూమిని గుర్తించి, ప్రభుత్వానికి పంపామని ఆయన వివరించారు. శనివారం స్థానిక అటవీశాఖ కార్యాలయాన్ని సందర్శించారు. వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నూజివీడులో పర్యటిస్తున్న దృష్ట్యా సంబంధిత పనులపై అధికారులతో సమీక్ష జరిపారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రభుత్వ అవసరాలకు అటవీ భూమిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా లోని వివిధ ప్రాంతాలలో ఉన్న అటవీ భూమిని గుర్తించామని తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 5,900 హెక్టార్ల భూమిని గుర్తించామని, నూజివీడు ప్రాంతంలో 1,800 హెక్టార్ల భూమిని గుర్తించామని ఆయన వివరించారు. సుంకొల్లు, సిద్ధార్ధనగర్, నర్సుపేట, కాట్రేనిపాడు, అన్నవరం, రేగుంట తదితర గ్రామాల పరిధిలో ఉన్న అటవీ భూములను డీనోటిఫై చేయాలని కోరుతూ కేంద్రానికి పంపామని డిఎఫ్‌ఒ బెనర్జీ తెలిపారు. డీనోటిఫై చేసే ప్రాంతాలలో అడవులు పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నూజివీడు ప్రాంతంలో ఎక్కువ శాతం అటవీ భూముల్లో మొక్కలు పెంచాల్సిన అవసరం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకుని అడవులు పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను పురస్కరించుకుని అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో అటవీ అధికారి శ్రీరామారావు తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా శ్రీ సీతారామ యతీంద్రుల
జన్మదినోత్సవ వేడుకలు
కూచిపూడి, జూలై 23: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం శ్రీకృష్ణాశ్రమ వ్యవస్థాపకులు, ముముక్షుజన మహాపీఠం వ్యవస్థాపకులు శ్రీ సీతారామ యతీంద్రుల 110వ జన్మదినోత్సవాన్ని శనివారం ముముక్షుజన మహాపీఠాధిపతులు శ్రీ ముత్తీవి సీతారాం గురుదేవులు పర్యవేక్షణలో వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆశ్రమంలోని శ్రీ సీతారామ యతీంద్రుల దివ్యమూర్తులకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆశ్రమంలోని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ అభయ వీరాంజనేయ స్వామివారికి వడమాలలు సమర్పించారు. శ్రీ సీతారామ యతీంద్రుల అభిషేకానికి భక్తులు బారులుతీరారు. ముత్తీవి గౌరాకృష్ణ పర్యవేక్షణలో ఆశ్రమ సన్నిధి కార్యదర్శి తుర్లపాటి రాధాకృష్ణ, ఆత్మకూరి లక్ష్మణదాసు, తుర్లపాటి ఆనంద్ పర్యవేక్షణలో యతీంద్ర సేవా సమితి సభ్యులు భక్తులకు అన్నసమారాధన చేశారు. భక్తులనుద్దేశించి గురుదేవులు అనుగ్రహ భాషణ చేశారు.