S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సమన్వయంతో వ్యవహరించండి

గుంటూరు, జూలై 23: కార్యకర్తలు.. నాయకులు.. ఎమ్మెల్యేలు.. నియోజకవర్గాల్లో సమన్వయంతో వ్యవహరిస్తేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని, ప్రతిపక్షాల ఆరోపణలకు ఊతమిచ్చే విధంగా కాకుండా సమిష్టిగా వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేయాలని డెప్యూటీ సిఎం నిమ్మకాయల చినరాజప్ప పార్టీ శ్రేణులకు హితవు పలికారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయా, లేవా అనేది కార్యకర్తలు పరిశీలించాలని, పథకాల గురించి ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో పెదకూరపాడు, సత్తెనపల్లి, నరసరావుపేట తదితర నియోజకవర్గాలకు సంబంధించి సమన్వయ కమిటీ సమావేశాలు జిల్లా పార్టీ అధ్యక్షుడు జివి ఆంజనేయులు అధ్యక్షతన జరిగాయి. ఆయా సమావేశాల్లో మార్కెట్‌యార్డు డైరెక్టర్లు, ఇతర నామినేటెడ్ పదవుల విషయం ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా చినరాజప్ప స్పందిస్తూ అందరికీ పదవులు సాధ్యం కాదని, పార్టీకి కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని స్పష్టంచేశారు. పదవుల కోసమే పార్టీలో కొనసాగాలనే నిర్ణయం మంచిది కాదన్నారు. శ్రీశైలం నుండి పులిచింతల వరకు కృష్ణానదిలో నీరు లేకపోయినా గోదావరి జలాలను కృష్ణాడెల్టాకు అందించి పంటలను కాపాడిన ఘనత సిఎంకే దక్కుతుందన్నారు. చివరకు గుంటూరు కార్పొరేషన్‌కు కూడా మంచినీరు లేని పరిస్థితుల్లో సిఎం తీసుకున్న చొరవతో నీటి సమస్య తొలగిందన్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని నాణ్యత ప్రమాణాలతో అవినీతికి ఆస్కారం లేనివిధంగా అత్యంత వేగంగా నిర్మించుకునే స్విస్ ఛాలెంజ్ విధానాన్ని ప్రభుత్వం ఆమోదించిందన్నారు. అవినీతిలో కూరుకుపోయి 13 కేసుల్లో ఎ-1 ముద్దాయిగా ఉన్న వైఎస్ జగన్ స్విస్ ఛాలెంజ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ అవినీతి ఆరోపణలు చేయడాన్ని రాష్ట్ర ప్రజలు చీదరించుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి నదుల అనుసంధానంతో పాటు ఈనెల 29వ తేదీన రాష్ట్రంలో కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. జిల్లాలో దీనిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సాంఘిక సంక్షేమశాఖ కింద ఉన్న హాస్టళ్లను, స్కూళ్లను ఎత్తివేస్తున్నారని, ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న దుష్ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఒక్క పేద విద్యార్థికి కూడా అన్యాయం జరగదని స్పష్టంచేశారు. పట్టిసీమ పూర్తికావడానికి 47 కిలోమీటర్ల మేర కాల్వలు తవ్వడానికి ప్రభుత్వానికి సహకరించిన రైతులకు సమావేశం ధన్యవాదాలు, చంద్రబాబు చైనా పర్యటనకు వెళ్లి 58 వేల కోట్ల రూపాయలు ఎపిలో పెట్టుబడులు పెట్టడానికి అంగీకార ఒప్పందాలు కుదుర్చుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసింది. ఈ సమావేశంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, కొమ్మాలపాటి శ్రీ్ధర్, ఎమ్మెల్సీలు అనగాని సత్యప్రసాద్, ఫిలిప్స్, ఎఎస్ రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీలు రాయపాటి శ్రీనివాస్, గాదె వెంకటరెడ్డి, రాష్ట్ర వికలాంగుల సంస్థ కమిటీ చైర్మన్ జివి కోటేశ్వరరావు, ఆస్కాబ్ చైర్మన్ మురుగుడు హనుమంతరావు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు గంజి చిరంజీవి, కొమ్మారెడ్డి చలమారెడ్డి, డాక్టర్ కోడెల శివరామ్, పార్టీ నాయకులు జెఆర్ పుష్పరాజ్, మాకినేని పెదరత్తయ్య, శనక్కాయల అరుణ, చందు సాంబశివరావు, గుంటుపల్లి నాగేశ్వరరావు, ఎస్‌ఎం జియావుద్దీన్, జివి కోటేశ్వరరావు, ముమ్మనేని వెంకట సుబ్బయ్య, ఇక్కుర్తి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
లేబర్ సెస్ చెల్లింపుల్లో
రూ.12.54 లక్షల మేర అవకతవకలు
గుంటూరు (కార్పొరేషన్), జూలై 23: గుంటూరు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగంలో లేబర్ సెస్ చెల్లింపులో పెద్దఎత్తున అవినీతి జరిగిందనే దుమారానికి తెరపడింది. లేబర్ సెస్‌ను చెల్లించడంలో అవినీతి జరిగిన మాట వాస్తవమేనని ప్రత్యేకంగా నియమించిన ఎంక్వయిరీ కమిటీ నిర్ధారించింది. సుమారు రూ.12.54 లక్షలు దారి మళ్లినట్లు స్టేట్ ఆడిట్ శనివారం తన రిపోర్టులో పేర్కొంది. బాధ్యులు ఎంతటివారైనా ఊపేక్షించేది లేదని, వారి నుండి నయా పైసాతో సహా వసూలు చేస్తామని కమిషనర్ నాగలక్ష్మి తెలిపారు. లేబర్ సెస్ చెల్లింపులో జరిగిన అవకతవకల వివరాల్లోకి వస్తే.. భవన అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న అర్జీదారుడు భవన నిర్మాణ అంచనావిలువలో ఒక్క శాతం లేబర్ సెస్ కింద నగదు చెల్లించాలి. ఈ చెల్లింపు వ్యవహారంలో భవన నిర్మాణదారులతో కొందరు పట్టణప్రణాళిక విభాగం అధికారులు కుమ్మకై లేబర్ సెస్ చెల్లింపునకు సంబంధించి నకిలీ చలానాలు జమచేసి భవన నిర్మాణాలకు అనుమతినిచ్చారు. ఈ అవినీతి వ్యవహారం గుట్టు రట్టుకావడంతో కమిషనర్ నాగలక్ష్మి స్పందించి స్టేట్ ఆడిట్, లేబర్ డిపార్టుమెంట్, పట్టణప్రణాళిక అధికారులతో ఎంక్వయిరీ కమిటీని ఏర్పాటుచేసి తనిఖీలు నిర్వహించారు. ఆడిట్ నిమిత్తం వచ్చిన స్టేట్ ఆడిట్ విభాగం వారు చలానాలకు సంబంధించి రీజనల్ ఆడిట్ అధికారి వారు బిల్డింగ్ అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, లేబర్ సెస్ చలానాలు చెల్లించే ఆంధ్రాబ్యాంకు డిజిఎంతో చర్చించి ఓరిజినల్ చలానాల ప్రకారం 2014-15 సంవత్సరానికి గాను సుమారు 2 వేల దరఖాస్తులలో అందుబాటులో ఉన్న 1500 దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించారు. 12 బిల్డింగ్ అర్జీలకు సంబంధించిన అర్జీలకు నకిలీ చలానాలు జమ చేయడం వల్ల రూ.6,28,314 లు, అలాగే 26 అర్జీలకు చెల్లించాల్సిన లేబర్ సెస్ కంటే తక్కువ రుసుము చెల్లించడం వల్ల రూ. 6,25,025లు మేర అవకతవకలు జరిగినట్లు స్టేట్ ఆడిట్ వారు సీల్డ్ కవర్‌లో తమ నివేదికలను కమిషనర్‌కు తెలియజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ నాగలక్ష్మి మాట్లాడుతూ 2014-15 సంవత్సరంలో బిల్డింగ్ ప్లాన్ అర్జీ చెల్లింపుల్లో మొత్తం 12.54 లక్షల అవినీతి జరిగినట్లు స్టేట్ అడిట్ తెలిపిందన్నారు. దీనికి సంబంధించిన సొమ్మును బాధ్యుల నుండి రికవరీ చేస్తామని, భవనాలు తనఖా, విడుదల సమయంలో, ఆస్తి పన్ను మదింపు, నీటి కుళాయి మంజూరు సమయంలో, ఆక్యుపెన్సీ సమయంలోగాని సదరు మొత్తాన్ని వసూలు చేస్తామన్నారు. బాధ్యులు ఎంతటివారైనా ఊపేక్షించేది లేదని శాఖాపరమైన చర్యలు తప్పవని, నిర్మాణదారుల లైసెన్సులు రద్దుతోపాటు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆన్‌లైన్ బిల్డింగ్ దరఖాస్తుల ప్రక్రియను చేపట్టినట్లు తెలియజేశారు.
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు
గుంటూరు (కొత్తపేట), జూలై 23: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ సిపిఐ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా శనివారం జిల్లా సమితి ఆధ్వర్యాన నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి, హోదాను అడ్డుకుంటున్న బిజెపి ప్రభుత్వం ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ నినాదాలతో హోరెత్తించారు. వందలాది మంది కార్యకర్తలతో శంకర్‌విలాస్ నుండి ప్రారంభమైన ర్యాలీ లాడ్జిసెంటర్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుడు కెవిపి రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై ఓటింగ్‌ను తప్పించేందుకు సభను జరగనీయకుండా బిజెపి కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. టిడిపి, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఇతర రాజకీయ పార్టీలన్నీ ఒకతాటిపైకి రావడంతో సభ జరగకుండా వాయిదా వేయడం అనైతిక చర్య అన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడటం ఎపి అభివృద్ధికి అడ్డంకులు సృష్టించడమేనన్నారు. 5 కోట్ల మంది ఆంధ్రా ప్రజలను బిజెపి మోసగించిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని బిజెపి నాయకులు వెంకయ్యనాయుడు, హరిబాబు రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చే నెల 5వ తేదీ తిరిగి రాజ్యసభకు వచ్చే ప్రైవేటు బిల్లు పాస్ కావడానికి చంద్రబాబు తన వంతు కృషిచేయాలని సూచించారు. సిపిఐ అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన సంఘాలను కలుపుకుని ఆగస్టు 4,5 తేదీల్లో విద్యాసంస్థల బంద్‌కు పిలుపునివ్వాలన్నారు. సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ మాటల మాంత్రికుడు వెంకయ్యనాయుడు నేడు ముఖం చాటేయడం రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనన్నారు. కార్యక్రమంలో సిపిఐ, విద్యార్థి సంఘాల నాయకులు జి సురేష్, నూతలపాటి చిన్న, అమీర్‌వలి, కుమార్‌నాయక్, గుమ్మా పాపారావు, పిచ్చయ్య, అరుణ్‌కుమార్, రాగం అలివేలు మంగమ్మ, వేమూరి సుబ్బారావు, చేపర్తి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
క్రీడాపాఠశాలకు ఎంపికలు
గుంటూరు (స్పోర్ట్స్), జూలై 23: జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా స్థానిక బిఆర్ స్టేడియం, పోలీసు పెరెడ్‌గ్రౌండ్స్‌లో జరుగుతున్న క్రీడాపాఠశాల ఎంపికలు ముగిశాయి. తొలుత ప్రారంభ కార్యక్రమానికి శాప్ పాలకమండలి సభ్యురాలు సత్తి గీత, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి రామకృష్ణలు విచ్చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4వ తరగతి ప్రవేశానికి జరుగుతున్న ఈ పోటీలకు వివిధ పాఠశాలల నుండి 89 మంది బాల బాలికలు పాల్గొన్నారన్నారు. వీరిలో ప్రతిభ కనబర్చిన వారిని ఈనెల 27న తేదీన కడపలో జరగనున్న రాష్ట్ర పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో క్రీడాప్రాధికార సంస్థ శిక్షకులు పాండురంగారావు, సురేష్, రాజేష్, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు మైనేని నాగేశ్వరరావు, బి శ్రీనివాసరావు, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
పిలిచి ఉద్యోగాలిచ్చిన్న ఘనత టీడీపీదే..
* గణపవరంలో జాబ్ మేళా ముగింపు సభలో హోం మంత్రి చిన్నరాజప్ప
నాదెండ్ల, జూలై 23: నిరుద్యోగులను గుర్తించి ఉద్యోగాలను ఇచ్చిన ఘనత టీడీపీకే దక్కుతుందని రాష్ట్ర హోమ్‌శాఖామంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప అన్నారు. మండలంలోని గణపవరం గ్రామంలొ చుండి రంగనాయకుల కళాశాల నందు రెండు రోజులుగా నిర్వహిస్తున్న జాబ్ మేళా శనివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి హోం మంత్రి చిన్నరాజప్ప ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 1994లో చంద్రబాబు సిఎం గా ఉన్నప్పుడు హైటెక్ సిటికి శ్రీకారం చుట్టారన్నారు. అప్పట్లో హైదరాబాద్ నగంలో 720 ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేసిన ఘనత టీడీపీకే దక్కిందని గుర్తుచేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను బాబు వస్తే జాబు వస్తుందనే మాట నిలబెట్టుకున్నారన్నారు. ఈ జాబ్ మేళాలో మొత్తం 14000 మంది హాజరు కాగా వారిలో 2247 మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. రాజమండ్రి ఎమ్మేల్యే బుచ్చ య్య చౌదరి మాట్లాడుతూ ఇలాంటి జాబ్ మేళాల వల్ల ఎంతో మంది నిరుద్యొగులకు జీవనభృతి కలుగుతుందన్నారు. 54 కంపెనీలను ఓకే వేదికపైకి తీసుకొచ్చి ఇలాంటి మహత్తర కార్యక్రమాన్ని నిర్వహించినందుకు స్వర్ణాంద్ర ఫౌండేషన్, వికాస్ ఫౌండేషన్‌ను అభినందించారు. ప్రస్తుత తరుణంలో స్కిల్ డెవలప్‌మెంట్ పెంచుకోవాలన్నారు. అనంతరం గూగుల్ విభాగంలో 35 మంది, బిగ్‌సిలో 95, ఫ్లిప్‌కార్ట్‌లో 111 మంది, జి4లో 175, క్విక్కర్‌లో 155 మంది విద్యార్దులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి పత్తిపాటి పుల్లారావు, వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, చిలకలూరిపేట చైర్‌పర్సన్ జి.చెంచుకుమారి, ఆర్డీవొ రవీంద్రబాబు, తేళ్ళ సుబ్బారావు, చుండి రంగనాయకుల కళాశాల డైరక్టర్ చుండి సారధి, హెచ్‌ఆర్ మేనేజర్లు పాల్గొన్నారు.
బిజెపి, టిడిపి మోసపూరిత వైఖరిని ప్రతిఘటించండి
మంగళగిరి, జూలై 23: రాష్ట్రానికి ప్రత్యేక హోదా వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పిన బిజెపి, టిడిపిల మోసపూరిత వైఖరిని ప్రతిఘటించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదాకోసం రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపి కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లు విషయంలో బిజెపి, టిడిపిల అసలురంగు బట్టబయలయిందని, దానికి నిరసనగా సిపిఐ ఆధ్వర్యాన శనివారం పట్టణంలో కళ్లకు గంతలు కట్టుకుని సిపిఐ కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ప్రదర్శన జరిపి అక్కడ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అజయ్‌కుమార్ మాట్లాడారు. ఎన్నికల సమయంలో తిరుపతి సభలో నరేంద్రమోదీ చేసిన ప్రసంగం అమలు కాలేదని, బిజెపి వైఖరి ఏరుదాటాక తెప్పతగలేసిన చందంగా ఉందని ఆయన విమర్శించారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు పిల్లలమర్రి నాగేశ్వరరావు, చిన్ని తిరుపతయ్య, జాలాది జాన్‌బాబు, కాశయ్య, కాబోతు ఈశ్వరరావు, సుహాస్, తదితరులు పాల్గొన్నారు.
ఔషధ పరిశోధనల్లో యువత ముందుండాలి
తాడికొండ, జూలై 23: ఔషధ పరిశోధనల్లో యువత ముందుండాలని మాజీ డ్రగ్స్ కంట్రోల్ అడ్మిషన్ డైరెక్టర్ సిహెచ్ సుబ్బారావు అన్నారు. శనివారం మండల పరిధిలోని లాం ఫార్మసీ కళాశాలను ఆయన సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా నాణ్యమైన ఫార్మసీ విద్యనందించడానికి, ఔషధ పరిశోధనలు మరింత ఉద్ధృతంచేసి క్రొత్త ఔషధాలు కనిపెట్టాలని విద్యార్థులకు సూచనలు చేశారు. ఫార్మసీ కళాశాలలు ఉన్నత ప్రమాణాలు పాటించాలన్నారు. ఔషధ పరిశోధనల్లో రాష్ట్ర యువత ముందుండాలన్నారు. అనంతరం అతిథి సుబ్బారావును కళాశాల యాజమాన్యం జ్ఞాపికతో సత్కరించారు. ఈకార్యక్రమంలో చలపతి విద్యాసంస్థల అధినేత వైవి ఆంజనేయులు, ప్రిన్సిపాల్ నాదెండ్ల రామారావు, కళాశాల డైరెక్టర్ వినయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బాబు ఇంట్లో వివిఐపి పుష్కరఘాట్ ఆక్షేపణీయం: ఆర్కే
మంగళగిరి, జూలై 23: కృష్ణానది కరకట్ట వెంబడి ఉండవల్లి పరిధిలో ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న ఇంటివద్ద కోటి రూపాయలు వెచ్చించి వివిఐపి ఘాట్ నిర్మించడం తీవ్ర ఆక్షేపణీయమని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటి వద్ద నిర్మిస్తున్న పుష్కరఘాట్ పనులను పరిశీలించేందుకు ఎమ్మెల్యే ఆర్కే వెళ్లగా సెక్యూరిటీ సిబ్బంది ఆయనను అనుమతించలేదు. దీంతో కృష్ణాతీరం వెంబడి నడుచుకుంటూ సమీపంలో ఉన్న ఒక ఆశ్రమం వద్దకు వెళ్లి ఘాట్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్కే మాట్లాడుతూ బాబు ఇంట్లో ఏర్పాటు చేసే ఘాట్ వివిఐపిల కోసమా, ఆయన కుటుంబ సభ్యుల కోసమా అని ప్రశ్నించారు. కోటి రూపాయలు వెచ్చించి ఘాట్ నిర్మిస్తున్నారని, అదే ఘాట్ వేరే ప్రాంతంలో నిర్మిస్తే అన్ని వర్గాలకు చెందిన వివిఐపిలు పుణ్య స్నానాలు ఆచరించేందుకు ఆస్కారం ఉంటుందని, చంద్రబాబు తన సొంత మనుషుల కోసమే ఈ ఘాట్ నిర్మించుకుంటున్నారని, పుష్కరాల్లో భద్రతా సిబ్బంది ఆయన ఇంటిదగ్గర కాపలా కాయాలా, ప్రజల రక్షణకోసం సీతానగరం పుష్కర ఘాట్‌ల వద్ద భద్రతా ఏర్పాట్లు చేయాలా అని ఆర్కే ప్రశ్నించారు. చంద్రబాబు నివాసం కరకట్ట వెంట ఉండటం వలన ఆ మార్గంలో రాకపోకలు సాగించే సామాన్య ప్రజానీకానికి ఇబ్బందిగా మారిందని, గన్నవరం విమానాశ్రయం నుంచి వివిఐలు ఉండవల్లి చేరుకోవాలంటే పుష్కరాలకు వచ్చే భక్తులు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటారో పరిశీలించాలని, ప్రజాధనమే కదాని ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయడం తగదన్నారు. ఘాట్ నిర్మాణానికి 15 మంది అధికారులను నియమించారని, కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించే ఘాట్‌ల వద్ద మాత్రం ఒక్క అధికారి కూడా కన్పించడం లేదని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. పుష్కర ఘాట్‌ల నిర్మాణం అవినీతిమయమని, చంద్రబాబు ఇంటివద్ద నిర్మించే ఘాట్ మాదిరిగా ఇతర ఘాట్‌లలో నాణ్యత లేదని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు.
డ్రీమ్ స్టెప్ యాప్ ద్వారా మెరుగైన సేవలు : ఆర్‌ఎం శ్రీహరి
గుంటూరు (కొత్తపేట), జూలై 23: రీజియన్ పరిధిలోని దూర ప్రాంతాలకు వెళ్లే సర్వీసుల వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా డ్రీప్ స్టెప్ యాప్ ఎంతగానో ఉపకరిస్తుందని ఆర్టీసీ ఆర్‌ఎం జ్ఞానంగారి శ్రీహరి తెలిపారు. శనివారం ఎన్‌టిఆర్ బస్‌స్టేషన్‌లోని తిక్కన కాన్ఫరెన్స్ హాలులో అన్ని డిపోల మేనేజర్లు, ట్రాఫిక్ సూపర్‌వైజర్లు, సిస్టమ్ ఇన్‌చార్జిలకు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్‌ఎం మాట్లాడుతూ ఈ యాప్ ద్వారా ఆన్‌లైన్ టిక్కెట్లు పొందవచ్చని, వారు ప్రయాణం చేసే బస్సు సర్వీసు నెంబర్ ద్వారా ఆ బస్సు బస్టాండ్‌కు ఎంత దూరంలో ఉంది, ఎంత సేపటిలో వస్తుంది అనే సమయాన్ని కూడా తెలుసుకోవచ్చన్నారు. మార్గమధ్యలో బస్సు మరమ్మతులకు గురికావడం, ప్రమాదానికి గురైనా, ప్రయాణికులకు ఏమైనా ఇబ్బందులు తలెత్తిన సమయంలో యాప్‌కు క్లిక్ చేస్తే కంట్రోల్‌కు సమాచారం అందుతుందన్నారు. కంట్రోల్ రూమ్ అధికారులు సంబంధింత డిపో అధికారులకు ఫోన్‌చేసి సమాచారం అందిస్తారన్నారు. ఈ యాప్ పని విధానంపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో నరసరావుపేట డెప్యూటీ సిటిఎం వెంకటేశ్వరరావు, గుంటూరు డెప్యూటీ సిఎంఇలు శరత్‌బాబు, డిపో మేనేజర్ సుబ్బారావు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
నెలాఖరు నాటికి రోడ్లు పూర్తిచేస్తాం
అచ్చంపేట, జూలై 23: కృష్ణా పుష్కరాల సందర్భంగా మండలంలో ఘాట్లకు అనుసంధానం చేస్తూ వేస్తున్న రోడ్లన్నింటినీ ఈ నెలాఖరు నాటికి పూర్తిచేసే లక్ష్యంతో పనిచేస్తున్నామని, విజిలెన్స్ క్వాలిటీ కంట్రోల్ అధికారి ఎస్ వీరయ్యచౌదరి అన్నారు. పుష్కరాల సందర్భంగా స్నానఘాట్లకు వెళ్లే రహదారులను పరిశీలించారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ రోడ్లనిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నామన్నారు. మండల పరిధిలో ఉన్న నందులరేవు, మాదిపా డు, చింతపల్లి, తాడువాయి, చామర్రు, కోనూరు, కస్తల గ్రామాల్లో వేస్తున్న రోడ్లను పరిశీలించారు. ఆయన వెంట జెఇలు రమేష్, డిహెచ్‌యు రమణారావు తదితరులున్నారు.