S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హైదరాబాద్‌లో భవనం కూలి ముగ్గురు మృతి

హైదరాబాద్: నగరంలోని ఫిలిం నగర్‌లో నిర్మాణంలో ఉన్న భవనం ఆదివారం కుప్పకూలడంతో ముగ్గురు కూలీలు మరణించగా ఏడుగురు గాయపడ్డారు. ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ వద్ద సుమారు రెండు నెలలుగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. పది పిల్లర్లు కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలిసిన వెంటనే జిహెచ్‌ఎంసి, అగ్నిమాపక సిబ్బంది శిథిలాలను తొలగిస్తూ సహాయక చర్యలను ప్రారంభించారు. శిథాలాల నుంచి మూడు మృతదేహాలను వెలికితీశారు. 16 మంది కూలీలు భవన నిర్మాణం పనుల్లో పాల్గొంటున్నారని తెలిసింది. ఘటనా స్థలాన్ని నగర మేయర్ బొంతు రామ్మోహన్ సందర్శించి, సహాయ కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలని జిహెచ్‌ఎంసి అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.