రైలులో బాలికను వేధించిన బిజెపి ఎమ్మెల్సీ అరెస్టు
Published Sunday, 24 July 2016పాట్నా: హౌరా- గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన బిజెపి ఎమ్మెల్సీ తున్నాజీ పాండేను పోలీసులు అరెస్టు చేశారు. దురగ్పూర్ వద్ద రైలులో ఎక్కిన పాండే ఆదివారం తెల్లవారు జామున అదే కోచ్‌లో ప్రయాణిస్తున్న బాలిక వద్దకు వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆ బాలిక కేకలు వేయగా ఆమె తల్లిదండ్రులు వచ్చి పాండేను నిలదీశారు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాండేను వారు అరెస్టు చేసి హాజిపూర్ పోలీసులకు అప్పగించారు. మద్యం మత్తులో ఉన్న పాండే బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ప్రయాణికులు చెబుతున్నారు.