S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నేర్చుకుందాం

క. పొడవునఁ బ్రాయంబునఁ గడుఁ
గడిఁది బలంబునను జూడఁగా నసదృశునీ
కొడుకని రుూతని నెంతయు
నెడమ డగుగఁ జూపఁ దెత్తె యిందఱు నగఁగన్
భావం: చూడంగానే ఎత్తు చేత, వయస్సు చేత, అధికమైన బలం చేత సాటిలేనివాడుగా కనపడుతున్న ఇతడిని ‘నీకొడుక’ అని ఎంతో విరుద్ధంగా అందరూ నవ్వేటట్లు నాకు చూపటానికి తీసికొని వచ్చావా? అని లోక వస్తావ వ్యతిరేకాంశాలను మేము అంగీకరించం. తగని మాటలు పలుకక నీవు ఆశ్రమానికి తిరిగి పొమ్ము. అని దుష్యంతుడు శకుంతలతో కఠినముగా పలికాడు. అపుడు శకుంతల మిగుల మనసులో దుఃఖించి అధికమైన సంతాపాన్ని పొందింది. దుష్యంతుడు తనకు ఎన్నోవిధాల నచ్చచెప్పి గాంధర్వవిధి పెళ్లి చేసుకొని కుమారుడికి తల్లిని చేసి ఇపుడు నలుగురిలో అవమానం పాలునయ్యేట్లుగా మాట్లాడడం చూచి శకుంతల మిగుల దుఃఖాన్ని పొందింది.