S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

త్వరలో చుట్టాలబ్బాయి

ఆది, నమితాప్రమోద్ జంటగా శ్రీఐశ్వర్య లక్ష్మీ మూవీస్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వీరభద్రమ్ దర్శకత్వంలో వెంకట్ తలారి, రామ్ తాళ్లూరి రూపొందిస్తున్న ‘చుట్టాలబ్బాయి’ని ఆగస్టు 5న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, ఆది, వీరభద్రమ్ కాంబినేషన్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోకు మంచి ఆదరణ లభిస్తోందన్నారు. సాయికుమార్ ఓ కీలకమైన పాత్రలో నటించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, పృథ్వి, రఘుబాబు, కృష్ణ్భగవాన్, అభిమన్యుసింగ్, జీవా, సురేఖావాణి, షకలక శంకర్, చమ్మక్ చంద్ర, రచ్చరవి, గిరిధర్, అనితానాథ్ ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.్థమన్, కెమెరా: ఎస్.అరుణ్‌కుమార్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, మాటలు: భవానీప్రసాద్, నిర్మాతలు: వెంకట్ తలారి, రామ్ తాళ్లూరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వీరభద్రమ్.