అదరగొడుతున్న ప్రియాంక
Published Monday, 25 July 2016ప్రస్తుతం బాలీవుడ్ గ్లామర్ భామ ప్రియాంక క్రేజ్ మామూలుగా లేదు. వరుసగా సినిమాల్లో నటిస్తూ, మరోవైపు హాలీవుడ్లో కూడా మెరిసిన ఈ భామకు సినిమాలకంటే కూడా ప్రైవేట్ కార్యక్రమాలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా మేగజిన్లకోసం ప్రత్యేక ఫొటోషూట్లంటూ రెచ్చగొడుతోంది. ఇప్పటికే ప్రియాంకతో ఫొటో షూట్ చేయడానికి పలువురు వ్యాపారవేత్తలు క్యూలో వున్నారట. దాంతో సినిమాల్లో నటించేందుకు తీరిక లేకుండా పోతోందని తెలిసింది. ఇటీవలే వచ్చిన బాజీరావు మస్తానీ సినిమాతో అవార్డులు కూడా అందుకున్న ఈమె, హాలీవుడ్లో కూడా మెప్పు పొందింది. ఇప్పటికే హాలీవుడ్లో కూడా మరో రెండు క్రేజీ సినిమాల ఆఫర్లు కూడా వచ్చాయట. ప్రస్తుతం చర్చల దశలో వున్న ఈ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతోందట ప్రియాంక. మొత్తానికి బాలీవుడ్లో ప్రియాంక జోరు తగ్గేలా లేదని గుసగుసలు విన్పిస్తున్నాయి.