నాలుగో షెడ్యూల్లో వైశాఖం
Published Monday, 25 July 2016జయ.బి దర్శకత్వంలో ఆర్.జె. సినిమాస్ పతాకంపై బి.ఎ.రాజు నిర్మిస్తున్న ‘వైశాఖం’ చిత్రం నాలుగో షెడ్యూల్లో కీలకమైన సన్నివేశాల్ని, ఓ ఫైట్‌ని, ఓ పాటని చిత్రీకరించారు. ఈ సందర్భంగా దర్శకురాలు జయ మాట్లాడుతూ, ‘లవ్లీ’ తర్వాత మరోసారి సూపర్‌హిట్ సినిమా ఇవ్వాలన్న లక్ష్యంతో మంచి కథాంశంతో రూపొందిస్తున్న సినిమా ‘వైశాఖం’. ఎంటర్టైన్మెంట్, సెంటిమెంట్ మిక్స్ అయిన ‘వైశాఖం’ అపార్ట్మెంట్స్ నేపథ్యంలో సాగుతుంది. కమర్షియల్‌గా పెద్ద హిట్ రేంజ్‌కి వెళ్తుంది. కజకిస్థాన్‌లో తీసిన సాంగ్స్ హైలైట్ అవుతాయి’ అన్నారు.
నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ, ‘జయ దర్శకత్వంలో వస్తున్న సినిమా అనగానే బయ్యర్స్ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. చిన్న చిత్రం అయినా భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నాం. హైటెక్నికల్ వేల్యూస్‌తో తీస్తున్న ‘వైశాఖం’ మా బేనర్లో వచ్చిన ‘లవ్లీ’కి రెట్టింపు విజయాన్ని అందిస్తుందన్న కాన్ఫిడెన్స్ వుంది. ఆగస్టులో జరిగే అయిదో షెడ్యూల్‌తో దాదాపుగా చిత్రం పూర్తవుతుంది’ అన్నారు. కెమెరా: వాలిశెట్టి వెంకట సుబ్బారావు, సంగీతం: డి.జె.వసంత్, నిర్మాత: బి.ఎ.రాజు, రచన, దర్శకత్వం: జయ బి.