S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మరో శ్రీదేవా?!

చిరంజీవి 150వ చిత్రానికి సంబంధించిన హైప్ ఎంత రావాలో అంత చేశారు. ఇంకా అది చాలదన్నట్లు హీరోయిన్ విషయమై రోజుకొక కొత్త వార్త వినిపిస్తున్నారు. ప్రస్తుతం ఆ బంతి కాజల్ కోర్టులో పడింది. కాజల్ చిరంజీవి సరసన నటించడానికి సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనేక మంది హీరోయిన్ల తర్వాత కాజల్ మాట వినిపిస్తోంది. సహజంగా కాజల్ తనకు అవకాశం ఇచ్చిన హీరోను సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి ముందే వెళ్లి కలవడం ఆనవాయితీగా పెట్టుకున్న అలవాటు. అలా ఈసారి కాజల్ చిరంజీవిని కలిసిందని, కనుక చిరంజీవి చిత్రంలో ఆమే హీరోయిన్ అని వార్తలు వెలువడ్డాయి. ఈ మాటల్లో ఎంత నిజంవుందో లేదో తెలియదు కానీ కాజల్ మాత్రం ఇవన్నీ ట్రాష్ అంటూ కొట్టేస్తోంది. కాజల్ ఇప్పటికే నాలుగైదు చిత్రాల్లో చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ సరసన కథానాయికగా నటించింది. ఇప్పుడు వినిపిస్తున్న వార్త నిజమైతే మాత్రం తండ్రీ కొడుకులకు హీరోయిన్‌గా నటించిన మరో రికార్డును సృష్టిస్తోంది. గతంలో కూడా శ్రీదేవి అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున సరసన హీరోయిన్‌గా చేసి ఓ అద్భుతమే చేసింది. ఇప్పుడు కూడా కాజల్ అదే దారిలో పయనిస్తుందా? మరో శ్రీదేవిలా మారనుందా అనేది వేచి చూడాలి.