S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ధర్మసందేహాలు

* కులాంతర వివాహం చేసుకోకూడదా? అలా చేసుకున్న వారిని చంపటం ధర్మమా?
- యన్.సురేంద్ర, కొత్త గాజువాక
వర్ణాశ్రమ వ్యవస్థ ధర్మమైతే, దాన్ని అతిక్రమించి వర్ణాంతర వివాహాదులను ఆచరించటం అధర్మమే అవుతుంది. అది అధర్మమైనంత మాత్రాన దానికి మనకు తోచిన శిక్షవేయటం ధర్మం కాజాలదు. మన ధర్మశాస్త్రాల ప్రకారం ఇలాంటి అధర్మాలకు మరణదండన ఎంత మాత్రమూ విహితం కాదు, సమర్థనీయం కాదు.
* తెలియక తప్పుచేసిన వారికి జ్ఞానోదయం కావాలంటే, ఏ పూజ చేయాలి? ఏ దేవాలయానికి వెళ్ళాలి?
- పూజ, నెల్లూరు
ఒక్కొక్క కోరికకు ఒక్కొక్క దేవత - అని పెట్టుకోవటం శాస్త్రాలకు సమ్మతమైన విషయం కాదు. ఎవరో ఒక దేవతను తనకు ఇష్టదేవతగా ప్ర ధాన దేవతగా పెట్టుకోవాలి. ఇ క అన్ని కోరికలకూ ఆ దేవతనే ప్రార్థించాలి. ఇదే ఉత్తమం.
* వినాయక చవితికి పెద్దపెద్ద విగ్రహాలనుపెట్టి వ్యాపారం చేసుకుంటున్నారు. ఇది మంచిదేనా?
- రావు, సూర్యాపేట
అది శాస్తస్రమ్మతం మాత్రం కాదు. విగ్రహం పెద్దదయినకొద్దీ పూజ పెరగాలి, నైవేద్యం పెరగాలి, నియమాలు పెరగాలి. అవేవీ లేకుండా విగ్రహాల ఎత్తు మాత్రం పెంచేయటం శాస్త్ర సమ్మతం కాదు.
* మొదటిసారి అయ్యప్ప మాల వేసినవారు తప్పకుండా శబరిమలై వెళ్ళాలా? దగ్గరలో ఉండే ద్వారపూడి అయ్యప్ప ఆలయంలో మాల విడవచ్చా? మొదటిసారి అయ్యప్పమాల ఎన్ని రోజులైనా వేయవచ్చా?
అయ్యప్ప దీక్ష వివరాలు పురాణాలలో లభించవు. ఈ సంప్రదాయంలో వున్న పెద్ద ల ద్వారా మాత్రమే తెలుసుకోవాలి.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279,
రోడ్ నెం. 8, అలకాపురి,
హైదరాబాద్ - 500 035.
vedakavi@serveveda.org