S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అంత్య పుష్కరాలకు కానరాని ఏర్పాట్లు

బాసర, జూలై 24: గోదావరి నదికి పుష్కరాలు గతేడాది జులై 14న ప్రారంభమై 12 రోజులపాటు వైభవంగా సాగాయి. సాధారణంగా ఏ నదికైనా మొదటి 12 రోజులు పుష్కరాలు నిర్వహిస్తారు. కాని గోదావరి నదికి మాత్రం అంత్య పుష్కరాలు నిర్వహించారు. పుష్కర సంవత్సరంలో చివరి 12 రోజులైన ఈనెల 31 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు అంత్య పుష్కరాలు సాగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గోదావరి పుష్కరాలను బాసర వద్ద అటవీ, పర్యావరణశాఖ,బిసి సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న బాసర వద్ద గోదావరి పుష్కరాలను వైభవంగా ప్రారంభించారు. గోదావరి పుష్కరాల మాదిరిగా అంత్య పుష్కరాలు సైతం అంతే మహాత్యం ఉంటుందని స్థానిక పండితులు గురువులు పేర్కొంటున్నారు. బాసర గోదావరి నది వద్ద గత సంవత్సరం పుష్కరాల సందర్భంగా ఏర్పాటుచేసిన సౌకర్యాలు కనుచూపుమేరలో కానరావడం లేదు. సంబంధిత ఆలయ అధికారుల నిర్లక్ష్యంతో భక్తుల సౌకర్యార్థం ఘాట్ల వద్ద ఏర్పాటుచేసిన షెడ్ల రేకులు సైతం ఆలయ అధికారులు, ఆలయ పరిసరాల్లో తాత్కాలికంగా షెడ్డు నిర్మాణానికి వాడుకున్నట్లు స్థానికులు,్భక్తులు ఆరోపిస్తున్నారు. అంత్యపుష్కరాలు ప్రారంభానికి మరో వారం రోజులు గడువు ఉన్నప్పటికి ఆలయ అధికారులు గోదావరివైపు ఏర్పాట్లపై కనె్నత్తి చూడడం లేదు. దీంతో ఈ అంత్యపుష్కరాలకు ప్రభుత్వం దేవాదాయశాఖ అధికారులు ఏర్పాట్లను నిర్వహిస్తారోలేదోనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అంత్య పుష్కరాలకు గోదావరి పుష్కరాల వలే వేల సంఖ్యలో వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు ఉన్నప్పటికి గోదావరి ఘాట్ల వద్ద భక్తులకు సేద తీరేందుకు షామియానాలు, ట్రీలు, బట్టలు మార్చుకునే తాత్కాలిక షెడ్లు, తాత్కాలిక మరుగుదొడ్లు నియమిస్తే అంత్యపుష్కరాలు విజయవంతం అయ్యే అవకాశం ఉంటుందని స్థానిక పండితులు పేర్కొంటున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక శ్రద్ద వహించి అంత్య పుష్కరాలను విజయవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు, భక్తులు కోరుతున్నారు.