S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ముంచుకొస్తున్న ముహుర్తం...

శ్రీరాంపూర్ రూరల్, జూలై 24: సింగరేణిలో రెండునెలల్లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సింగరేణిలో అన్ని కార్మిక సంఘాలు ఒకరిపైఒకరు విమర్శలు చేసుకుంటూ కత్తులుదూసుకుంటున్నా యి. కయ్యానికి కాలుదువ్వుతూ సై అంటే సై అని విమర్శలకు సిద్ధపడుతున్నారు. కార్మిక హక్కులు తామే సాధించామంటే తాము సాధించామని గొప్ప లుచెప్పుకుంటూ కార్మికవర్గంలో యూనియన్లపై పలుచనవుతూ ఒక సంఘంపై మరో సంఘం విమర్శనాస్త్రాలు సందిస్తూ యూనియన్ పరమైన వివాదాలతో పాటు వ్యక్తిగత విమర్శలకుపోవద్దని, తాము సాధించిన హక్కులపైనే చెప్పుకోవాలని ఒక సంఘం చేస్తుండగా, మరో సంఘం యూనియన్‌లో అనుభవాలు లేకున్నప్పటికీ తమపై విమర్శలు చేయడం సరికాదని మరోయూనియన్ ఎదురు దాడికిదిగుతూ కార్మికవర్గంలో చీత్కార చర్యలకు దిగుతున్నారు. గుర్తింపు ప్రాతినిథ్య సంఘాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేస్థాయికి వివాదాలు చేరుకుంటున్నాయి. ఈ రెండు సంఘాలు ఒకానొక సందర్భంలో తన్నుకునేంత వరకు వెళుతున్నాయంటే కార్మికుల్లో యూనియన్లపై పూర్తి నమ్మకం పోయే అవకాశం ఉంది. తామే సాధించామని కార్మిక సమస్యలు పరిష్కరించామని చిందులేస్తున్న కార్మిక సంఘాలు ఇప్పటి వరకు కార్మికులకు సాధించిందేమీలేదని కార్మికులు బాహాటంగానే చెప్పుకొస్తున్నారు. ఇదిలాఉంటే గుర్తిం పు సంఘం 72డిమాండ్లతో ఎన్నికల మేనిఫెస్టో నిర్వహించి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పినప్పటికీ దాదాపు 90శాతం కార్మిక సమస్యలు పరిష్కరించామని గుర్తింపు సంఘం చెబుతున్నప్పటికీ సింగరేణి లో ప్రధానమైన సమస్యలను ఇప్పటి వరకు పరిష్కరించలేదని ప్రతిపక్ష సంఘం కార్మికుల్లో ప్రచారం చేస్తూ లేవనెత్తుతోంది. కార్మిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని చెప్పుకుంటూనే ఈమధ్య కాలంలో యూనియన్లు వీడి మరో యూనియన్‌లో చేరిన నాయకులు వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదంటూ శుక్రవారం ఆర్‌కె-5 గనిపై రెండు యూనియన్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
సింగరేణిలో కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలకు రెండు మాసాలు మాత్రమే గడువు ఉండటంతో గెలుపు కోసమే ఈ సంఘాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని కార్మిక వర్గం గ్రహిస్తూ ప్రస్తుతం సింగరేణిలో అన్నికార్మిక సంఘాలు ఇదేవిధంగా ఉందనేది చెప్పవచ్చు. ఏ సంఘం కూడా తమకు ఒరుగబెట్టిందేమీలేదని కార్మికవర్గం మండిపడుతోంది. కొన్ని సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదని కార్మికులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. కష్టపడి నల్లబంగారాన్ని వెలికితీసి దేశప్రగతికి పాటుపడుతోంటే తమ బతుకుల్లో చీకటి అలుముకుంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇన్‌కం ట్యాక్స్ రద్దు చేయాలని ఎన్నోసార్లు సంఘాలకు మొరపెట్టుకున్నప్పటికీ కార్మిక సంఘా లు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని కార్మికవర్గం మండిపడుతోంది. మరోవైపు కార్మిక సంఘా లు అన్ని సమస్యలు పరిష్కరించామని చెప్పడం సరికాదని, సింగరేణిలో సంఘాలు కూడా సామ్రాజ్యవాదానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయనేది కార్మికుల ఆరోపణ. సంఘాలు ఎన్నికల విజయం కోసం ఎత్తుగడలు తప్ప చిత్తశుద్ధితో కార్మిక సమస్యల పరిష్కారానికి చొరవచూపడం లేదనేది వాస్త వం. ఇప్పటికైనా అన్నికార్మిక సంఘాలు ఏకతాటిపైకి వచ్చి సమస్యలు పరిష్కరించాలని కార్మిక వర్గం కోరుకుంటోంది.