S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలి

కుంటాల, జూలై 24: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. హరితహారంలో భాగంగా ఆదివారం మండలంలోని అర్లికె ఎక్స్‌రోడ్డు వద్ద గల సాయి శ్రేయ ఫిల్లింగ్ స్టేషన్‌లో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి హరిత తెలంగాణను సాధించుకుందామని ఆయన తెలిపారు. నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ జుట్టు లక్ష్మణ్, మాజీ జడ్పీ చైర్మన్ జుట్టు అశోక్, టిఆర్‌ఎస్ మండల పార్టీ కన్వీనర్ రమణాగౌడ్, మండల ఉపాధ్యక్షుడు లక్ష్మణ్‌పటేల్, సర్పంచ్‌లు అశోక్‌రెడ్డి, బుచ్చన్న, నాయకులు ఖదీర్, జుట్టు మహేంధర్, దేవిదాస్, పండరీ, భవాని, శ్రీనివాస్‌గౌడ్, దిగంబర్‌తో పాటు తదితరులు ఉన్నారు.