S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మొక్కలు నాటి సంరక్షించండి

మందమర్రి, జూలై 24: హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు కోరారు. ఆదివారం స్థానిక 6వ వార్డులోని ఊరు రామకృష్ణాపూర్‌లో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఊరు రామకృష్ణాపూర్, ఎమ్మెల్యే కాలనీల్లో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హరితహారం కార్యక్రమాన్ని ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో పాల్గొని విజయవంతం చేస్తున్నారని, మరింత ఉత్సాహంతో మున్ముందు మొక్కలు నాటాలని ఆయన కోరారు. మొక్కలు నాటడమే కాదు, వాటిని పసిపాపకంటే ఎక్కువగా చూడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. అనంతరం పెద్ద ఎత్తున గ్రామ ప్రజలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు జె.రవీందర్, బత్తుల శ్రీనివాస్, తిరుపతి, ప్రసాద్, ఎస్.ప్రభాకర్, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.