S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గుత్ప ఎత్తిపోతల నీరు విడుదల చేయాలి

ఆర్మూర్, జూలై 24: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండినందున వెంటనే గుత్ప ఎత్తిపోతల పథకం నుంచి ఆర్మూర్ చివరి ఆయకట్టుకు నీరు విడుదల చేయాలని టిడిపి జిల్లా అధ్యక్షుడు, టిటిడి డైరెక్టర్ అర్కెల నర్సారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్మూర్‌లోని రోడ్లు, భవనాల శాఖ అతిథిగృహంలో ఆదివారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. వర్షాలు కురిసినప్పటికి చెరువులు, కుంటలు నిండలేదని, అందువల్ల గుత్ప ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల చేసి చెరువులను నింపాలని ఆయన చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిచి అమెరికా పర్యటన చేయడం కాదని, స్థానిక రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం మూడవ సంవత్సరం గడుస్తున్నా రైతుల రుణాలను మాఫీ చేయలేదని అన్నారు. ఏకకాలంలో రుణమాఫీ డబ్బులను విడుదల చేసి కొత్త రుణాలు ఇవ్వాలని అన్నారు. ఈ విషయమై ఈ నెల 29వ తేదిన ఆర్మూర్‌లో బ్యాంకు ఎదుట ధర్నా చేస్తామని చెప్పారు.
పాత రుణాలను మాఫీ చేసి కొత్త రుణాలు ఇచ్చినప్పుడే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితం అవుతోందే తప్ప ఆచరణలో మాత్రం ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని ఆయన విమర్శించారు. అనంతరం టిటిడి డైరెక్టర్‌గా ఎన్నికైన అర్కెల నర్సారెడ్డిని శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సమావేశంలో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి దేగాం యాదాగౌడ్, మండల, పట్టణ అధ్యక్షులు జితేందర్, జివి నర్సింహారెడ్డి, కిశోర్‌రెడ్డి, అలీమ్, స్వామియాదవ్ పాల్గొన్నారు.