S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

టిడిపికి పూర్వవైభవం తేవాలి

మహబూబ్‌నగర్, జూలై 24: జిల్లా నేతలు ఇక దూకుడు పెంచాలి. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటింది. వారి తప్పులు పెరిగిపోయావని ప్రభుత్వంపై ప్రజా పోరాటాలు చేయాలని టిడిపి జిల్లా ఇన్‌చార్జి, రాజసభ సభ్యుడు గరికెపాటి మోహన్‌రావు ఉద్భోదించారు. ఆదివారం షాద్‌నగర్ నియోజకవరం కొత్తూరు మండల పరిధిలోని పప్‌రాస్‌పోర్టులో జిల్లా టిడిపి సమన్వయ కమిటీ సమావేశం రహస్యంగా నిర్వహించారు. ముందుగా మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో జిల్లాలోని రాజకీయ పరిస్థితులతో పాటు జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న పలు అంశాలపై చర్చించారు. తెరాస నాయకుల వ్యవహారశైలిపై ప్రజల్లో ఎలాఉందనే అశంపై కూడా చర్చజరిగింది. జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి జిల్లా నేతలు జిల్లా ఇంచార్జికి పలు సలహలు సూచనలు ఇచ్చారు. జిల్లాలోన పలు నియోజకవర్గాలలో ఇంచార్జిలు కూడా బలమైన నాయకులు లెకపోవడంతో పార్టీ కార్యకర్తలు నిరుత్సాహంతో ఉన్నారని తప్పని పరిస్థితుల్లో కొన్ని గ్రామాలలో పార్టీలు కూడా మారుతున్నారని అదే నియోజకవర్గ ఇంచార్జిలు బలమైన నాయకుడు ఉంటే పార్టీని వీడి వెళ్లిన వారు తిరిగి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఈ సందర్భంగా సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. టిడిపి జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సిములు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాజసభ సభ్యులు గరికపాటి మోహన్‌రావుతో పాటు టిడిపి పోలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ నియోజకవర్గ ఇంచార్జి ఎన్‌పి వెంకటేష్, రాష్ట్ర నాయకులు నాగేశ్వర్‌రెడ్డి, వివిధ నియోజకవర్గాల ఇంచార్జిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో జిల్లా ఇంచార్జి గరికపాటి రామోహన్‌రావు మాట్లాడుతూ జిల్లాలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని నియోజకవర్గ ఇంచార్జిలు లేని దగ్గర అయా నియోజకవర్గాలలో జిల్లాకు చెందిన రాష్ట్ర నాయకులు పర్యటించాలని కార్యకర్తలకు అండగా ఉండాలని తెలిపారు. తెరాస నాయకులు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఇక ఎండగట్టాలని ఇక తమ దూకుడును ప్రదర్శించాలని తెలిపారు.
నిరంతరం ప్రజల మధ్య ఉన్న నాయకులను ఏ పార్టీలో ఉన్న వారిని ప్రజలు ఆదరిస్తారని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి గ్రామ గ్రామాన కార్యకర్తలు ఉన్నారని వారి శక్తితో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గ్రామ, మండల కమిటీలను పూర్తి చేయాలని ముఖ్యంగా పార్టీ అనుబంధ సంఘాల బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిందని ఇక వారు చేస్తున్న తప్పులను ఎండగడుతూ జిల్లా నాయకులంతా దూకుడుగా ఉంటూ రాజకీయ ఎతుగడలు వేస్తూ ప్రజల సమస్యలపై పోరాటాలు చేయాలని తెలిపారు. నారాయణపేట - కోడంగల్ ఎత్తిపోతలపై ప్రస్తుతం అఖిల పక్షం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాపాదయాత్రలో ముఖ్యపాత్ర పోశించాలని తెలిపారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి సంబందించిన జొన్నలబొగుడ, గుడిపల్లిగట్టు లీఫ్ట్‌లను సందర్శించాలని ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులపై చూపిస్తున్న నిర్లక్ష్య దోరణిని ఎండగట్టాలని నేతలకు సూచించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీలలో డబుల్ బెడ్‌రూం పథకం అటర్‌ఫ్లాప్ అయిందని వాటిపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఇలాంటి అంశాలలో ప్రజలను తమ వైపు తిప్పించుకుని ప్రజా పోరాటాలు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని తెలిపారు. ప్రాజెక్టుల రీడిజైన్‌పై కూడా ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచి అందులో జరుగుతున్న అవినీతిని ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలన్నారు. ముఖ్యంగా ఓ పక్క ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే మరో పక్క జిల్లాలో టిడిపికి పూర్వవైభం తీసుకువచ్చేందుకు నేతలు ప్రత్యేక దృష్టి పెటాల్సిన అవసరం ఉందన్నారు.