S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మిషన్ భగీరథలో అపశృతి

మెదక్ రూరల్, జూలై 24: మిషన్ భగీరథ పనుల నిర్మాణంలో అపశృతి చోటుచేసుకుంది. సంపు నిర్మాణం కోసం గుట్ట వద్ద ఉన్న బండరాళ్లను బ్లాస్టింగ్ చేయగా రాళ్లు ఎగిసిపడి సమీపంలోనేగల కోళ్లఫారం రేకులు ధ్వంసమయ్యాయి. వందకుపైగా కోళ్లు మృతిచెందాయి. సుమారు రెండు లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. కోళ్ల ఫారం యజమాని మాయ వెంకటేశం కథనం ప్రకారం శనివారం రాత్రి మెదక్-రామాయంపేట మెయిన్ రోడ్డుపక్కన, పాతూర్ శివారులో మిషన్ భగీరథ సంపు నిర్మాణం కోసం గుట్టవద్ద బండరాళ్లును పగులగొడుతున్నారు. ఇందుకోసం తరచు బ్లాసింగ్ చేస్తున్నారు. ఎప్పటిలాగే శనివారం రాత్రి కూడా బ్లాస్టింగ్ చేయగా స్థాయికి మించి మందుపాతర ఏర్పాటు చేయడంతో పెద్దపెద్ద బండరాళ్లు ఎగిసిపడ్డాయి. సంఘటన స్థలం నుండి వందమీటర్ల అవతల కూడా రాళ్లు కనిపిస్తున్నాయి. రోడ్డుకు అవతలివైపున గల ఐదువేల కోళ్ల సామర్ద్యం కలిగిన కోళ్లఫారంపై రాళ్లు పడడంతో షెడ్డు రేకులు ధ్వంసమయ్యాయి. వందకుపైగా కోళ్లు మృతిచెందాయి. మరికొన్ని కోళ్లు శబ్దతాకిడికి బయటకు పరుగెత్తినట్లు బాధితుడు వివరించారు. ఈ ప్రమాదంలో సుమారు 2 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నాడు.
బ్లాస్టింగ్‌కు అనుమతిలేదు: తహశీల్దార్
పాతూర్ సమీపంలో బండరాళ్లు బ్లాస్టింగ్‌కు తాము ఎలాంటి అనుమతి ఇవ్వలేదని తహశీల్దార్ అమీనుద్దిన్ తెలిపారు. కనీసం తమకు సమాచారం కూడా ఇవ్వలేదన్నారు. బ్లాస్టింగ్‌పై స్థానిక గ్రామ రెవెన్యు అధికారి ద్వారా నివేదిక తెప్పించుకున్నట్లు చెప్పారు. అనుమతిలేకుండా బ్లాస్టింగ్‌లక పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
డిఇ దినేష్ సందర్శన
మిషన్ భగీరథ సంపు నిర్మాణం కోసం బ్లాస్టింగ్ చేసిన ప్రాంతాన్ని, ధ్వంసమెన షెడ్డును డిఇ దినేష్ ఆదివారం ఉదయం సందర్శించారు. మృతిచెందిన కోళ్లు పరిశీలించారు. బాధితుడు మాయ వెంకటేశంతో మాట్లాడారు. ఇతరులకు ఇబ్బందులు కలగకుండా రాళ్లు పగులగొట్టాలని సదరు పనులు చేపడుతున్న కాంట్రాక్టర్‌కు సూచించారు. మున్సిపల్ కౌన్సిలర్ మాయ మల్లేశం ధ్వంసమైన షెడ్డును పరిశీలించారు.