S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రాజెక్టులను అడ్డుకోవద్దు

జనగామ టౌన్, జూలై 24: రాష్ట్రంలో చేపడుతున్న కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకోవద్దని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. జనగామ డివిజన్ మద్దూర్ మండలం దూల్మిట్ట గ్రామంలో ఆదివారం ‘ఆణిముత్యాలు’ పుస్తకావిష్కరణ కార్యక్రమం హన్మంతారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దుకునేందుకే కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నామని అన్నారు. అభివృద్ధికి తోడ్పాటునందించాల్సిన ప్రతిపక్షాలు అవాస్తవ ఆరోపణలతో ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నాయని విమర్శించారు. రూ. 25 వేల కోట్ల నిధులతో రాష్ట్రంలో ప్రాజెక్టులను నిర్మిస్తున్న ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానికే ఉందని అన్నారు. అందులో 80 శాతం సాగునీటికి, 10 శాతం తాగునీటి కోసం, మరో 10 శాతం ప్రాజెక్టులకు అందిస్తూ అభివృద్ధికి కృషి చేస్తున్న విషయాన్ని గమనించాలని కోరారు. అంతేకాకుండా నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ కోసం ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు వివిధ 24వేల 914 ఉద్యోగాలను భర్తీ చేశామని, సుమారు మరో 18వేల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ సిఎం కెసిఆర్, మంత్రి హరీష్‌రావుల సహకారంతో జనగామ నియోజకవర్గంలోని చెరువులన్నింటినీ మొదటి దఫా నింపామని, అలాగే రెండో విడతగా నింపేందుకు తోడ్పాటునందించాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, సుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాజలింగం, మాజీ ఆప్కో చైర్మన్ మండల శ్రీరాములు, నాగపురి కిరణ్‌లు పాల్గొన్నారు.